ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్–2 (కృష్ణ) విభాగంలో ఉత్పత్తి 50 మిలియన్ టన్నులకు చేరింది. ఈ విభాగం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 50 మిలియన్ టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి సాధించి మరో మైలురాయికి చేరుకుంది. ఈ విభాగంలో ఉత్పత్తి 1992 మార్చి 21న ప్రారంభమైంది. 50 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకున్న సందర్భంగా విభాగంలో గురువారం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సీఎండీ అతుల్ భట్ మాట్లాడుతూ ప్లాంట్‌కు అత్యంత కీలక విభాగమైన బ్లాస్ట్ ఫర్నేస్ మరో మైలురాయికి చేరుకోవడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ.కె.బాగ్జి, సీజీఎం (వర్క్స్) ఎన్.వి.స్వామి, సీజీఎం (ఐరన్) ఆర్.మొహంతి, విభాగాధిపతి ఉదయ్‌నాగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment