విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సరికొత్త రికార్డు | Visakha Steel Plant newest record | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సరికొత్త రికార్డు

Feb 20 2022 5:42 AM | Updated on Feb 20 2022 11:44 AM

Visakha Steel Plant newest record - Sakshi

ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తిలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ నెలలోనే ఐదు సార్లు అత్యధికంగా హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేసి రికార్డులు నమోదు చేసిన స్టీల్‌ ప్లాంట్‌.. తాజాగా వాటిని అధిగమించింది. ఆవిర్భావ దినోత్సవం రోజైన శుక్రవారం.. బ్లాస్ట్‌ ఫర్నేస్‌–1లో 8,019 టన్నుల హాట్‌ మెటల్‌ను ఉత్పత్తి చేసింది. అంతకుముందు అత్యధికంగా ఈ నెల 8న 7,620 టన్నులు, 13న 7,670 టన్నులు, 15న 7,730 టన్నులు, 16న 7,835 టన్నులు, 17న ఉత్పత్తి 7,874 టన్నుల ఉత్పత్తి ద్వారా నెలకొల్పిన రికార్డులను అధిగమించింది. కార్మికులను సీఎండీ అతుల్‌ భట్, డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) ఏకే సక్సేనా అభినందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement