
రెండో స్థానంలో కృష్ణా.. మూడో స్థానంలో ఎన్టీఆర్..
సాక్షి, అమరావతి : తలసరి ఆదాయంలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విశాఖపట్నం జిల్లా మొదటి స్థానంలో ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.83,440 అధికం. అంతకుముందు ఏడాది 2022–23లో ఈ జిల్లా తలసరి ఆదాయం రూ.4,02,798లు ఉండగా.. 2023–24కు వచ్చేసరికి అది రూ.4,86,238కు పెరిగింది.
ఇక 2023–24కు సంబంధించి కృష్ణాజిల్లా రూ.3,75,975లతో రెండో స్థానంలో ఉండగా.. ఎన్టీఆర్ జిల్లా రూ.3,21,154లతో మూడో స్థానంలోనూ, తిరుపతి జిల్లా నాలుగో స్థానంలోను ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రూ.1,41,730లతో చివరి స్థానంలో ఉంది. జిల్లాల వారీగా తలసరి ఆదాయాలను రాష్ట్ర ప్రణాళికా శాఖ పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది.
