
రెండో స్థానంలో కృష్ణా.. మూడులో ఏలూరు, చివర్లో అల్లూరి జిల్లా
జిల్లాల పెంపు తర్వాత తొలిసారి తలసరి ఆదాయం లెక్కింపు
2022–23కు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు పెంచిన తరువాత తొలిసారిగా 2022–23 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాల వారీగా తలసరి ఆదాయం లెక్కలను డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ వెల్లడించింది.
ఈ లెక్కల ప్రకారం విశాఖపట్నం జిల్లా నంబర్‌వన్ స్థానంలో ఉండగా, రెండులో కృష్ణా, మూడులో ఏలూరు జిల్లా ఉంది. 2021–22లో ఉమ్మడి జిల్లాల్లో తలసరి ఆదాయంలో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో ఉండగా విశాఖపట్నం రెండో స్థానంలో ఉంది. చివరి స్థానంలో విజయనగరం జిల్లా ఉంది.