ఆకుకూరలు తినడం మంచిదని తినేస్తుంటారు. కానీ ఇవి ఎలా పండుతున్నాయ్, వాటిలో ఏం ఉంటున్నాయ్ అన్నవి తెలుసుకోకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. బెంగుళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లోని దుకాణాల్లో అస్సలు ఆకుకూరలు కొనుగోలు చేయొద్దు, తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకని? ఏం జరిగింది...
బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఆకుకూరలను మరుగు నీటి వ్యర్థాలతో పండిస్తున్నారు. దీంతో ఆ మొక్కలు మోతాదుకు మించి లోహన్ని గ్రహిస్తున్నాయిని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అందులోనూ ఆకుకూరలు కూరగాయాల కంటే ఎక్కువ లోహాన్ని గ్రహిస్తాయి. ఈ మేరకు బెంగళూరులోని ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు కొన్ని ఆకుకూరలను సేకరించి పరీక్షించగా వాటిలో అధిక మోతాదులో మెటల్ సాంద్రతలు ఉన్నట్లు గుర్తించారు.
వారి పరిశోధన ప్రకారం కూరగాయాల్లో సూచించిన దాని కంటే లోహాలు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అవి కాస్త హైపర్ అక్యుమ్యులేటర్‌లుగా మారాయని పరిశోధకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బచ్చలి, ఆకుకూరల్లో లోహం మోతాదు ఎక్కువుగా ఉన్నట్లు తెలిపారు. అలాగే కొన్ని రకాల కాయగూరల్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలా అధిక మోతాదులో మెటల్ కలిగిన కలుషిత ఆకుకూరలు,కాయగూరలు తీసుకోవడం వల్ల క్యాన్సర్, రక్తహీనత, రక్తపోటు, పోషకాహార లోపం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆకుకూరల్లో ఉండాల్సిన లోహం 425.5 mg/kg కాగా, వాటిలో 514.05 mg/kg లోహం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. భారీ లోహలు మానవ శరీరాన్ని బాగా ప్రభవితం చేస్తాయిని, ఫలితంగా ఈ కింది అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
- కాలేయం సంబంధిత సమస్యలు
- ఊపిరితిత్తుల సమస్యలు
- మూత్రపిండ పమస్యలు
- బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ
- రక్తహీనత
- ఊపిరి ఆడకపోవడం లేదా ఆస్మా వంటి వ్యాధులు
- పిల్లలు కౌమారదశలోనే ఊబకాయం రావడం
- కాలేయ క్యాన్సర్
- గుండె జబ్బులు
- ఎముకల వ్యాధులు
- పుట్టుకతో వచ్చే వైకల్యాలు
- తక్కువ జనన బరువు
అందువల్ల దయచేసి సేంద్రీయ ఎరువులతో సురక్షితమైన ప్రదేశంలో పెరిగిన ఆకుకూరలనే తినేందుకు యత్నించండి. కుదరకపోతే ఎట్టిపరిస్థితుల్లో అలా పండిన ఆకుకూరలను అస్సలు తినొద్దని స్త్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం బెంగుళూరులోని ఆకుకూరలన్నింటిలో లోహం సాంద్రత ఎక్కువ ఉందని బెంగుళూరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ కమిషనర్ ప్రకారం అసురక్షితంగా లోహం అధికంగా ఉన్న కూరగాయాలను పండిస్తున్న లేదా విక్రయిస్తున్న వారిని ఆరు నెలల నుంచి ఆరేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు లక్ష నుంచి ఐదు లక్షల వరకు జరిమానా పడుతుంది.
(చదవండి: ఏకంగా 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది!ఆల్‌మోస్ట్ డెడ్ కానీ..)
Comments
Please login to add a commentAdd a comment