సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆరంభంనుంచీ సానుకూలంగా కదిలిన కీలక సూచీలు చివరికి పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా నిఫ్టీ 10,500 స్థాయిని దాటింది. సెన్సెక్స్176 పాయింట్ల లాభంతో 33,969వద్ద,నిఫ్టీ 63పాయింట్ల లాభంతో 10,564వద్ద ముగిశాయి. ముఖ్యంగా మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ షేర్ల లాభాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. మెటల్ ఇండెక్స్ సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. రియల్టీ, ఐటీ, ఆటో నష్టపోయాయి.
టాటా స్టీల్, డా.రెడ్డీస్, ఎల్ అండటీ, ఆసియన్ పెయింట్స్, జిందాల్ స్టీల్ జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్, టాటా స్టీల్, ఎన్‌ఎండీసీ, కోల్ ఇండియా, హింద్ జింక్, వేదాంతా, నాల్కో, ఎంవోఐఎల్, హిందాల్కో లాభపడ్డాయి. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఐడీబీఐ, బీవోఐ, పీఎన్‌బీ, బీవోబీ, ఓబీసీ, ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎస్‌బీఐ, సిండికేట్, అలహాబాద్ బ్యాంక్ లాభపడ్డాయి. ఇక ఐషర్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, హీరోమోటో, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ నష్టాలను చవి చూశాయి
Comments
Please login to add a commentAdd a comment