తొలుత అటూఇటుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 709 పాయింట్లు పతనమై 38,137ను తాకగా.. నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 11,322 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,990- 38,073 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,535- 11,252 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో వరుసగా మూడో రోజు శుక్రవారం యూఎస్ మార్కెట్లు డీలా పడ్డాయి. చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు కొనసాగుతుండటంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఐటీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ క్షీణించగా.. ఐటీ 1.6 శాతం ఎగసింది. మెటల్, మీడియా, రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ 3.7-1.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా మోటార్స్, ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్, గెయిల్, ఇన్‌ఫ్రాటెల్, టాటా స్టీల్, సిప్లా, నెస్లే, ఐవోసీ, బ్రిటానియా, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్, అల్ట్రాటెక్, ఎంఅండ్‌ఎం, జీ, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్7-3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, విప్రో 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి.
ఐబీ హౌసింగ్ పతనం..
డెరివేటివ్ కౌంటర్లలో ఐబీ హౌసింగ్ 13 శాతం కుప్పకూలగా.. జిందాల్ స్టీల్, గ్లెన్‌మార్క్, పీవీఆర్, బంధన్ బ్యాంక్, ఐడియా, మదర్‌సన్, పిరమల్, బయోకాన్, బాలకృష్ణ, ఆర్‌బీఎల్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, ఆర్‌ఈసీ, టాటా పవర్, పీఎఫ్‌సీ, సెయిల్, టొరంట్ ఫార్మా, డీఎల్‌ఎఫ్ 8.5-4.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క మైండ్‌ట్రీ, అపోలో హాస్పిటల్స్ మాత్రమే అదికూడా 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున డీలా పడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో1969 నష్టపోగా..653 లాభాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment