ముంబై:దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గో రోజు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల భారీ నష్టంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 60 పాయింట్ల నష్ట పోయింది. ప్రస్తుతం నిఫ్టీ 8,200 పాయింట్లతో కొనసాగుతోంది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రతికూల ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై పడిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు.
ఇదిలా ఉండగా డాలరుతో రూపాయి మారకం విలువ 63.40 కు పడిపోయింది. ఇది ఎనిమిది నెలల కనిష్టస్థాయికి పడిపోవడం గమనార్హం.