వాషింగ్టన్: టైటానియం బంగారం మిళి తమై ఏర్పడ్డ లోహం ఉక్కు కంటే మూడు నుంచి నాలుగు రెట్లు గట్టిగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది చాలా లోహాల కంటే గట్టిదని తెలిపారు. దీన్ని వైద్య రంగంలో కూడా వాడవచ్చని రైస్ వర్సిటీకి చెందిన ఎమీలియా మొరోసన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. టైటానియం గట్టి పదార్థమని, దీన్ని కృత్రిమ మోకాళ్లు, తొం టికీళ్ల నిర్మాణానికి వినియోగిస్తారన్నారు.