Four times
-
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్‌లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్‌ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్‌లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Earthquake in Nepal: నేపాల్‌లో భూకంపం
కాఠ్మండు: నేపాల్ రాజధాని కాఠ్మండును ఆదివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. ధడింగ్ జిల్లా కేంద్రంగా ఉదయం 7.39 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూమి కంపించిందని యంత్రాంగం తెలిపింది. మరో 29 నిమిషాల అనంతరం ధడింగ్ జిల్లాలోనే భూ ప్రకంపనలు మరో నాలుగుసార్లు సంభవించినట్లు పేర్కొంది. దీంతో, రాజధాని ప్రాంతంలోని 20 ఇళ్ల వరకు దెబ్బతిన్నాయని, మరో 70 వరకు ఇళ్ల గోడలు బీటలువారాయని పేర్కొంది. ఎటువంటి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదని వెల్లడించింది. భూకంపం ప్రభావం బాగ్మతి, గండకి ప్రావిన్స్‌ల వరకు కనిపించింది. -
లేఆఫ్స్ దారుణం.. ఒకటీ రెండు కాదు.. నాలుగు సార్లు పీకేశారు!
టెక్ కంపెనీల్లో లేఆఫ్‌ల పరంపరకు అడ్డుకట్ట పడటం లేదు. కొన్నేళ్ల క్రితమే మొదలైన తొలగింపులు ఇటీవల ఎక్కువయ్యాయి. కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఒకసారి లేఆఫ్‌కు గురై ఉద్యోగం కోల్పోతేనే జీవనం దుర్భరంగా మారుతుంది. మరి చేరిన ప్రతి కంపెనీ ఉద్యోగం పీకేస్తే.. ఒకటీ, రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు..(ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే!)బిజినెస్ ఇన్సైడర్ కథనంప్రకారం... కాలిఫోర్నియాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, 33 ఏళ్ల జానెట్ అన్నే పనెన్ తన టెక్ కెరీర్లో వరుసగా నాలుగుసార్లు లేఆఫ్స్‌కు గురై ఉద్యోగాలు కోల్పోయారు. ఆమె మొదటి ఉద్యోగం రెడ్డిట్‌లో రెండు నెలల పాటు సోషల్ మీడియా అసిస్టెంట్‌గా చేశారు. ఆ కంపెనీ ఆమెతో పాటు మొత్తం బృందాన్ని తొలగించింది. ఆ తర్వాత ఆమె ఉబర్ హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగం సంపాదించగలిగింది. అయితే అక్కడ రెండేళ్లు పని చేసిన తర్వాత కంపెనీ ఆమెకు పింక్ స్లిప్ అందజేసింది. ఆ తర్వాత ఆమె డ్రాప్‌బాక్స్ కంపెనీలో సపోర్ట్ ఇంజనీర్‌గా చేరారు. రెండేళ్ల తర్వాత ఆ కంపెనీ ఆమెను తొలగించింది. గత వారమే స్నాప్డాక్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరింది. ఇంతలోనే నాలుగో ఉద్యోగం కూడా పోయింది.(త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్!)తన లేఆఫ్స్ గురించి పనెన్ భావోద్వేగంతో పేర్కొన్నారు. మొదటిసారి తనను తొలగించినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పిన ఆమె మూడో సారి అయితే తనతో పనిచేసిన బృందాన్ని వీడుతున్నందుకు మనసుకు చాలా కష్టంగా ఉండిందని వివరించారు. ఇక తాజాగా నాలుగో సారి లే ఆఫ్‌తో తన ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.టెక్ దిగ్గజాలు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం ఒక్క మెటా, అమెజాన్, గూగుల్ కంపెనీలు మాత్రమే 60,000 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 11,000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించిన మెటా ఇటీవల మరో 10,000 మందిని తొలగించింది. అమెజాన్ కూడా రెండు రౌండ్లలో 27,000 మందికి ఉద్వాసన పలికింది. ఇక గూగుల్ 12,000 మందిని తప్పుకోవాలని ఆదేశించింది.(జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు) -
విధిని ఎదిరించిన విజేత!
జియా బోయు.. నిరాశ, డిప్రెషన్‌తో కుంగిపోయేవారికి అద్భుతమైన ఔషధంగా పనిచేసే పేరు అతనిది. తమ జీవితం ఇంతటితో ముగిసిపోయిందనుకునే వారుసైతం ఏదైనా సాధించేలా స్ఫూర్తినిచ్చే వ్యక్తి అతను. ఈ రెండు మాటలు చదివిన తర్వాత అంతలా గొప్పదనం ఏముంది అతనిలో? అని తెలుసుకోవానిపిస్తోంది కదూ..! నిజంగా చెప్పాలంటే అతడు సామాన్యుడి కంటే కూడా బలహీనుడు. అయితే అది శారీరకంగా మాత్రమే. మానసికంగా ఎంతో బలవంతుడు. ఎంతగా అంటే... చదవండి.. సాక్షి, స్టూడెంట్ ఎడిషన్: రెండు కాళ్లు లేకున్నా ఎవరైనా ఎవరెస్టు ఎక్కగలరా? పైగా బ్లడ్ క్యాన్సర్ ఓవైపు శరీరాన్ని తొలిచేస్తుంటే.. పర్వతాలను అధిరోహించాలన్న ఆలోచన ఎవరైనా చేస్తారా? అదీ ఏడు పదుల వయసులో.. ఎవరికైనా సాధ్యమేనా? అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతని గురించి తెలుసుకోకుండా ఉండడం భావ్యమా? అందుకే జియా బోయును మీ ముందుకు తీసుకొచ్చాం. కల నెరవేరే రోజు కోసం..: కళ్లు లేనివారు, కాళ్లు లేనివారు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి వీల్లేకుండా నేపాల్ ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. దీంతో జియా బోయు తీవ్రంగా నిరాశపడ్డాడు. ఇక తన కల.. కలగానే మిగిలిపోతుందని కుమిలిపోయాడు. ఎందుకంటే బోయుకు రెండు కాళ్లు లేవు. నలభై ఏళ్ల కిందట ‘మంచుకాటు’తో రెండు కాళ్లు కోల్పోయాడు. కానీ ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన పోరాటంతో ఎట్టకేలకు నేపాల్ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో బోయు ఎంతగానో సంతోషపడుతున్నాడు. మరోసారి ప్రపంచ పైకప్పుపైకి ఎక్కి సగర్వంగా నిలబడాలనుకుంటున్నాడు. ఐదోసారి ఎక్కేందుకు..: ఇప్పటికి నాలుగుసార్లు ఎవరెస్టు అధిరోహించాడు జియా. చివరిసారిగా 1975లో చైనాకు చెందిన ఓ బృందంతో కలిసి ఎవరెస్టును ఎక్కుతుండగా మంచు తుపాను ముంచెత్తింది. దీంతో తమతో వచ్చినవారంతా భయపడి వెనకడుగు వేశారు. జియా, మరికొంత మంది మాత్రం శిఖరంవైపే వెళ్లారు. మరికొన్ని అడుగులు వేస్తే ఎవరెస్టును చేరుకుంటామనగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెళ్లినవారంతా మంచులో కూరుకుపోయారు. వారిలో జియా కూడా ఉన్నాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినా మంచుకాటు కారణంగా అతని కాళ్లు చచ్చుబడిపోయాయి. చేసేదిలేక వైద్యులు రెండు కాళ్లను తొలగించారు. అప్పుడే బ్లడ్ క్యాన్సర్ కూడా ఉన్నట్లు తేలింది. విధిని ఎదిరించి.. : వయసు పైడుతున్నా, బ్లడ్ క్యాన్సర్ మరణానికి చేరువ చేస్తున్నా.. అంగవైకల్యాన్ని మర్చిపోయి జియా బోయు ఎవరెస్టు వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏప్రిల్‌లోనే పర్వాతారోహణకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో త్వరలోనే తన యాత్ర ప్రారంభించబోతున్నాడు. ఎవరెస్టు అధిరోహిస్తాడా? లేదా? అన్నది పక్కనబెడితే.. జీవితంలో ఇన్ని ఎదురుదెబ్బలను తట్టుకొని నిలబడిన జియా మనందరి దృష్టిలో విజేతే. -
ఉక్కు కంటే నాలుగు రెట్ల గట్టి లోహం!
వాషింగ్టన్: టైటానియం బంగారం మిళి తమై ఏర్పడ్డ లోహం ఉక్కు కంటే మూడు నుంచి నాలుగు రెట్లు గట్టిగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది చాలా లోహాల కంటే గట్టిదని తెలిపారు. దీన్ని వైద్య రంగంలో కూడా వాడవచ్చని రైస్ వర్సిటీకి చెందిన ఎమీలియా మొరోసన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. టైటానియం గట్టి పదార్థమని, దీన్ని కృత్రిమ మోకాళ్లు, తొం టికీళ్ల నిర్మాణానికి వినియోగిస్తారన్నారు. -
ఓట్ల జాతర.. ఐదు వారాల్లో నాలుగు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓట్ల జాతర వస్తోంది. గతంలో ఎన్నడూ లేదని విధంగా ఐదు వారాల వ్యవధిలో నాలుగుసార్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నొటిఫికేషన్లు వెలువడ్డాయి. ఎన్నికల అనంతరం రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం పంచాయతీ రాజ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 6న జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ మినహా 22 జిల్లాల ఓటర్లు రెండేసి ఓట్లు వేయాలి. ఇక మార్చి 30న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 30, మే 7 తేదీల్లో శాసన సభ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. -
మాపై దయచూపండి సారూ..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :మాసమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చాం. మా సమస్యలపై మూడు నాలుగు సార్లు అర్జీలు ఇచ్చాం. అయినా మండల అధికారులు పట్టిం చుకోవడంలేదు. బస్సు చార్జీలు పెట్టుకొని వెళ్లి, తిండి తిప్పలు లేకుండా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కరించడం లేదు. దయ చేసి మీరైనా మా మొరను ఆలకించండి సారూ... అంటూ వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన బాధితులు గ్రీవెన్స్‌డేలో జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు, జేసీ హరిజవహర్‌లాల్, అదనపుజేసీ నీకంఠంలను కోరారు. సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. కార్డు ఉన్నా ఫలితం లేదు నాకు భార్య, ఇద్ధరు పిల్లలు ఉన్నారు. పుట్టుకతోనే నా ఎడమ కాలికి పోలియో వచ్చింది. రచ్చబండలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మొదట కూపన్లు ఇచ్చారు. కూపన్లు ఉన్నంత వరకు సరుకులూ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్లో రేషన్ కార్డు మంజూరు చేశారు. అప్పటి నుంచి నాకు రేషన్ సరుకులు రావడంలేదు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అడిగినా స్పందించడం లేదు. ఆన్లైన్లో కార్డు నెంబర్ లేకపోవడంతో సరుకులు రావడంలేదని డీలరు చెప్పాడు. గ్రీవెన్స్‌డేలో రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు పరిష్కారం కాలేదు. వికలాంగుడినైన నాకు రేషన్ సరుకులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. దయ చేసి రేసన్ సరుకులు వచ్చేలా చూడాలి. - భూక్యా గాంధీ, బల్లుతండా, మోతె రుణం మంజూరు చేయించాలి పుట్టకతోనే నా రెండు కాళ్లు ప ని చేయడం లే దు. వికలాం గుల ఫించన్ వ స్తున్నప్పటికీ కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. మాది నిరుపేద కుటంబం. బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తే కిరాణం దుకాణం పెట్టుకొని జీవనం కొనసాగిస్తాను. దయచేసి నాకు బ్యాంకు రుణం ఇప్పించి ఆదుకోవాలి. -నిమ్మ భూపతి, అన్నారం, అనుముల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం లేదు పుట్టకతోనే నా ఎడమకాలికి పోలియో వ చ్చింది. నాకు న్న పెంకుటిల్లు కూలిపోయింది. అప్పుచేసి గోడలు లేపి రేకులు వేశాను. కాని గాలి దుమారానికి రేకులు లేచి పోయాయి. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం గతంలో రెండు సార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఇప్పటి వరకు మంజూరు చేయడం లేదు. ఉండటానికి గూడు సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. -బింగి నాగయ్య, ఎర్రపాడు, నూతనకల్