
కాఠ్మండు: నేపాల్ రాజధాని కాఠ్మండును ఆదివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. ధడింగ్ జిల్లా కేంద్రంగా ఉదయం 7.39 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూమి కంపించిందని యంత్రాంగం తెలిపింది. మరో 29 నిమిషాల అనంతరం ధడింగ్ జిల్లాలోనే భూ ప్రకంపనలు మరో నాలుగుసార్లు సంభవించినట్లు పేర్కొంది.
దీంతో, రాజధాని ప్రాంతంలోని 20 ఇళ్ల వరకు దెబ్బతిన్నాయని, మరో 70 వరకు ఇళ్ల గోడలు బీటలువారాయని పేర్కొంది. ఎటువంటి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదని వెల్లడించింది. భూకంపం ప్రభావం బాగ్మతి, గండకి ప్రావిన్స్‌ల వరకు కనిపించింది.