మాపై దయచూపండి సారూ..
Published Tue, Sep 3 2013 4:04 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :మాసమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చాం. మా సమస్యలపై మూడు నాలుగు సార్లు అర్జీలు ఇచ్చాం. అయినా మండల అధికారులు పట్టిం చుకోవడంలేదు. బస్సు చార్జీలు పెట్టుకొని వెళ్లి, తిండి తిప్పలు లేకుండా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కరించడం లేదు. దయ చేసి మీరైనా మా మొరను ఆలకించండి సారూ... అంటూ వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన బాధితులు గ్రీవెన్స్‌డేలో జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు, జేసీ హరిజవహర్‌లాల్, అదనపుజేసీ నీకంఠంలను కోరారు. సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.
కార్డు ఉన్నా ఫలితం లేదు
నాకు భార్య, ఇద్ధరు పిల్లలు ఉన్నారు. పుట్టుకతోనే నా ఎడమ కాలికి పోలియో వచ్చింది. రచ్చబండలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మొదట కూపన్లు ఇచ్చారు. కూపన్లు ఉన్నంత వరకు సరుకులూ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్‌లో రేషన్ కార్డు మంజూరు చేశారు. అప్పటి నుంచి నాకు రేషన్ సరుకులు రావడంలేదు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అడిగినా స్పందించడం లేదు. ఆన్‌లైన్‌లో కార్డు నెంబర్ లేకపోవడంతో సరుకులు రావడంలేదని డీలరు చెప్పాడు. గ్రీవెన్స్‌డేలో రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు పరిష్కారం కాలేదు. వికలాంగుడినైన నాకు రేషన్ సరుకులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. దయ చేసి రేసన్ సరుకులు వచ్చేలా చూడాలి.
- భూక్యా గాంధీ, బల్లుతండా, మోతె
రుణం మంజూరు చేయించాలి
పుట్టకతోనే నా రెండు కాళ్లు ప ని చేయడం లే దు. వికలాం గుల ఫించన్ వ స్తున్నప్పటికీ కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. మాది నిరుపేద కుటంబం. బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తే కిరాణం దుకాణం పెట్టుకొని జీవనం కొనసాగిస్తాను. దయచేసి నాకు బ్యాంకు రుణం ఇప్పించి ఆదుకోవాలి.
-నిమ్మ భూపతి, అన్నారం, అనుముల
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం లేదు
పుట్టకతోనే నా ఎడమకాలికి పోలియో వ చ్చింది. నాకు న్న పెంకుటిల్లు కూలిపోయింది. అప్పుచేసి గోడలు లేపి రేకులు వేశాను. కాని గాలి దుమారానికి రేకులు లేచి పోయాయి. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం గతంలో రెండు సార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఇప్పటి వరకు మంజూరు చేయడం లేదు. ఉండటానికి గూడు సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
-బింగి నాగయ్య,
ఎర్రపాడు, నూతనకల్
Advertisement
Advertisement