స్టూడెంట్స్ కోసం స్మార్ట్‌ఫోన్ ఆప్స్... | smartphone apps for students | Sakshi
Sakshi News home page

స్టూడెంట్స్ కోసం స్మార్ట్‌ఫోన్ ఆప్స్...

Published Sat, Aug 31 2013 12:53 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

స్టూడెంట్స్ కోసం స్మార్ట్‌ఫోన్ ఆప్స్... - Sakshi

స్టూడెంట్స్ కోసం స్మార్ట్‌ఫోన్ ఆప్స్...

యాంగ్రీ బర్డ్స్‌తోనూ క్యాండీక్రష్ గేమ్స్‌తోనూ వినోదాన్ని ఇవ్వడమే కాదు.. స్మార్‌‌టఫోన్ స్టడీస్‌కు కూడా హెల్ప్ చేస్తుంది. అధునాతన అప్లికేషన్స్‌తో ఔటర్ సైడ్ నాలెడ్జిని అందించడమే కాదు... కొన్ని అప్లికేషన్స్‌తో క్లాస్ రూమ్ నాలెడ్జిని కూడా అందిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లతో అలరించడమే కాదు మ్యాథమెటిక్స్  ఫార్ములాలను కూడా నేర్పిస్తుంది. చిక్కులెక్కలను తేలిక చేస్తుంది. గ్రాఫ్ గీయడంలో గైడ్ అవుతుంది. ఆంగ్లపదాల అర్థాలను చెబుతుంది.. చేయాల్సిందల్లా స్మార్ట్‌ఫోన్‌లో  ఈ అప్లికేషన్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడమే.. ఒక స్టూడెంట్ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే.. దాంట్లో  తప్పనిసరి అప్లికేషన్స్ ఇవి...
 
 టచ్‌తో గాభరాను తగ్గిస్తుంది...
  అర్థమైతే ఆల్‌జీబ్రా లేకపోతే గుండె గాభరా! ప్లస్ వన్ స్టడీస్‌లో ఆల్‌జీబ్రా ఫార్ములాస్‌ను సున్నితంగా, సులభ పద్ధతిలో నేర్పించేవారెవరూ ఉండకపోవచ్చు. బట్టీ పట్టైనా సరే  బీజగణితపు సమీకరణాలన్నింటినీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ విషయంలో సహాయకారిగా ఉంటుంది ‘ఆల్‌జీబ్రా టచ్’ ఐఓఎస్ అప్లికేషన్. ఆల్‌జీబ్రిక్ ఫంక్షన్స్‌ను ప్రాక్టీస్ చేయడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. విద్యార్థులతో చక్కగా ఇంటరాక్ట్ అయ్యేలా రూపొందించారు ఈ అప్లికేషన్‌ను. ఆల్‌జీబ్రా లెక్కల ప్రాక్టీస్ కోసం రీముల కొద్దీ పేపర్లను వృథా చేయకుండా ఐఫోన్ స్క్రీన్‌మీదే ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
 
 స్టాట్స్ స్టూడెంట్స్ కోసం..
 క్విక్‌గ్రాఫ్... స్టాటిస్టిక్స్ కోసం ఉపయుక్తమైన ఐఫోన్ అప్లికేషన్ ఇది. దీంతోగ్రాఫ్ సంబంధిత ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేసుకోవడమే కాదు, దీన్ని ఉపయోగించడం కూడా సులభమే. గ్రాఫింగ్ క్యాలిక్యులేటర్ కన్నా ఈ అప్లికేషన్‌ను ఉపయోగించడం సులువని నిపుణులు అంటున్నారు.
 
 కెమిస్ట్రీలో కన్ఫ్యూజన్ లేకుండా..
 హైస్కూల్‌లో మొదలవుతుంది పీరియాడిక్ టేబుల్‌పై విద్యార్థి పరిశోధన. ప్లస్ వన్‌స్థాయిలో సైన్స్ గ్రూపుల్లోని విద్యార్థులు పీరియాడిక్ టేబుల్‌పై ప్రాక్టికల్సే చేయాల్సి ఉంటుంది. ఇలాంటివారికి ఉపయుక్తమైనది ఈ ఐఫోన్ అప్లికేషన్. దీనిపేరు క్విక్ పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ది ఎలిమెంట్. కెమిస్ట్రీ స్టూడెంట్స్ కోసం ఈ అప్లికేషన్. ఇందులో పీరియాడిక్ టేబుల్‌లోని మూలకాలకు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలన్నీ వివరంగా ఉంటాయి.  
 
 ఆస్ట్రానమీపై ఆసక్తి ఉంటే..

 స్టార్ వాక్... ఖగోళశాస్త్రం గురించి అవగాహన పెంపొందించే ఐఓఎస్ అప్లికేషన్ ఇది. గ్రహగతుల మీద, విశ్వం గురించి ప్రత్యేక ఆసక్తి ఉన్న నేటి విద్యార్థులకు, భావి పరిశోధకులకు ఈ అప్లికేషన్ హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది.
 
 ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై...
 ఆండ్రాయిడ్ కూడా చదవడానికి, అభ్యసించడానికి తగిన  కొన్ని అప్లికేషన్స్‌ను అందిస్తోంది. వాటిలో ముఖ్యమైనవి...
 
 అన్నింటికీ పనికొచ్చే ఎవర్‌నోట్
 సందర్భం, అవసరానికి తగ్గట్టుగా స్నాప్ షాట్స్‌కు,  ఫైల్స్ అప్‌లోడ్ చేసుకోవడానికి, టెక్ట్స్ నోట్ తయారు చేసుకోవడానికి, ఆడియో నోట్‌ను రూపొందించడానికి అవకాశం ఉంటుంది. అందులోని ప్రత్యేకత ఏమిటంటే.. ఇమేజ్ రూపంలోని టెక్ట్స్‌ను కూడా సెర్చ్ ద్వారా రికగ్నైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.  
 
 సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అవసరంలేకుండా..

 రియల్‌క్యాల్క్..ఈ అప్లికేషన్ క్లాస్‌రూమ్‌లోకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నిరోధిస్తుంది. ఫ్యాక్టోరియల్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ట్రిగొనామెట్రిక్ ఫంక్షన్స్‌ను కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ యూనిట్ కన్‌వర్టర్‌గా కూడా ఉపయోగించవచ్చు.
 
 ఆలోచనలు ఒక నోట్...
 థింకింగ్ స్పేస్... క్లాస్‌రూమ్‌లో నోట్ టేకింగ్‌కు, మదిలోని ఆలోచనలను నోట్ చేసి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. పదాలకు బదులుగా ఐడియాలను రిప్రజెంట్ చేసేలా డయాగ్రమ్స్‌ను ఉపయోగించుకోవచ్చు.
 
 స్ఫూర్తిమంతమైన వాక్యాల కోసం...
 సెల్ఫ్‌మోటివేషన్‌కు సులభతరమైన మార్గం... స్ఫూర్తివంతమైన కోట్స్ అని అంటారు వ్యక్తిత్వవికాస నిపుణులు. ‘ఇన్‌స్పిరేషనల్ కోట్స్’  అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ స్ఫూర్తిని నింపే కోట్స్‌ను నిరంతరం అందిస్తుంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement