ఓట్ల జాతర.. ఐదు వారాల్లో నాలుగు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓట్ల జాతర వస్తోంది. గతంలో ఎన్నడూ లేదని విధంగా ఐదు వారాల వ్యవధిలో నాలుగుసార్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నొటిఫికేషన్లు వెలువడ్డాయి. ఎన్నికల అనంతరం రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయి.
రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం పంచాయతీ రాజ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 6న జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ మినహా 22 జిల్లాల ఓటర్లు రెండేసి ఓట్లు వేయాలి. ఇక మార్చి 30న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 30, మే 7 తేదీల్లో శాసన సభ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.