ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు | Kotia voters who voted in Andhra | Sakshi
Sakshi News home page

ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు

Published Sat, May 18 2024 5:09 AM | Last Updated on Sat, May 18 2024 5:09 AM

Kotia voters who voted in Andhra

ఫలించిన అధికారుల దౌత్యం   

ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ 

రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగం   

సాలూరు: ఈ సారి ఎన్నికల్లో కొటియా గ్రూప్‌ గ్రామాల ఓటర్లు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓటేయగలిగారు. అధికారుల దౌ­త్యం ఫలించడంతో ఆంధ్రా, ఒడిశా వివాదాస్పద కొ­టియా గ్రూప్‌ గ్రామాల ప్రజలు పోలింగ్‌కు ఓటెత్తారు. ఆం­ధ్రా, ఒడిశా వివాదాస్పద కొటియా గ్రూప్‌ గ్రామాల ప్రజ­ల­కు ఇటు ఆంధ్రా, అటు ఒడిశా రాష్ట్రాల్లో రెండు చో­ట్లా ఓ­టు హక్కు ఉంది. గత ఎన్నికల్లో వారిని ఒడిశా అధి­కారు­లు, పోలీసులు అడ్డుకుని తమ రాష్ట్రంలోనే అధికంగా ఓటు హ­క్కును వినియోగించుకునేలా చేశారు. 

ఈ క్రమంలో ఈ గ్రా­మాల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రా వైపు రా­కుండా బారికేడ్లు వేసి మరీ ఒడిశాలోనే ఓట్లు వేయించే­లా అధికారులు అప్పట్లో  ప్రయత్నాలు చేశారు. ఇప్పటి సా­ర్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు అటువంటి పరిస్థితులే పునరావృతమయ్యే అవకాశాలు కనిపించాయి. 

ఫలించిన అధికారుల ముందుచూపు...   
కొటియా గ్రూప్‌ గ్రామాల ఓటర్లు ఆంధ్రాలో ఓటు వేసేందు­కు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిం చాలని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అ­ధి­కారులకు విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతంలో ఆంధ్రా, ఒడిశాల­కు సమాన హక్కులు ఉన్నాయని, ఒడిశా అధికారులు జు­లుం ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొంటూ... ఆంధ్రా అధి­కా­రులను అడ్డుకుంటున్నారన్న విషయాలను, ఆయా గ్రా­మా­ల పరిస్థితులను వివరిస్తూ ఎన్నికల కమిషన్‌కు, ఎ­న్ని­క­ల అధికారులకు లిఖిత పూర్వకంగా లేఖ రాశారు. 

ఈ ఓ­ట­ర్లు  ప్రశాంతంగా ఓట్లు వేసే విధంగా  చర్యలు తీ­సు­­కోవా­ల­ని కోరారు. ఈ విషయాన్ని పార్వతీపురం మ­న్యం జి­ల్లా­లో­ని ఎన్నికల అధికారులు రాష్ట్ర  ఎన్నికల అధికా­రుల దృ­ష్టికి తీç­Üుకువెళ్లారు. ఈ క్రమంలో కొటియా గ్రూ­ప్‌ గ్రా­మాలపై ప్ర­త్యేక  దృష్టిసారించారు. అటు ఒడిశా, ఇ­టు ఆంధ్రా అధికా­రులు ఈ గ్రామాలపై చర్చించి ఇరు రా­ష్ట్రా­ల్లో­ను  కొటియా గ్రూప్‌ గ్రామాల ఓటర్లు ఓట్లు వేసే వె­సులు­బాటు క­ల్పిం చే­లా ని­ర్ణ­యం తీసుకున్నారు. ఎవరికి ఏ రాç­Ù­్ట్ర­ం­ నుంచీ ఇబ్బందులు కలిగించకుండా చర్యలు తీసుకున్నారు. 

పోటెత్తిన ఓటర్లు.. 
 గంజాయిభద్ర, పట్టుచెన్నేరు, పగులుచిన్నేరు, సారిక, కురుకూటి పంచాయతీల్లో 21 కొటియా గ్రూప్‌ గ్రామాల్లో సుమారు 3,600 మంది  ఓటర్లు ఉన్నారు. వారిలో సుమారు 2,200 మంది ఆంధ్రాకు చెందిన  నేరెళ్లవలస, శిఖపరువు, సారిక, తోణాం తదితర పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకు­న్నారు. ఆంధ్రాలో  ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత ఒడిశాలోనూ ఓటు హక్కు వినియో­గించుకోవడానికి పలువురు ఓటర్లు ఆ రాష్ట్రానికి   వెళ్లారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement