
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. అలా రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సెన్సెక్స్ చివరికి 236 పాయింట్లు కోల్పోయి 54,052 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో ముగిసాయి. తద్వారా నిఫ్టీ 16, 150 స్థాయి దిగువకు చేరింది. మెటల్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మ పవర్ రియల్టీ ఇలా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ స్వల్పంగా లాభపడింది.
దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్ ,హెచ్‌యుఎల్ టాప్ లూజర్స్‌గానూ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, నెస్లే ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్ నిఫ్టీ గెయినర్‌లుగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment