సాక్షి,ముంబై: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వేలాదిమంది ఉద్యోగులకు షాకిస్తోంది. ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా 12,000 ఉద్యోగాలను తగ్గించనుంది ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శుక్రవారం ఉద్యోగులకు ఒక ఇమెయిల్‌లో సమాచారం అందించారు. ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ 10వేల మంది కార్మికులను తొలగిస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత తాజా పరిణామం వెలుగులోకి వచ్చింది. టెక్ దిగ్గజ సంస్థల్లో గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉద్యోగాల తొలంపులు ఐటీ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. (స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు)
ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిలో 6 శాతం మేర తగ్గించుకోనుంది. ఖర్చుల నియంత్రణ, ముదురుతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే క్రమంలో ఆల్ఫాబెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వర్క్‌ఫోర్స్‌ను సుమారు 12వేల మందిని తొలగిస్తున్నామనే బాధాకరమైన నిర్ణయాన్ని వెల్లడించడం కష్టంగా ఉంది. ఇష్టంతో కష్టపడి పనిచేసే అద్భుతమైన ప్రతిభావంతులకు వీడ్కోలు పలుకుతున్నందుకు చాలా విచారిస్తున్నాను. ఇప్పటికే ప్రభావితమైన ఉద్యోగులకు ప్రత్యేక ఇమెయిల్‌ను పంపాం అని పిచాయ్ తన ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కంపెనీ చరిత్రలోఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగులను తొలగించడం గతంలో ఎన్నడూ లేదని టెక్ వర్గాలు భాస్తున్నాయి. కాగా గత ఏడాదితో పోలిస్తే కంపెనీ లాభం 27 శాతం క్షీణించి 13.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment