
ముంబై : కరోనా మహమ్మారి ప్రభావంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌తో ప్రాజెక్టులు నిలిచిపోవడం, కొత్త ఆర్డర్లపై అనిశ్చితితో ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణపై కన్నేశాయి. ఈ ఏడాది దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు వేతన పెంపును, ప్రమోషన్లను పక్కనపెట్టింది. నియామకాలనూ నిలిపివేసిన ఇన్ఫోసిస్ కొంతమేరకు ఉద్యోగులకు ఊరట ఇస్తూ లేఆఫ్స్ ఉండవని ప్రకటించింది. ఇక సోమవారం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఇన్ఫోసిస్ ఈ క్వార్టర్‌లో కంపెనీ లాభం 6 శాతం వృద్ధితో రూ 4321 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్వార్టర్‌లో రాబడి 8 శాతం ఎగిసి రూ 23,267 కోట్లకు చేరిందని తెలిపింది. షేర్‌కు రూ 9.50 చొప్పున ఫైనల్ డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ ఇప్పటికే అందించిన జాబ్ ఆఫర్లు కొనసాగుతాయని తెలిపింది. కరోనా అనిశ్చితి నేపథ్యంలో 2021లో కంపెనీ సామర్ధ్యంపై గైడెన్స్‌ను ఇవ్వడం లేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment