Wage hike
-
రాష్ట్రంలో ఉపాధి కూలీల వేతనం రూ.15 పెంపు
సాక్షి, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు కేంద్ర ప్రభుత్వం వేతనాలను పెంచింది. రాష్ట్రంలో ప్రస్తుతం గరిష్టంగా రూ.257 చొప్పున వేతనం చెల్లిస్తుండగా, దానిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ.272కు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో రోజువారీ గరిష్ట వేతనాన్ని రూ.15 పెంచింది. ఉపాధి హామీ పథకం కింద వేతనాలను ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచే రాష్ట్రాల వారీగా వేర్వేరుగా నిర్ణయిస్తోంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా వేతన రేట్లను నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలోని కూలీల కొనుగోలుశక్తి (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ఆధారంగా వేతనాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయిస్తారు. -
సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కన్సాలిడేటెడ్ వేతనాల పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషాలిటీ) వైద్యుల కన్సాలిడేటెడ్ వేతనాన్ని రూ.53,500 నుంచి రూ.85 వేలకు ప్రభుత్వం పెంచింది. ప్రొబేషన్ కాలాన్నీ మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ గిరిజన ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు వేతనాల్లో ప్రోత్సాహకాలను ప్రకటించారు. బేసిక్ పే మీద స్పెషాలిటీ వైద్యులకు 50%, సాధారణ వైద్యులకు 30% ప్రోత్సాహకం ఇచ్చారు. ఆ వెంటనే స్పెషలిస్ట్ వైద్యులకు కన్సాలిడేట్ వేతనాలను పెంచడం గమనార్హం. 2020లో జీవో నంబర్ 60 ద్వారా నియమితులైన వైద్యులకు ఈ నెల నుంచి పెంచిన వేతనాలు అమల్లోకొస్తాయి. తాజాగా నియమితులయ్యే వైద్యులకూ రూ.85 వేల కన్సాలిడేటెడ్ వేతనాన్ని ఖరారు చేశారు. -
సగటున వేతన పెంపు 9.1 శాతం
న్యూఢిల్లీ: వేతన జీవులకు ఈ ఏడాది అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి కల్పించిన ప్రతికూలతలతో గత రెండేళ్లుగా మంచి వేతన పెంపు అన్నది ఉద్యోగులకు లేకుండా పోయింది. కానీ, ఈ ఏడాది సగటున 9.1 శాతం మేర వేతనాల పెంపు ఉంటుందని డెలాయిట్ టచ్ తోమత్సు ఇండియా తెలిపింది. ఈ సంస్థ ‘2022 వర్క్‌ఫోర్స్ అండ్ ఇంక్రిమెంట్స్ ట్రెండ్స్’ పేరుతో సర్వే నిర్వహించింది. 2021లో సగటు వేతన పెంపు 8 శాతంగా ఉంది. కరోనాకు ముందు 2019లో వేతన పెంపుతో పోల్చినా ఈ ఏడాది అర శాతం అధికంగా ఉంటుందన్న అంచనాలు ఈ సర్వేలో వ్యక్తమయ్యాయి. ‘‘2020లో కరోనా రక్కసి ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి తీసుకెళ్లింది. దాంతో వేతన పెంపులు తగ్గిపోవడం, వేతన కోతలు, నియామకాలు నిలిచిపోవడం వంటివి చూశాము. 2021లో వేతన పెంపులు పుంజుకున్నాయి. వేతన కోతలు కనిపించలేదు. కరోనా ప్రత్యేక ప్రయోజనాలు అమల్లోకి వచ్చాయి. 2022లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, నియామకాలు పెరగడం, ఉద్యోగుల వలసలు వంటి పరిస్థితులతో కంపెనీలు వేతన పెంపుల విషయంలో కరోనా ముందు నాటి స్థాయిని దాటిపోనున్నాయి. ప్రోత్సాహకాలు ఇచ్చి నైపుణ్యం కలిగిన వారిని నిలుపుకోవాల్సిన పరిస్థితుల్లో కంపెనీలు ఉన్నాయి’’ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనందరూప్ ఘోష్ తెలిపారు. ఈ సర్వేలో 450 సంస్థలు పాల్గొన్నాయి. నివేదికలోని వివరాలు.. ► 34 శాతం సంస్థలు రెండంకెల వేతన పెంపులు ఇవ్వనున్నట్టు తెలిపాయి. 2021లో ఇలా చెప్పిన కంపెనీలు 20 శాతమే ఉంటే, 2020లో 12 శాతంగా ఉంది. ► అన్ని ప్రముఖ రంగాల్లోనూ వేతన పెంపులు ఈ ఏడాది అధికంగా ఉంటాయి. ► లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాల్లో అధికంగాను, ఫైనాన్స్ టెక్నాలజీ, ఐటీ ప్రొడక్ట్ కంపెనీలు, డిజిటల్/ఈకామర్స్ కంపెనీలు రెండంకెల పెంపును ఇవ్వనున్నాయి. ► వేతన ప్రోత్సాహకాలు అందరికీ ఒకే మాదిరిగా కాకుండా.. వారి పనితీరు ఆధారంగా ఇవ్వనున్నట్టు 92 శాతం కంపెనీలు తెలిపాయి. సగటు పనితీరు చూపించే వారితో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించే వారికి 1.7 రెట్లు అధికంగా పెంపు ఇవ్వనున్నట్టు చెప్పాయి. ► జూనియర్ స్థాయిల్లోని వారికి ఎక్కువగాను, అధిక వేతన స్థాయిల్లోని వారికి తక్కువగాను పెంపు ఉండనుంది. ► ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 2020లో 15.8 శాతంగా ఉంటే 2021లో 19.7 శాతానికి పెరిగింది. ► వలసలకు చెక్ పెట్టేందుకు అధిక వేతన పెంపుతోపాటు, ఒక విడత బోనస్ వంటి ప్రయోజనాలను ఇచ్చే ఉద్దేశ్యంతో కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు నైపుణ్య శిక్షణపై పెట్టుబడి పెట్టనున్నాయి. ► 2022లో 90 శాతానికి పైగా కంపెనీలు బోనస్ ఇవ్వాలనుకుంటున్నాయి. ఉద్యోగిపై పెరగనున్న వ్యయం ‘‘2022లో 9.1 శాతం వేతన పెంపు అన్నది ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకే. అదనపు నియామకాలు, ఒక్క విడత వేతన దిద్దుబాట్లు, రిటెన్షన్ బోనస్‌లను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మీద ఉద్యోగిపై చేసే వ్యయం పెరిగిపోనుంది’’ అని డెలాయిట్ పార్ట్నర్ అనుభవ్ గుప్తా తెలిపారు. మధ్య నుంచి దీర్ఘకాలానికి ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార వృద్ధిపైనే వేతన పెంపులు ఆధారపడి ఉంటాయని అంచనా వేశారు. -
ఎల్ఐసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. సంస్థ ఉద్యోగులందరికీ వేతనాల పెంపును ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. ఉద్యోగులకు 16 శాతం వేతన పెంపును ఆర్థికమంత్రిత్వశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్) ఆమోదించినట్టు తాజా అంచనా. అంతేకాదు, ఎల్ఐసి సిబ్బంది ఇకపై వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నారు. బ్యాంక్ యూనియన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మధ్య చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తక్షణమే అమల్లోకి రానున్న ఈ నిర్ణయంతో దీంతో 1.14 లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందుతారు. తాజా నివేదికల ప్రకారం ఎల్ఐసీ ఉద్యోగుల వేతనాల పెంపు15-16 శాతం వరకు ఉండవచ్చని అంచనా. మరోవైపు 20 శాతం పెంపు ఉండనుందని మరికొంతమంది అంచనా వేస్తున్నారు. నెలకు 25 శాతం పెంపు ఉంటుందని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా భావిస్తున్నారు. 40 శాతం వేతన పెంపు, ముఖ్యంగా, ఐదు రోజుల పనిదినాలు ఉద్యోగుల సంఘాల డిమాండ్లలో ఒకటి. ఈ పెంపుతో ఎల్ఐసీపై సంవత్సరానికి రూ .2,700 కోట్ల భారం పడనుంది. ఎల్ఐసీ సాధారణంగా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి జీతాలను సవరిస్తుంది. అయితే ఆగస్టు 2012 లో చివరిసారి వేతనాలు పెంచిన ఎల్‌ఐఈసీ వేతన సవరణ 2017 నుండి పెండింగ్‌లో ఉంది. ఉద్యోగులు కూడా వేతనాలలో 35 శాతం పైకి సవరణను ఆశిస్తుండగా, 16 శాతం మాత్రమే ఆమోదించడం గమనార్హం. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీఓకు రానుందని 2021 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రూ .1 లక్ష కోట్లు కేంద్రం ఆశిస్తోంది. -
ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు, భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును వర్తింపచేయనున్నారు. బ్యాంకు ఉద్యోగులకు వేతన పెంపుతో బ్యాంక్‌లపై ఏటా 7900 కోట్ల రూపాయల భారం పడనుంది. వేతన పెంపును బకాయిలతో సహా నవంబర్ జీతంతో ఉద్యోగులు అందుకోనున్నారు. వేతనాల పెరుగుదలతో దాదాపు 5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.ఇంక్రిమెంట్ బకాయిలను ఈనెల 1 నుంచి విడుదల చేస్తారని బ్యాంకు అధికారుల యూనియన్ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు ఉద్యోగుల్లో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు సామర్ధ్యం కనబరిచినవారిని ప్రోత్సహించే లక్ష్యంతో సామర్ధ్య ఆధారిత వేతనాల పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టామని ఐబీఏ ఓ ప్రకటనలో తెలిపింది. వేతన పెంపు సంప్రదింపుల్లో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 10 ప్రైవేట్ బ్యాంకులు, 6 విదేశీ బ్యాంకుల ప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇక కేంద్ర వేతన సంఘ సిఫార్సులను వర్తింపచేయాలని, వారానికి ఐదు రోజుల పని, కుటుంబ పెన్షన్ తాజాపరచడం వంటి మూడు ప్రధాన డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే తొలి రెండు డిమాండ్లపై ఆశించిన ఫలితాలు చేకూరలేదు. కుటుంబ పెన్షన్ పథకం డిమాండ్‌ను ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు ఐబీఏ అంగీకరించింది. ఇక ఈ పథకాన్ని బ్యాంకు ఉద్యోగులకు వర్తింపచేయడంపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. చదవండి : గుడ్‌న్యూస్ : టెకీలకు వేతన పెంపు -
గుడ్‌న్యూస్ : టెకీలకు వేతన పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్ధితుల్లోనూ వ్యాపార కార్యకలాపాలను యథావిథిగా కొనసాగించిన ఉద్యోగులకు రివార్డుగా ఐటీ దిగ్గజం విప్రో వేతన పెంపును చేపట్టనుంది. కంపెనీలో 80 శాతం ఉద్యోగులకు డిసెంబర్ 1 నుంచి పెరిగిన వేతనాలను అందించనుంది. బీ3, దిగువ స్ధాయి సిబ్బందికి వేతన పెంపును వర్తింపచేయనున్న విప్రో సీనియర్ ఉద్యోగుల వేతనాల పెంపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు విప్రోలో ప్రస్తుతం 1.85 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వేతన పెంపుతో దాదాపు 1.5 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. గతంలో మాదిరిగానే అత్యధిక సామర్థ్యం కనబరిచినవారికి ఇంక్రిమెంట్లు అందిస్తున్నామని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి : విప్రో లాభం రూ. 2,465 కోట్లు ఈ ఏడాది ఆరంభంలో కరోనా వైరస్ వెంటాడటంతో వేతన పెంపును వాయిదా వేసిన పలు ఐటీ కంపెనీలు తిరిగి వేతన పెంపును, ప్రమోషన్లను ప్రకటిస్తుండటం టెకీల్లో ఆశలు రేపుతోంది. సవాళ్లతో కూడిన సంక్లిష్ట సమయంలోనూ తమ ఉద్యోగులు నిరంతరాయంగా వ్యాపారాన్ని కొనసాగేలా చూడటంతో పాటు అత్యంత నాణ్యమైన సేవలను కొనసాగించారని విప్రో ప్రతినిథి ఓ జాతీయ వెబ్‌సైట్‌తో పేర్కొన్నారు. మధ్య, సీనియర్ శ్రేణిలో కీలక నైపుణ్యాలను కాపాడుకునేందుకు కంపెనీ పలు చర్యలు చేపడుతుందని చెప్పారు. ఇక మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి వర్తించేలా వేతన పెంపును ప్రకటించగా, జనవరి నుంచి ఉద్యోగులందరికీ వేతన పెంపును చేపడతామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. మెరుగైన సామర్ధ్యం కనబరిచినందుఉ ఈ ఏడాడి డిసెంబర్లో ప్రత్యేక ప్రోత్సాహకం అందచేస్తామని వెల్లడించింది. -
ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కంపెనీలు ఉద్యోగులపై వేటు, జీతాల కోతలతో చుక్కలు చూపుతుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే 9 లక్షల మంది ఉద్యోగులకు తీపికబురు అందింది. పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతనపెంపుతో పాటు పెన్షన్ కంట్రిబ్యూషన్‌ను నాలుగు శాతం పెంచేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఉద్యోగ సంఘాల మధ్య అంగీకారం కుదిరింది. వేతనాలు, పెన్షన్ కంట్రిబ్యూషన్ పెంపుతో ఈ ఉద్యోగుల వార్షిక వేతన బిల్లు రూ 7900 కోట్ల మేర పెరగనుంది. వేతన పెంపు నవంబర్ 2017 నుంచి వర్తించనుంది. కాగా, గతంలో ఈ ఉద్యోగుల బేసిక్ వేతనంలో 10 శాతం, డీఏ రిటైర్మెంట్ ప్రయోజనాల్లో కలుస్తుండగా, తాజా వేతన సవరణతో 14 శాతం బేసిక్, డీఏలు పెన్షన్ మొత్తానికి జమవుతాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు 5 శాతం అంతకుమించి నిర్వహణా లాభాలు ఆర్జించిన బ్యాంకుల ఉద్యోగులకు ఇన్సెంటివ్‌లు అందుకోనున్నారు. చదవండి : ఉద్యోగుల పదవీ విరమణ @ 60 -
మహమ్మారి ఎఫెక్ట్ : టెకీలకు ఇన్ఫీ షాక్
ముంబై : కరోనా మహమ్మారి ప్రభావంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌తో ప్రాజెక్టులు నిలిచిపోవడం, కొత్త ఆర్డర్లపై అనిశ్చితితో ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణపై కన్నేశాయి. ఈ ఏడాది దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు వేతన పెంపును, ప్రమోషన్లను పక్కనపెట్టింది. నియామకాలనూ నిలిపివేసిన ఇన్ఫోసిస్ కొంతమేరకు ఉద్యోగులకు ఊరట ఇస్తూ లేఆఫ్స్ ఉండవని ప్రకటించింది. ఇక సోమవారం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఇన్ఫోసిస్ ఈ క్వార్టర్లో కంపెనీ లాభం 6 శాతం వృద్ధితో రూ 4321 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్వార్టర్లో రాబడి 8 శాతం ఎగిసి రూ 23,267 కోట్లకు చేరిందని తెలిపింది. షేర్‌కు రూ 9.50 చొప్పున ఫైనల్ డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ ఇప్పటికే అందించిన జాబ్ ఆఫర్లు కొనసాగుతాయని తెలిపింది. కరోనా అనిశ్చితి నేపథ్యంలో 2021లో కంపెనీ సామర్ధ్యంపై గైడెన్స్‌ను ఇవ్వడం లేదని పేర్కొంది. చదవండి : బ్రిటన్ ఆర్థికమంత్రిగా నారాయణమూర్తి అల్లుడు -
ఈ ఏడాది మీ వేతన పెంపు ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లింది. వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో 2020లో సగటు వేతన పెంపు పదేళ్ల కనిష్టస్ధాయిలో 9.1 శాతానికే పరిమితమవుతుందని ప్రముఖ ప్రొషెషనల్ సేవల సంస్థ ఏఓన్ పీఎల్సీ వార్షిక వేతన పెంపు సర్వే వెల్లడించింది. 2018, 2019లో కంపెనీలు వరుసగా సగటున 9.5, 9.3 శాతం మేర వేతనాలను పెంచాయి. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కుదిపివేసిన క్రమలో ఆ ఏడాది సగటు వేతన పెంపు 6.6 శాతమే. ఇక 2020లో సగటు వేతన పెంపు స్వల్పమేనని సర్వే వ్యాఖ్యానించింది. అయితే వేతన పెంపు కనిష్టంగా ఉన్నప్పటికీ పలు కంపెనీలు పది శాతం కంటే అధికంగా ఇంక్రిమెంట్లు ఇవ్వనుండటం ఊరట ఇవ్వనుంది. 2020లో రెండంకెల వేతన వృద్ధిని చేపడతామని 39 శాతం కంపెనీలు వెల్లడించాయని సర్వే తెలిపింది. 2012 నుంచి 2016 వరకూ వేతనాలు రెండంకెల వృద్ధి సాధించాయని, ఇటీవల సంవత్సరాల్లో 9 శాతానికి తగ్గాయని సర్వే తెలిపింది. 20 రంగాలకు చెందిన 1000 కంపెనీలను ఈ సర్వే పలుకరించి శాలరీ ట్రెండ్స్‌ను పసిగట్టింది. తయారీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల్లో వేతన పెంపు అధికంగా ఉంటుందని వెల్లడించింది. చదవండి : జీతాలతో పనేముంది? -
వేతన జీవులకు నిరాశ..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది వేతన జీవులకు నిరాశే ఎదురవనుందని తాజా అథ్యయనం బాంబు పేల్చింది. వేతనాల్లో రెండంకెల వృద్ధి ఇక గత వైభవంగా మిగిలిపోనుందని ఆ సర్వే వెల్లడించింది. 2019లో సగటు వేతన పెంపు భిన్న రంగాల్లో 9.7 శాతంగా ఉంటుందని హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ ఏఆన్ అంచనా వేసింది. 2017లో సగటు వేతన వృద్ధి 9.3 శాతం, 2018లో 9.5 శాతం కాగా ఈ ఏడాది స్వల్పంగా వేతన వృద్ధి పెరిగినా రెండంకెల వృద్ధికి దూరంగా నిలవడంతో వేతన జీవులకు నిరాశ మిగలనుంది. 2007లో సగటు వార్షిక వేతన వృద్ధి అత్యధికంగా 15.1 శాతం నుంచి ఆ తర్వాత గణనీయంగా తగ్గుతూ వచ్చిందని ఏఆన్ హెవిట్ వెల్లడించిన డేటా తెలిపింది. ఎన్నికల ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యయాలు పెరిగినా 2020లో మెరుగైన వేతన వృద్ధిని అంచనా వేయవచ్చని, అయినా 12-13 శాతం వేతన వృద్ధి మాత్రం గత వైభవంగానే మిగులుతుందని తాము అంచనా వేస్తున్నామని ఏఆన్ ఎమర్జింగ్ మార్కెట్స్ హెడ్, భాగస్వామి అనందర్ప్ ఘోష్ స్పష్టం చేశారు. కీలక నైపుణ్యాలు కలిగిన వారికే మెరుగైన వేతన వృద్ధి పరిమితమవుతందని, సగటు వేతన పెంపు మాత్రం వృద్ధి చెందదని అంచనా వేశారు. ఈ ఏడాది కేవలం ఇంటర్నెట్ కంపెనీలు, ప్రొఫెషనల్ సేవలు, లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్, కన్జూమర్ ఉత్పత్తుల రంగాల్లోనే రెండంకెల వేతన వృద్ధి పరిమితమవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. -
అధ్యాపకులకు భారీగా పెరగనున్న వేతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేసే అధ్యాపకుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఏడో వేతన కమిషన్ సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో వేతనాల పెంపు ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 3 వేల వరకు మంజూరైన బోధనా సిబ్బంది పోస్టులుండగా, అందులో 1,500కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో 500 వరకు పోస్టుల్లో కాంట్రాక్టు సిబ్బంది పని చేస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి మంది వరకు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారికి వేతనాల పెంపు అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీనియర్ ప్రొఫెసర్‌కు ప్రస్తుత వేతనంపై అదనంగా రూ.28 వేలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.18 వేలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.12 వేల వరకు అదనంగా వేతనాలు పెరిగే అవకాశం ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
జడ్జీల వేతనాల పెంపుపై కమిషన్
న్యూఢిల్లీ: దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 21 వేల మంది జడ్జీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. వారి వేతనాల పెంపును సిఫార్సు చేసే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని అధ్యక్షతన శుక్రవారం జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలో ఏర్పాటుకానున్న ఈ కమిషన్‌లో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.బసంత్ సభ్యుడిగా ఉంటారు. 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ సిఫార్సుల్ని అందచేస్తుంది. జడ్జీలు, కింది కోర్టుల్లోని జ్యుడీషియల్ అధికారులకు 2010లో చివరిసారిగా జీతాలు పెంచినా.. జనవరి1, 2006 నుంచి జీతాల పెంపును అమలు చేశారు. ఢిల్లీకి భారీ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం ఎగ్జిబిషన్ మార్కెట్లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ద్వారకాలో రూ. 25,703 కోట్లతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం(ఈసీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ), నాన్–పీపీపీ పద్ధతిలో 2025 నాటికి ఈసీసీని పూర్తి చేయనున్నారు. ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏన్టీఏ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రారంభంలో సీబీఎస్ఈ నిర్వహిస్తున్న పరీక్షల్ని ఎన్టీఏ నిర్వహిస్తుందని, క్రమంగా మిగతా పరీక్షల్ని నిర్వహణను చేపడుతుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. అలాగే జాతీయ గ్రామీణ తాగు నీటి పథకం(ఎన్ఆర్డీడబ్యూపీ) పునర్వ్యవస్థీకరణకు 2017–18 నుంచి 2019–20 వరకూ రూ. 23,050 కోట్లు ఖర్చు చేసేందుకు ఓకే చెప్పింది. -
బ్యాంక్ ఉద్యోగులకు బొనాంజా
- 15 శాతం వేతనం పెంపు - 2012 నవంబర్ నుంచి వర్తింపు - ఇక నెలలో 2వ,4వ శనివారాలు సెలవు - సంఘాల సమ్మె ప్రతిపాదన విరమణ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఎట్టకేలకు తమ దీర్ఘకాలిక డిమాండ్లను సాధించుకున్నారు. దీని ప్రకారం 2012 నవంబర్ నుంచీ 15 శాతం వేతన పెంపు అమలు కానుంది. దీనితోపాటు నెలలో రెండు శనివారాలుత సెలవు ఇవ్వాలన్న డిమాండ్ కూడా పరిష్కారమైంది. ఈ మేరకు సోమవారం ఉద్యోగ యూనియన్లకు, యాజమాన్యానికి మధ్య ఒప్పందం కుదిరింది. దీనితో తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25 నుంచీ నాలుగురోజుల పాటు జరపతలపెట్టిన సమ్మెను యూనియన్లు విరమించాయి. బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళీ సోమవారమిక్కడ ఈ విషయాన్ని ప్రకటించారు. నెలలో రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించాలన్నది బ్యాంక్ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండని, ఈ విషయంలో కూడా సానుకూల ఫలితం రావడం హర్షణీయమని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. మధ్యేమార్గం... నిజానికి 19 శాతం వేతన పెంపునకు యూనియన్లు డిమాండ్ చేశాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తొలుత 12.5 శాతం పెంపునకు సరే అంది. దీనికి యూనియన్లు ససేమిరా అన్నాయి. చివరకు చర్చల్లో మధ్యేమార్గంగా 15 శాతంగా నిర్ణయించుకున్నారు. ఈ చర్చల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు, బ్యాంక్ యాజమాన్య, ఐబీఏ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. వీటికి దేశ వ్యాప్తంగా 50,000 బ్రాంచీలుండగా, వాటిలో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.