సాక్షి, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు కేంద్ర ప్రభుత్వం వేతనాలను పెంచింది. రాష్ట్రంలో ప్రస్తుతం గరిష్టంగా రూ.257 చొప్పున వేతనం చెల్లిస్తుండగా, దానిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ.272కు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో రోజువారీ గరిష్ట వేతనాన్ని రూ.15 పెంచింది.
ఉపాధి హామీ పథకం కింద వేతనాలను ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచే రాష్ట్రాల వారీగా వేర్వేరుగా నిర్ణయిస్తోంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా వేతన రేట్లను నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలోని కూలీల కొనుగోలుశక్తి (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ఆధారంగా వేతనాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment