
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేసే అధ్యాపకుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఏడో వేతన కమిషన్ సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో వేతనాల పెంపు ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 3 వేల వరకు మంజూరైన బోధనా సిబ్బంది పోస్టులుండగా, అందులో 1,500కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మరో 500 వరకు పోస్టుల్లో కాంట్రాక్టు సిబ్బంది పని చేస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి మంది వరకు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారికి వేతనాల పెంపు అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీనియర్ ప్రొఫెసర్‌కు ప్రస్తుత వేతనంపై అదనంగా రూ.28 వేలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.18 వేలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.12 వేల వరకు అదనంగా వేతనాలు పెరిగే అవకాశం ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment