సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కంపెనీలు ఉద్యోగులపై వేటు, జీతాల కోతలతో చుక్కలు చూపుతుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే 9 లక్షల మంది ఉద్యోగులకు తీపికబురు అందింది. పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతనపెంపుతో పాటు పెన్షన్ కంట్రిబ్యూషన్‌ను నాలుగు శాతం పెంచేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఉద్యోగ సంఘాల మధ్య అంగీకారం కుదిరింది.
వేతనాలు, పెన్షన్ కంట్రిబ్యూషన్ పెంపుతో ఈ ఉద్యోగుల వార్షిక వేతన బిల్లు రూ 7900 కోట్ల మేర పెరగనుంది. వేతన పెంపు నవంబర్ 2017 నుంచి వర్తించనుంది. కాగా, గతంలో ఈ ఉద్యోగుల బేసిక్ వేతనంలో 10 శాతం, డీఏ రిటైర్‌మెంట్ ప్రయోజనాల్లో కలుస్తుండగా, తాజా వేతన సవరణతో 14 శాతం బేసిక్, డీఏలు పెన్షన్ మొత్తానికి జమవుతాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు 5 శాతం అంతకుమించి నిర్వహణా లాభాలు ఆర్జించిన బ్యాంకుల ఉద్యోగులకు ఇన్సెంటివ్‌లు అందుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment