పైసా ఖర్చు లేకుండా ఆ దేశానికి ప్రయాణం
అమెరికాలో విదేశీయులకు ఆంక్షలు పెరిగిపోతున్న నేపథ్యంలో మిగతా దేశాల్లో నిబంధనలు సరళతరమవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇక న్యూజిలాండ్ కు ఉచితంగా ప్రయాణించవచ్చట. ఉచితంగా విమానంలో ప్రయాణించడం దగ్గర్నుంచి... అక్కడ ఫ్రీగా ఉండటం వరకు న్యూజిలాండ్ ఆఫర్ చేస్తోంది. న్యూజిలాండ్ రాజధాని నగరం వెల్లింగ్టన్ 100 టెక్ వర్కర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది. తమ టెక్ హబ్ ను పెంచుకునే నేపథ్యంలో జాబ్ ఇంటర్వ్యూకు వచ్చిన వారికి ఈ ఆఫర్ ను అందించబోతున్నట్టు ప్రకటించింది. లుక్సీ పేరుతో వెల్లింగ్టన్ ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. 2017 మే 8 నుంచి మే 11 వరకు నాలుగు రోజుల పాటు జాబ్ ఇంటర్వ్యూలకు, టెక్ లీడర్లలతో మీట్-అప్స్ కు ఈ అరెంజ్మెంట్స్ చేస్తోంది.
తమ టెక్ ఆవిష్కరణలు సదూర ప్రదేశాలకు ప్రయాణించాలని తాము భావిస్తున్నాం.. అందుకు అనుగుణంగా తమకు ఎక్కువమంది ప్రతిభావంతులైన ప్రజలు కావాలని వెల్లింగ్టన్ మేయర్ జస్టిన్ లెస్టర్ చెప్పారు. వెల్లింగ్టన్ లో ఇంటర్వ్యూకు హాజరుకావాలనుకునే వారు మొదట తమ అభ్యర్థిత్వాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని, తమ సీవీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వీడియో ఇంటర్వ్యూకు అభ్యర్థులను వెల్లింగ్టన్ ఆహ్వానిస్తోంది. అనంతరం ఎంప్లాయిర్స్ అభ్యర్థులను నామినేట్ చేస్తోంది. ఈ విధంగా జరిగిన ప్రక్రియలో అందుబాటులో ఉన్న వంద స్పాట్స్ లో అవకాశం దక్కించుకుని ఈ ఆఫర్ ను పొందవలసి ఉంటుంది. అనంతరం వెల్లింగ్టన్ లో జాబ్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.