
టెకీలకు గుడ్‌న్యూస్..న్యూజిలాండ్ ఫ్రీ ట్రిప్
వెల్లింగ్టన్: ఐటీ నిపుణులను ఆకర్షించేందుకు న్యూ జిలాండ్ ఓ వినూత్నమైన ఆఫర్ ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా టెకీలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తద్వారా తన టెక్ హబ్‌కు బూస్ట్ ఇచ్చేలా భలే ప్రచారానికి తెరతీసింది.
ప్రపంచంలో ఎక్కడైనా నుండి న్యూజిలాండ్‌కు ఉచిత ట్రిప్ ఆఫర్ చేస్తోంది. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ వేదికగా ’లుక్ సీ’ అనే కొత్త పథకాన్ని ప్రకటించింది.ఇందులో భాగంగా సుమారు 100మంది టెక్ నిపుణులను ఇంటర్వ్యూలకు పిలుస్తోంది. ఇలావచ్చే వారికి ఉచిత విమాన ప్రయాణం, ఉచిత వసతి సౌకర్యాలను కల్పిస్తోంది. అంతేనా.. అక్కడ సైట్ సీయింగ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. 2017, మే 8 -11మధ్య ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది.
టెక్ ఇన్నోవేషన్ పరిశ్రమకోసం ఎవరైనా కాదు...తమకు మరింతమంది ఉత్తమ నిపుణులు అవసరమని వెల్లింగ్టన్ మేయర్ జస్టిన్ లెస్టర్ చెప్పారు.అయితే ఈ పథకం ద్వారా ముందుగా టెకీలు రిజస్టర్ చేసుకొని, సీవీని అప్‌లోడ్ చేయాలని. దీన్ని పరిశీలించిన అనతరం వీడియో ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు.
ఇందులో పాల్గొన్న ఆయా సంస్థల యజమానులు (ఎంప్లాయిర్) అభ్యర్థుల ప్రొఫైల్ వీక్షించడానికి వీలుగా ఉండాలి. తద్వారా వారు నేరుగా సంప్రదించి ఒక అంచనాకు వస్తారు. ఇలా యజమానులు తమకు నచ్చిన వారిని 'నామినేట్' చేస్తారు. ఇలా ఎక్కువ లైకులు, నామినేషన్లతో 100మందిలో చోటు సంపాదించుకున్నవారు వెల్లింగ్టన్ ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ఆహ్వానం గెలుచుకుంటారు. అయితే ఉద్యోగుల నియామకం ఆయా యజమానుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.