
వాషింగ్టన్: టెక్నాలజీ రంగంలో గతేడాది నుంచి ఆరంభమైన ఉద్యోగ కోతల క్రమం ఇప్పుడప్పుడే ఆగేట్టు కనిపించడం లేదు. తాజాగా కంప్యూటర్ తయారీ సంస్థ డెల్ 6,600 ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్టు ప్రకటించింది. గత నెలలోనే టెక్నాలజీ రంగంలో 50వేల ఉద్యోగాలకు కోత పడింది. అయినప్పటికీ చాలా వరకు టెక్నాలజీ కంపెనీలు మూడేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఇప్పటికీ అదనపు ఉద్యోగులతో ఉండడం గమనార్హం.
► డెల్ తన ఉద్యోగుల్లో 5 శాతాన్ని తొలగించుకోనుంది. ఈ సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,33,000గా ఉంది.
► గత నెలలో అమెజాన్ 18వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.
► సేల్స్‌ఫోర్స్ 8,000 మంది ఉద్యోగులను తొలగించింది.
► మైక్రోసాఫ్ట్ 10వేల మంది, గూగుల్ 12వేల మంది చొప్పున ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి.
► గూగుల్ 12,000 మంది (6 శాతం) ఇంటికి వెళ్లకతప్పదని ప్రకటించింది.
► స్పాటిఫై 6 శాతం మందిని తొలగించుకుంది.
► ఎస్‌ఏపీ అయితే ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ఉద్యోగులను (2.5 శాతం) తగ్గించుకుంది.
► పేపాల్ సంస్థ 7 శాతం ఉద్యోగులను (2,000 మంది) తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
► ఐబీఎం సంస్థ కూడా 3,900 ఉద్యోగులను తొలగించింది.
► గతేడాది చివర్లో ట్విట్టర్ సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది.
► మెటా సంస్థ 11,000 మందిని (13 శాతం), లిఫ్ట్ 700 మందికి ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది.