Additional staff
-
టెక్నాలజీ రంగంలో ఉపాధి కోతలు
వాషింగ్టన్: టెక్నాలజీ రంగంలో గతేడాది నుంచి ఆరంభమైన ఉద్యోగ కోతల క్రమం ఇప్పుడప్పుడే ఆగేట్టు కనిపించడం లేదు. తాజాగా కంప్యూటర్ తయారీ సంస్థ డెల్ 6,600 ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్టు ప్రకటించింది. గత నెలలోనే టెక్నాలజీ రంగంలో 50వేల ఉద్యోగాలకు కోత పడింది. అయినప్పటికీ చాలా వరకు టెక్నాలజీ కంపెనీలు మూడేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఇప్పటికీ అదనపు ఉద్యోగులతో ఉండడం గమనార్హం. ► డెల్ తన ఉద్యోగుల్లో 5 శాతాన్ని తొలగించుకోనుంది. ఈ సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,33,000గా ఉంది. ► గత నెలలో అమెజాన్ 18వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ► సేల్స్‌ఫోర్స్ 8,000 మంది ఉద్యోగులను తొలగించింది. ► మైక్రోసాఫ్ట్ 10వేల మంది, గూగుల్ 12వేల మంది చొప్పున ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ► గూగుల్ 12,000 మంది (6 శాతం) ఇంటికి వెళ్లకతప్పదని ప్రకటించింది. ► స్పాటిఫై 6 శాతం మందిని తొలగించుకుంది. ► ఎస్ఏపీ అయితే ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ఉద్యోగులను (2.5 శాతం) తగ్గించుకుంది. ► పేపాల్ సంస్థ 7 శాతం ఉద్యోగులను (2,000 మంది) తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ► ఐబీఎం సంస్థ కూడా 3,900 ఉద్యోగులను తొలగించింది. ► గతేడాది చివర్లో ట్విట్టర్ సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ► మెటా సంస్థ 11,000 మందిని (13 శాతం), లిఫ్ట్ 700 మందికి ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది. -
భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధం
ఐదు రోజుల్లో ఏడు లక్షల మంది భక్తులు రాక... విజయవాడ :ఇంద్రకీలాద్రి పై భవానీదీక్షల విరమణకు అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు దీక్షల విరమణ జరుగుతుంది ఐదు రోజుల్లో సుమారు ఏడు లక్షల మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున దేవస్థానం సిబ్బందితో పాటు ఇతర దేవస్థానాల నుంచి సుమారు 325 మంది అదనపు సిబ్బందిని దేవస్థానంలో వినియోగిస్తున్నారు. శుక్రవారం తొలిరోజు కావడంతో... దీక్ష విరమణలకు తొలి మూడు రోజులే కీలకంగా ఆలయ అధికారులు బావిస్తున్నారు. శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భవానీ భక్తులు భారీగానే తరలివస్తారు. అయితే దీక్షలు విమరణ చేయకపోవచ్చని, శని,ఆదివారాల్లో దీక్షలు విరమిస్తారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. జల్లుస్నానాలు, క్యూలైన్లు, వాటర్ ప్యాకెట్లు సిద్ధం... నదిలో పవిత్ర స్నానాలు చేసే వారి కోసం జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. నీటిపారుదలశాఖ గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసింది. భవానీఘాట్, పున్నమిఘాట్, పద్మావతి ఘాట్లలో కూడా స్నాన ఘట్టాలు ఏర్పాటుచేశారు. భక్తులు దీక్షా వస్త్రాలను నదిలోకాని, స్నానఘట్టాల్లో కాని పడవేయకూడదని నదిలో వేయాలని ఆలయ అర్చకులు సూచిస్తున్నారు. వికలాంగులు, వృద్ధులకు కొండ కింద నుంచి ఆలయ ప్రాంగణానికి చేరుకునేందుకు వీల్ చైర్స్‌ను అందుబాటులో ఉంచారు. రైల్వేస్టేషన్, బస్టాండ్లనుంచి భవానీలు అమ్మవారి సన్నిధికి చేరుకునేందుకు దేవస్థానం బస్సులతో పాటు పలువురు దాతలు అందించిన బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. కొండ దిగువన హోమగుండాలు ... కొండ దిగువన మెట్లమార్గంలో దేవస్థానం అధికారులు హోమగుండాలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తుల సౌకర్యార్ధం జమ్మిదొడ్డిలోనూ ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులతో పాటు ఆలయ ఈవో సీహెచ్.నర్సింగరావు భక్తులకు కల్పించిన సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దు : ఈవో భవానీ దీక్ష విరమణలకు విచ్చేసే భవానీలు, భవానీ భక్తులకు స్నానఘాట్లలో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేయాలని దుర్గగుడి ఈవో సీహెచ్. నర్సింగరావు ఆలయ అధికారులను ఆదేశించారు. దీక్ష విరమణకు చేపట్టిన ఏర్పాట్లను గురువారం ఆలయ ఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహా మండపంలో ఏర్పాటు చేసిన లడ్డూ తయారీ కేంద్రాన్ని గురువారం ఆలయ ఈవో పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. కాగా ప్రముఖ దేవస్థానాల నుంచి భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు డెప్యూటేషన్‌పై రావాల్సిన సిబ్బంది సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది.