శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: బ.సప్తమి రా.9.07 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ఆశ్లేష రా.8.47 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ఉ.9.05 నుండి 10.45 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.26 నుండి 9.14 వరకు తదుపరి ప.12.10 నుండి 12.58 వరకు,అమృత ఘడియలు: రా.7.09 నుండి 9.31 వరకు.
సూర్యోదయం : 6.12
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం...ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
వృషభం...పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
మిథునం....కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. ఆదాయానికి నిరాశ పరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం...పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
సింహం...వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య....శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
తుల....పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృశ్చికం...కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
ధనుస్సు....కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం....నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కుంభం...శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.
మీనం...ప్రయాణాలలో మార్పులు. వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
Comments
Please login to add a commentAdd a comment