Framework
-
10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు
న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) సాధాసాధ్యాలపై మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈకి మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్ స్కోర్ సాధించొచ్చు. ఈ ఆప్షన్ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు’అని వివరించారు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. డమ్మీ స్కూల్స్ పనిపడతాం రాజస్తాన్‌లోని కోటాలో పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో బలవన్మరణాలకు పాల్పడటంపై మంత్రి ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం. విస్మరించరానిది’అన్నారు. అదేవిధంగా, తమ సొంత రాష్ట్రంలోని స్కూల్లో అడ్మిట్ అయిన విద్యార్థులు అక్కడ చదవకుండా, పరీక్షల శిక్షణ కోసం కోటా వంటి చోట్లకు వెళ్తుండటంపై మంత్రి.. ఇటువంటి డమ్మీ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని, వారు ఒంటరితనంతో బాధపడుతూ, ఒత్తిడులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వానికి సలహాలిచ్చే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ)ని ఆధునీకరిస్తామని మంత్రి ప్రధాన చెప్పారు. -
ధరలు అదుపులో భారత్ విజయం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని మెరుగ్గా నిర్వహించడంలో భారతదేశం విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వ్యక్తం చేశారు. ఆహార ధరలపై సరఫరా వైపు ఒత్తిడిని పరిష్కరించడానికి కేంద్రం ఇప్పటికే పలు చర్యలతో కూడిన చక్కటి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిందని అన్నారు. వెర్చువల్‌గా జరిగిన ‘రాయిటర్స్ నెక్ట్స్’ ఈవెంట్లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్లే ద్రవ్యోల్బణం తీవ్రమవుతోంది. ముఖ్యంగా క్రూడ్ ధరల తీవ్రతను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ► ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయగలమన్న విశ్వా సం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఇందుకు తగిన సమాచారం ఉంది. వచ్చే ఏడాది ప్రారంభం లేదా మధ్యలో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపునకు ద్రవ్యోల్బణం దిగివస్తుందని భావిస్తున్నాం. ► భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటుందని భావిస్తున్నాం. ► రష్యా నుంచి భారత్‌కు దిగుమతులు పెరిగాయి. పశ్చిమ దేశాల కూడా రష్యా నుంచి ఇంధనం వంటి దిగుమతులను ప్రస్తుతం పెంచుకుంటున్నాయి. భారత్–రష్యా సంబంధాలపై ఇలా... భారతదేశం నుండి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకోవడానికి రష్యా ఆసక్తి గురించి అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ, భారతదేశం ఇప్పటికే రూపాయి ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిందని మంత్రి చెప్పారు. ‘‘నిజానికి ఈ తరహా ఫ్రేమ్‌వర్క్ కొత్తది కాదు. ఇది చాలా దశాబ్దాలుగా ఉంది. అయితే మనకు అవసరమైనప్పుడు దానిని ఉపయోగిస్తాము. ఈ ఫ్రేమ్‌వర్క్ కింద మనం కొనడం– అమ్మడం వంటి చర్యలను నిర్వహించవచ్చు. మనం కొనుగోలు చేసే ఎరువులు లేదా ఇంధనాలకు సంబంధించి ఆ దేశంతో వాణిజ్య సమతుల్యతా అవసరమే. ఇందులో భాగంగా మనం ఖచ్చితంగా కొన్ని ఉత్పత్తులు ఆ దేశానికి విక్రయించాలి’’ అని సీతారామన్ ఈ సందర్భంగా అన్నారు. ద్రవ్యోల్బణం తీరిది.. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సీపీఐ కట్టడిచేయడంలో వైఫల్యం ఎందుకు చోటుచేసుకుందన్న అంశంపై గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఇటీవలే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి సమర్పించాల్సిన నివేదికాంశాలపై చర్చించింది. మే తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది. తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనుంది. మరోదఫా రెపో రేటు పెంపు ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. -
సావరీన్ గ్రీన్ బాండ్ల జారీకి ఫ్రేమ్‌వర్క్
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సావరీన్ గ్రీన్ బాండ్లను జారీ చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (2022–23 అక్టోబర్–మార్చి) గ్రీన్ బాండ్ల జారీ ద్వారా రూ.16,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం కేంద్ర రుణ సమీకరణలో (రూ.5.92 లక్షల కోట్లు) ఈ నిధులు భాగం కానున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022–23 బడ్జెట్లో సావరీన్ గ్రీన్ బాండ్ల జారీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ప్యారిస్ ఒప్పందం లక్ష్యాలపై భారత్ నిబద్ధతను ఈ ఫ్రేమ్‌వర్క్ బలోపేతం చేస్తుందని అన్నారు. అలాగే అర్హతగల గ్రీన్ ప్రాజెక్ట్‌ల్లోకి ప్రపంచ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపారు. ఫ్రేమ్‌వర్క్‌లో ముఖ్యాంశాలు... ► గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల అవసరాలకు అనుగుణంగా, ఎకానమీలో కార్బన్ తీవ్రత తగ్గింపు లక్ష్యంగా జారీఅయ్యే ఈ రూపాయి డినామినేటెడ్ బాండ్ల సుదీర్ఘ కాల వ్యవధిని కలిగి ఉంటాయి. ► గ్రీన్ బాండ్ల జారీకి గరిష్టంగా 12 నెలల ముందు జరిగిన ప్రభుత్వ వ్యయాలకు ఈ సమీకరణ నిధులు పరిమితమవుతాయి. అలాగే జారీ చేసిన 24 నెలల్లోపు మొత్తం ఆదాయాన్ని ప్రాజెక్టులకు కేటాయించేలా కృషి జరగనుంది. ► గ్రీన్ బాండ్ల జారీ ద్వారా వచ్చే ఆదాయాన్ని శిలాజ ఇంధనాల వెలికితీత, ఉత్పత్తి, పంపిణీ లేదా అణు విద్యుత్ ప్రాజెక్టులకు వినియోగించరాదు. ► అర్హత కలిగిన పెట్టుబడులు, సబ్సిడీలు, గ్రాంట్–ఇన్–ఎయిడ్స్ లేదా పన్ను మినహాయింపులు లేదా ఎంపిక చేసిన కార్యాచరణ ఖర్చుల రూపంలో గ్రీన్ బాండ్ల ప్రభుత్వ వ్యయాలు ఉంటాయి. -
డిజిటల్ రుణ పరిశ్రమ విస్తరణకు మేలు
ముంబై: డిజిటల్ రుణాల జారీకి సంబంధించి ఆర్బీఐ తీసుకొచ్చిన నూతన నిబంధనలను పరిశ్రమ స్వాగతించింది. మరింత బాధ్యతాయుతంగా పరిశ్రమ వృద్ధి చెందడానికి సాయపడతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టళ్లు తదితర డిజిటల్ చానళ్ల ద్వారా జారీ చేసే రుణాలకు మధ్యవర్తుల సాయం తీసుకున్నా కానీ.. ఆయా రుణాలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు నేరుగా రుణగ్రహీతల ఖాతాల్లోనే జమ చేయాలని ఆర్బీఐ బుధవారం నూతన నిబంధనలను ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయరాదని, అనైతిక రుణ వసూళ్ల విధానాలను అనుసరించకూడదని ఆదేశించింది. దీనిపై డిజిటల్ లెండర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (డీఎల్ఏఐ) స్పందించింది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోణంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఫైనాన్షియల్, ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌ల మధ్య సహకారాన్ని తప్పనిసరి చేయడాన్ని సానుకూలంగా పేర్కొంది. కస్టమర్లకు, ఫిన్‌టెక్ సంస్థలకు కొత్త నిబంధనలు ఎంతో సానుకూలమని డీఎల్ఏఐ ప్రెసిడెంట్ లిచీ చప్మన్ (జెస్ట్‌మనీ) పేర్కొన్నారు. లోపాల ఆసరాగా వ్యాపారాల నిర్మాణానికి అనుమతించేది లేదని ఆర్బీఐ స్పష్టం చేసిందన్నారు. ఆర్బీఐ నూతన నిబంధనలు ఇప్పటికే సేవలు అందిస్తున్న సంస్థలకు కొంత ప్రతిబంధకమని కోటక్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. పారదర్శకత, గోప్యతపై మరింత దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపింది. చదవండి: పెరిగే వడ్డీ రేట్లతో ఇళ్ల డిమాండ్‌కు సవాళ్లు -
Work From Home: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..!
Government To Chalk Out Legal Road Map For Work From Home: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు శుభవార్త...! కరోనా రాకతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. కాగా ఆయా కంపెనీలు ఉద్యోగులతో ఎక్కువసేపు పనిచేస్తున్నారనే వార్తలు రావడంతో... వర్క్ ఫ్రమ్ హోంపై కేంద్రం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలోనే... ఫ్రేమ్ వర్క్..! వర్క్ ప్రమ్ హోంపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించేందుకు ఓ కమిటీను ఏర్పాటుచేయనుంది. దీంతో ఉద్యోగుల హక్కులను కాపాడే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోం పేరుతో ఉద్యోగులను ఆయా సంస్థలు పిండేస్తున్నాయి. ఈ ఫ్రేమ్ వర్క్‌తో ఉద్యోగులకు కచ్చితమైన పనిగంటలను నిర్ణయించి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉద్యోగులకు విద్యుల్, ఇంటర్నెట్ బిల్లులు, ఇంట్లో ఉపయోగించే ఆఫీస్ స్పేస్, ఫర్నిచర్ వంటి ప్రాథమిక ఖర్చులను కంపెనీలు భరించేలా నిబంధనలను రూపొందించనున్నారు. వర్క్ ఫ్రమ్ హోంపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీ సంస్థను నియమించనుంది. చదవండి: 2021లో తెగ వాడేసిన ఎమోజీ ఇదేనండోయ్..! మరింత జవాబుదారీగా..! ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోంపై స్టాండింగ్ ఆర్డర్స్‌ను ఆమోదించడం ద్వారా పలు సేవారంగాల్లో వర్క్ ఫ్రమ్ హోంను లాంఛనప్రాయం చేసింది. ఈ ఆర్డర్స్‌తో రిమోట్‌గా పని చేయాలని నిర్ణయించుకునే ముందు ఉద్యోగులు, కంపెనీలు పరస్పరం పని గంటల సమయాన్ని, ఇతర షరతులను సెట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. అయితే వాస్తవికంగా పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఉద్యోగులను ఎక్కువ సమయం మేర పని చేయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకుగాను ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకుగాను ఇటీవల పోర్చుగల్ వర్క్ ఫ్రమ్ హోం చట్టాలను అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ చట్టాలకు ఆమోదం లభిస్తే... వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు చట్టపరమైన మద్దతును అందిచడంతో పాటుగా కంపెనీలకు మరింత జవాబుదారీతనాన్ని జోడిస్తుంది. చదవండి: అరెవ్వా..30 వెడ్స్ 21, సూర్య వెబ్‌సిరీస్‌లు అదరగొట్టాయే...! భారత్‌లోనే.. -
దిద్దుబాటు చర్యల చట్రం నుంచి బైటపడ్డ ఐఓబీ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల చట్రం (పీసీఏఎఫ్) నుంచి ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (ఐఓబీ) బయటపడింది. బ్యాంక్ లావాదేవీలు, వ్యవస్థాగత, పాలనాపరమైన అంశాలకు సంబంధించి ఐఓబీ మెరుగైన ఫలితాల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. కనీస మూలధన నియమావళిని అనుసరించాలని కూడా ఐఓబీకి ఆర్బీఐ సూచించింది. 2015 నుంచీ ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ ఆర్బీఐ దిద్దుబాటు చర్యల చట్రంలో ఉంది. ఈ నెల ప్రారంభంలో యుకో బ్యాంక్‌ను ఈ పరిధి నుంచి ఆర్బీఐ తొలగించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఇంకా పీసీఏ పరిధిలోనే కొనసాగుతుండడం గమనార్హం. కాగా ఐఓబీ 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.831 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. షేర్ మార్కెట్ ముగిసిన తర్వాత ఐఓబీ దిద్దుబాటు చర్యల చట్రం పరిధి నుంచి బయటకు వచ్చిన ప్రకటన వెలువడింది. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో బుధవారం ఐఓబీ షేర్ ధర 0.49 శాతం పెరిగి 20.45 వద్ద ముగిసింది. చదవండి: అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే -
మరిన్ని పటిష్ట చర్యలకు సెబీ రెడీ
ముంబై: కార్పొరేట్ గవర్నెన్స్‌ను పటిష్ట పరచడం, స్టాక్ మార్కెట్లలోకి మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించడం, స్వతంత్ర డైరెక్టర్ల నిబంధనలను కఠినతరం చేయడం, ఆర్‌ఈఐటీలకు కనీస సబ్‌స్క్రిప్షన్‌ను తగ్గించడం వంటి పలు చర్యలను వార్షిక సమావేశం సందర్భంగా సెబీ బోర్డు ఆమోదించింది. ఈ బాటలో గత ఆర్థిక సంవత్సర(2020–21) వార్షిక నివేదికను ఆమోదించింది. ఇతర వివరాలు చూద్దాం.. పబ్లిక్ ఇష్యూ, రైట్స్ ఇష్యూలలో ఇన్వెస్టర్ల పార్టిసిషేషన్ను పెంచేందుకు వీలుగా విభిన్న చెల్లింపులకు అనుమతి. ఈ ఇష్యూలకు షెడ్యూల్డ్, నాన్‌షెడ్యూల్డ్ బ్యాంకులను బ్యాంకర్లుగా వ్యవహరించేందుకు గ్రీన్‌సిగ్నల్. స్వతంత్ర డైరెక్టర్ల ఎంపిక, పునర్నియామకం, తొలగించడం తదితర అంశాల నిబంధనలను కఠినతరం చేసింది. ఈ అంశాలలో ఇక పబ్లిక్ వాటాదారులకూ పాత్ర. 2022 జనవరి 1 నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(ఇన్విట్స్) మరిన్ని పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వెసులుబాటు. ఇందుకు వీలుగా కనీస సబ్స్క్రిప్షన్, కనీస లాట్ పరిమాణం కుదింపు. కనీస పెట్టుబడి రూ. 10,000–15,000, ఒక యూనిట్‌తో ట్రేడింగ్ లాట్. ప్రస్తుతం ఇవి రూ. 1,00,000–50,000గా ఉన్నాయి. 100 యూనిట్లు ఒక లాట్‌గా అమలవుతోంది. అక్రిడెటెడ్ ఇన్వెస్టర్లకు మార్గదర్శకాలు. ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్టులపట్ల మంచి అవగాహన కలిగిన వారిని అక్రిడెటెడ్ ఇన్వెస్టర్లుగా వర్గీకరణ. ఈ జాబితాలో ఆర్థిక అంశాల ఆధారంగా వ్యక్తులు, కుటుంబ ట్రస్ట్‌లు, హెచ్‌యూఎఫ్‌లు, ప్రొప్రయిటర్షిప్స్, పార్టనర్షిప్ సంస్థలు, ట్రస్టులు, కార్పొరేట్ బాడీలు చేరనున్నాయి. అన్‌లిస్టెడ్ ఇన్విట్స్‌లో యూనిట్లు కలిగిన కనీసం ఐదుగురు వాటాదారులు తప్పనిసరి. ఇన్విట్స్ మొత్తం మూలధనంలో వీరి ఉమ్మడి వాటా 25 శాతానికంటే అధికంగా ఉండాలి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల తరఫున దేశీ ఫండ్ మేనేజర్లు కార్యకలాపాలలో భాగంకావచ్చు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి సమాచారం అందించేవారికి ప్రకటించే బహుమానం రూ. కోటి నుంచి రూ. 10 కోట్లవరకూ పెంపు. చదవండి: NITI Aayog: పన్ను మినహాయింపులకు నీతి ఆయోగ్ ఓటు -
కార్పొరేట్ల లాభాలకే విత్తన చట్టం!
కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం 2019 ముసాయిదాను విడుదల చేస్తూ నవంబర్ 15 నాటికి సూచనలు, సలహాలు, సవరణలు పంపాలని వెబ్సైట్లో పెట్టారు. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం విత్తన బిల్లు తేవడానికి 2004 నుండి మల్లగుల్లాలు పడుతూనే వుంది. విత్తన కార్పొరేట్లకు లొంగి ప్రభుత్వాలు విత్తన చట్టం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇదే సందర్భంలో దేశీయ పరిశోధనల వల్ల విత్తనోత్పత్తి భాగా పెరిగింది. 1995లో దేశంలో ప్రవేశపెట్టిన సరళీకృత వ్యవసాయ విధానాల వల్ల, డబ్ల్యూటీఓ షరతులు అమలు జరపడం వల్ల విదేశీ బహుళజాతి సంస్థలు తమ టెక్నాలజీతో వచ్చి ఇక్కడ విత్తనం ఉత్పత్తి చేయడమే కాక రైతులు వాణిజ్య పరంగా సాగుచేయడానికి విత్తనాలను అమ్ముతున్నారు. ప్రస్తుతం మోన్శాంటో, డూపాయింట్, సింజెంటా, కార్గిల్ లాంటి కంపెనీలు భారతదేశంలో 20 శాతం విత్తనాలు అమ్ముతున్నాయి. లాభాలు ఆశిస్తున్న బహుళజాతి కంపెనీలు రైతులకు నాణ్యతలేని విత్తనాలను, కల్తీ విత్తనాలను సరఫరా చేసి వేల కోట్లు లాభాలార్జిస్తున్నారు. ఏటా ఉభయ తెలుగు రాష్ట్రాలలో 5.6 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతింటున్నాయి. దీనిపై రైతు సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేసి, మారిన పరిస్థితులకు అనుగుణంగా విత్తన చట్టం తేవాలని కోరారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం విత్తన ముసాయిదా చట్టం తెచ్చింది. దానికి రైతులు, రైతు సంఘాలు, లా కమిషన్ చేసిన సూచనలను జతపరిచి బిల్లుగా రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందకుండా బహుళజాతి సంస్థలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఆమోదాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత రైతుల ఆందోళన ఫలితంగా 2010లో మరొకసారి సవరణలతో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మళ్లీ అదే ఒత్తిడి రావడంతో బిల్లును ఆమోదానికి పెట్టలేదు. రాజ్యాంగంరీత్యా విత్తన చట్టం రాష్ట్ర ప్రభుత్వాలు తేవాలి. కానీ కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి వారు చేయకుండా తానే చేస్తానని అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తూ లేఖలు రాసింది. అయినప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సంఘం ఆందోళన ఫలితంగా 2012లో శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టింది. తరువాత కేంద్రం ఒత్తడితో రాష్ట్రం బిల్లును ఉపసంహరించుకుంది. 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముసాయిదాను చర్చల కోసం సూచనలు చేయాలని విడుదల చేసింది. కానీ శాసనసభలో నేటికి పెట్టలేదు. తిరిగి 2019 విత్తన ముసాయిదాలో కార్పొరేట్లకు స్వేచ్ఛ కల్పిస్తూ, రైతులు నష్టపోయిన ఎడల వినియోగదారుల కోర్టుకు వెళ్లమని బిల్లులో పెట్టింది. గత పదేళ్లలో వరంగల్, గుంటూరు వినియోగదారుల కోర్టుల్లో వేలాది కేసులు వేయడం జరిగింది. 80 శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తీర్పు వచ్చిన 20 శాతం కేసులపై కంపెనీలు హైకోర్టులో అప్పీల్ చేశాయి. మొత్తంపై కంపెనీలు పరిహారం నుంచి తప్పించుకున్నాయి. కోరలు తీసిన ఈ బిల్లు రైతులకు ఏమాత్రం ఉపయోగపడదు. బహుళజాతి సంస్థలకు లాభాలు తెవడానికి మరోవైపున రైతులకు బిల్లు తెచ్చామని చెప్పుకోవడానికి ఉభయతారకంగా ఈ బిల్లు తెచ్చారు. వ్యాసకర్త సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు, మొబైల్ : 94900 98666 -
డేటా భద్రతకు చట్టం
సమాచార సాంకేతిక రంగ నిపుణులు ఎంతకాలం నుంచో కోరుతున్న వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం సాకారం అయ్యేందుకు తొలి అడుగు పడింది. కేంద్ర కేబినెట్ బుధవారం ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఏడాదిపాటు ఐటీ రంగ నిపుణులతో, సంస్థలతో సంప్రదింపులు జరిపి, వివిధ దేశాలు అమలు చేస్తున్న చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ బిల్లును రూపొందించింది. ఆ కమిటీ నిరుడు సమర్పించిన బిల్లుపై అభిప్రాయాలు సేకరించి తగిన మార్పులు, చేర్పులూ చేశాక ప్రస్తుత బిల్లు కేబినెట్ ముందుకొచ్చింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇంటర్నెట్తో అనుసంధానమైంది. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు మొదలుకొని అనేకానేక ఎలక్ట్రానిక్ పరికరాలు అందులో భాగంగా మారాయి. ఈ డిజిటల్ యుగంలో ఈమెయిల్ ఖాతా లేని వారు, వేర్వేరు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ప్రారంభించనివారు ఉండరు. అలా ఖాతా ప్రారంభించే ప్రతి ఒక్కరినుంచి వివిధ సంస్థలు విస్తృతంగా డేటా సేకరిస్తున్నాయి. వారి పేరు, వయసు, చిరునామా, ఫోన్ నంబర్, వారి ఇష్టాయిష్టాలు మొదలైనవన్నీ అందులో ఉంటాయి. అయితే ఈ సమాచారాన్నంతా వారు దేనికి వినియోగిస్తారో, ఎందుకు సేకరిస్తారో ఎవరికీ తెలియదు. గూగుల్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాలన్నీ డేటా సేకరణ చేస్తున్నాయి. నాలుగేళ్లక్రితం కేంబ్రిడ్జి అనలిటికా(సీఏ) అనే సంస్థకు ఫేస్బుక్ తన ఖాతాదార్ల సమాచారాన్ని అమ్ముకుందని వెల్లడైంది. ఇలాంటి డేటాతో వ్యాపార వాణిజ్య సంస్థలు తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవడం రివాజైంది. సీఏ సంస్థ మన దేశంలోని కొన్ని రాజకీయ పక్షాలతో ఒప్పందం కుదుర్చుకుని భిన్న ప్రాంతాల ఓటర్ల కుల, మత వివరాలు, వారి ఇష్టాయిష్టాలు వగైరాలు అందజే సింది. పౌరుల డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడి చాలామంది బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఆ మధ్య ఆధార్ డేటా కూడా లీకైంది. ఈ నేపథ్యంలో డేటా పరిరక్షణ చట్టం అవసరం ఎంతో వుంది. సమాచార సాంకేతిక నిపుణులు దీని అవసరం గురించి ఎప్పటినుంచో చెబుతున్నారు. చాలా దేశాలు ఇప్పటికే ఈ తరహా చట్టాలు తీసుకొచ్చాయి. తమ ఖాతాదార్లు వీడియోలు చూసే సగటు సమయం గురించి తప్పుడు సమాచారం ఇచ్చిందని ఫేస్‌బుక్‌పై అనేక వాణిజ్య ప్రకటన సంస్థలు న్యాయస్థానాల్లో కేసులు వేస్తే మొన్న అక్టోబర్‌లో ఫేస్బుక్ యాజ మాన్యం 4 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. తమ పౌరులు ఫేస్బుక్ ఖాతాల్లో వ్యక్తిగత విని యోగం కోసం పెట్టుకున్న ఫొటోలన్నీ బట్టబయలయ్యాయని, అందుకు 2లక్షల 70 వేల డాలర్ల జరిమానా చెల్లించాలని టర్కీ శ్రీముఖం పంపింది. అక్కడ మాత్రమే కాదు... రష్యా, ఇటలీ, బ్రిటన్, అమెరికా, జర్మనీ తదితర దేశా లన్నిటా ఫేస్‌బుక్‌పై లక్షలాది డాలర్లు పరిహారంగా చెల్లించా లంటూ దావాలు పడ్డాయి. ఈ ఏడాది ఇంతవరకూ దాఖలైన కేసుల్లో ఫేస్బుక్ సంస్థ దాదాపు 516 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం దాని వార్షిక ఆదాయంలో దాదాపు ఏడున్నర శాతం. డేటా సేకరణ, నిక్షిప్తం, వినియోగం వంటి అంశాల్లో ఈ బిల్లు అనేక నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించింది. వ్యక్తుల ముందస్తు అనుమతి లేనిదే వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ అందజేయరాదని బిల్లు నిర్దేశిస్తోంది. అయితే పౌరుల సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేయాలన్న విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సంస్థలన్నీ ఆ సమాచారాన్ని ఈ దేశంలో నెలకొల్పే సర్వర్లలో మాత్రమే భద్రపరచాలని లోగడ చెప్పగా, ఇప్పుడు దాన్ని సవరించి వ్యక్తుల సున్నితమైన సమాచారాన్ని, కీలక సమాచారాన్ని ఇక్కడి సర్వర్లలో ఉంచాలని...ఇతరత్రా సమాచా రమైతే ఆయా సంస్థలు ఏ సర్వర్లలో భద్రపరిచినా అభ్యంతరం లేదని తాజా ముసాయిదా బిల్లు చెబుతోంది. ప్రభుత్వం ఇచ్చే నిర్వచనాన్నిబట్టి ‘కీలక సమాచారం’ ఏమిటన్నది నిర్ణయమవుతుంది. అవసరాన్నిబట్టి ఈ నిర్వచనం పరిధిలోకి కొత్త అంశాలు చేరే అవకాశం ఉంటుంది. సున్నితమైన సమాచారం విషయంలో ఖాతాదారు అనుమతి అవసరమవుతుంది. డేటా నిక్షిప్తానికి ఇక్కడ సర్వర్లు నెలకొల్పాలని మన ప్రభుత్వం పట్టుదలకుపోతే... వేరే దేశాల్లోని మన సంస్థలపై కూడా అక్కడి ప్రభుత్వాలు ఇలాంటి షరతులే పెట్టే ప్రమాదం ఉందని, అందువల్ల తమపై ఆర్థిక భారం పడుతుందని ఐటీ సంస్థలు మొరపెట్టుకున్నాయి. దీంతో బిల్లులో మార్పులు చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్వంటి సంస్థలు ఖాతాదారులు అందజేసే వ్యక్తిగత సమాచారాన్ని తప్పనిసరిగా నిర్ధారించుకోవాల్సివుంటుంది. ఈ బిల్లు చట్టమైతే వారు నిజమైన వ్యక్తులేనా లేక వేరేవారి పేర్లతో ఖాతాలు ప్రారంభించారా అన్నది తెలుసుకోకతప్పదు. తప్పుడు పేర్లతో ప్రవేశించినవారే సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా, బాధ్యతారహితంగా వ్యాఖ్యానాలు చేయడం, కించపరచడం లాంటివి చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ నిబంధన పొందుపరిచారు. అలాగే అన్ని సంస్థలూ తమ తమ ప్రతినిధులను ఈ దేశంలో నియమించుకోవడం ఇకపై తప్పనిసరి. సంస్థలకు జవాబు దారీతనం ఉండాలన్న సంకల్పంతో ఈ నిబంధన పెట్టారు. ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారణైతే సంస్థలో డేటా పరిరక్షణ బాధ్యతలు చూస్తున్న వ్యక్తికి మూడేళ్లవరకూ జైలు, రూ. 15 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. తమ వ్యక్తిగత డేటా అవాంఛిత వ్యక్తులు, సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు. అయితే ఇతర హక్కుల మాదిరి ఈ హక్కుకు భౌగోళిక సరిహద్దులుండవు. కనుక ఇలాంటి చట్టానికి రూపకల్పన చేయడం కత్తి మీది సాము. ఈ క్రమంలో ప్రభుత్వాలకు వ్యక్తుల డేటాపై ఏదోమేరకు ఆధిపత్యం లభించడం కూడా తప్పనిసరి. ఆలస్యంగానైనా ఇలాంటి చట్టం రాబోతుండటం హర్షించదగ్గ విషయం. -
సెక్యూరిటీ గార్డుల సంక్షేమానికి ముసాయిదా
న్యూఢిల్లీ: ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ముసాయిదా విధాన పత్రాన్ని రూపొందించింది. ‘ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ సెంట్రల్ (అమెండ్మెంట్) మోడల్ రూల్స్, 2019’ ముసాయిదాపై అభిప్రాయాలను, సూచనలను ఇవ్వాల్సిందిగా వ్యక్తులు, సంస్థలను కోరుతూ హోం శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 90 లక్షల మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు అంచనా. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు లైసెన్స్లిచ్చేందుకు ఇప్పటికే హోం శాఖ ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. లైసెన్సుల జారీకి ఆయా ఏజెన్సీల డైరెక్టర్లు, భాగస్వామ్యులు, యజమానుల వివరాలను వ్యక్తిగతంగా పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం లేదని కూడా గతంలో హోంశాఖ ప్రకటించింది. ముసాయిదా నిబంధనలను mha.gov.in/sites/default/files/private SecurityAgenies&06112019.pdf నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆ ప్రకటనలో హోంశాఖ పేర్కొంది. అభిప్రాయాలు, సూచనలను us&pm@nic.inMకు డిసెంబర్ 6 లోపు పంపించాలని కోరింది. -
ఆధార్ ప్రత్యామ్నాయానికి అనుమతివ్వండి..
ముంబై: కస్టమర్ల గుర్తింపు ధృవీకరణ కోసం (కేవైసీ) ఆధార్‌ను వినియోగించరాదంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానాలకు అనుమతినివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను పేమెంట్స్ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఫేస్ రికగ్నిషన్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించేందుకు అనుమతించాలని కోరాయి. కస్టమర్లు తమ ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేసి, ఆ తర్వాత కెమెరా ముందు మరోసారి దాన్ని నిర్ధారించేలా ఒక ప్రతిపాదనను ఆర్బీఐకి సమర్పించినట్లు పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్ నవీన్ సూర్య తెలిపారు. ఈ విధానంలో కస్టమర్ అప్లోడ్ చేసిన పత్రాన్ని ఆల్గోరిథం ఆధారంగా సిస్టమ్ ధృవీకరించుకుంటుందని, ఆ తర్వాత కెమెరా ముందు కూర్చున్న వ్యక్తిని ఆ డాక్యుమెంట్‌లోని ఫొటోతో సరిపోల్చి చూసుకుని నిర్ధారణ చేస్తుందని ఆయన తెలిపారు. ఆర్బీఐ ఇంకా తమ ప్రతిపాదనకు అంగీకరించలేదని, ఇందుకు సుమారు ఆరు నెలలు పట్టొచ్చని సూర్య పేర్కొన్నారు. -
చెరో వైపు..
సాక్షి, ఆదిలాబాద్ : కొత్త జోనల్ వ్యవస్థలో మొదటి జోన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పాత జిల్లాలైన నిజామాబాద్, మెదక్ జిల్లాలతో కలిపి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ముసాయిదా వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో నాలుగు జోన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్న విషయం విదితమే. కాగా గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముసాయిదాలో పేర్కొన్న విధంగా జిల్లాల అమరిక మారింది. కాళేశ్వరం జోన్‌ను మొదటిగా జోన్‌గా నిర్ణయిస్తూ పాత ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు పాంత్రంలోని రెండు జిల్లాలను అందులో చేర్చారు. రెండవ జోన్‌గా బాసరను నిర్ణయిస్తూ అందులో పశ్చిమ జిల్లాలోని రెండు జిల్లాలను చేర్చారు. ప్రధానంగా చదువుల తల్లి బాసరను, కాళేశ్వరం వంటి ప్రముఖ దేవాలయాల ప్రాంతాలను జోన్లుగా నిర్ణయించడంలో సీఎం సెంటిమెంట్ కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అప్పుడు.. ఇప్పుడు.. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్లు ఉండగా, ఐదవ జోన్లో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. కొత్త ముసాయిదాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు పాత నిజామాబాద్, మెదక్ జిల్లాలను కలిపి మొదటి జోన్లో చేర్చారు. గురువారం ముఖ్యమంత్రి జోన్ల సంఖ్యను పెంచడంతోపాటు అవిభాజ్య ఆదిలాబాద్ జిల్లాను తూర్పు, పశ్చిమ జిల్లాలను చెరో వైపు చేర్చడంతో ఈ నాలుగు జిల్లాల్లోని ఉద్యోగుల మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న సంబంధాలు దూరం కానున్నాయి. అవిభాజ్య ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పడినప్పుడు భౌగోళిక పరిస్థితిలో మార్పు రాగా, ప్రస్తుతం జోన్ల పరంగా చెరో వైపు ఈ జిల్లాలు వెళ్తుండడంతో ముందు నుంచి ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, బదిలీల్లో ఉన్న సంబంధాల్లో మార్పు రానుంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు జోన్ పరంగా భూపాల్పల్లి, పెద్దపల్లి జిల్లాలతో కలుస్తుండగా, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలతో ఏకం అవుతున్నాయి. మల్టీజోన్‌లో ఉమ్మడి జిల్లా ఒకటి.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఏడు జోన్లతోపాటు రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి మల్టీజోన్‌లో రాజన్న, భద్రాద్రి జోన్లతో ఉమ్మడి జిల్లాలు చెరో వైపు వెళ్లిన కాళేశ్వరం, బాసర జోన్లను కలిపారు. ఇదిలా ఉంటే మల్టీ జోన్లో గెజిటెడ్ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, బదిలీలు ఏస్థాయి వరకు ఉంటాయనే దానిపై ఉద్యోగుల్లో సందిగ్ధం వ్యక్తం అవుతోంది. గెజిటెడ్ ఉద్యోగుల్లో మొదటి స్థాయిలో గెజిటెడ్ ఉద్యోగులు, రెండవ స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్లు, మూడో స్థాయిలో డిప్యూటీ డైరెక్టర్లు, నాలుగో స్థాయిలో జాయింట్ డైరెక్టర్ పోస్టులు ఉంటాయి. మొదటి, రెండవ స్థాయి గెజిటెడ్ పోస్టులలో శాఖాధిపతులే పదోన్నతులు, బదిలీలు చేపడుతారు. మూడో, నాలుగో స్థాయిలో ప్రభుత్వం పదోన్నతులు, బదిలీలు చేపడుతుంది. దీంతో ప్రస్తుతం మల్టీ జోన్లో ఏ స్థాయిలను ఉంచుతారనే విషయంలో స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. గతంలో మొదటి స్థాయిలో గెజిటెడ్ ఉద్యోగులకు కొన్ని శాఖల్లో జోనల్, మరి కొన్ని శాఖల్లో మల్టీ జోనల్ స్థాయిలో ప్రక్రియ జరిగేది. రెండవ స్థాయి గెజిటెడ్ పోస్టుల్లో ఏ శాఖలోనైనా రాష్ట్ర స్థాయిలో వ్యవహారాలు సాగేవి. మూడో, నాలుగు స్థాయి గెజిటెడ్ ఉద్యోగులకు రాష్ట్ర స్థాయిలో ఏ జిల్లాలో అయినా బదిలీలు జరిగేవి. దీంతో ప్రస్తుతం వేటిని మల్టీజోన్ పరిధిలోకి తీసుకువస్తారనే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త తరానికి ప్రయోజనం.. ప్రస్తుతం ఏడు జోన్ల విధానం కొత్త తరానికి ప్రయోజనం కలిగిస్తుంది. బాసర జోన్లో ఆదిలబాద్, నిర్మల్ జిల్లాలను నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో కలపడం సమంజసమే. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను పెద్దపల్లి, భూపాల్పల్లి జిల్లాలతో కలపడం కూడా సబబే. భౌగోళిక పరిస్థితులను బట్టి ఈజోన్లను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారికి సీనియార్టీ పరంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతోనే అనుసంధానం ఉంది. రాబోయే తరానికి కొత్త జోన్ల విధానం ప్రయోజనం కలిగిస్తోంది. – టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎస్.అశోక్ నాన్చడానికే రోజుకో మాట.. ప్రభుత్వం జోనల్ విధానంలో చిత్తశుద్ధితో పని చేయడం లేదు. మొదట నాలుగు జోన్లతో ముసాయిదా ఏర్పాటు చేసి ఇప్పుడు ఏడు జోన్లు అంటుంది. కేవలం సమస్యను దాట వేయడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మేధావులను కూర్చోబెట్టి జోన్ల ఏర్పాటులో నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా జరగడంలేదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెరో మాట చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా సరైన అవగాహన కనిపించడం లేదు. ప్రభుత్వ నిర్ణయంపై తలూపడం తప్పితే ఏమీ చేయడం లేదు. అదే సమయంలో కాళేశ్వరం, బాసర జోన్లకు హెడ్ ఆఫీస్ ఎక్కడ పెడతారన్నది స్పష్టత లేదు. జిల్లా కేంద్రాలను జోన్ కార్యాలయాలకు కేటాయిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. సెంటిమెంట్‌ను పరిగణలోకి తీసుకోవడం ఏ మేరకు సమంజసం. – వెంకట్, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
3లోపు కావేరి ముసాయిదా
న్యూఢిల్లీ: కావేరి నదీ యాజమాన్య బోర్డుకు సంబంధించిన ముసాయిదాను మే 3వ తేదీలోపు తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటయ్యే వరకు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త వహించాలని కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు సూచించింది. ఆరు వారాల్లో బోర్డును ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 16నే సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు కేంద్రం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తప్పుబట్టారు. మరోవైపు కేంద్రం తీరుకు నిరసనగా చెన్నైలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించకూడదన్న వాదనకు బలం పెరుగుతోంది. ఈ ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి చెన్నైలో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మంగళవారం జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తే చిదంబరం స్టేడియం బయట ఆందోళన చేసి అడ్డంకులు సృష్టిస్తామని తమిళగ వళ్వురిమై కచ్చి (టీవీకే) అనే సంస్థ తాజాగా హెచ్చరించింది. చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించకపోవడమే మంచిదని తమిళనాడు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి జయకుమార్ కూడా అన్నారు. ఇక్కడి పరిస్థితి గురించి ఐపీఎల్ నిర్వాహకులకు తెలియజేశామనీ, అయితే మ్యాచ్‌లు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం భద్రత సహా అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తామని స్పష్టం చేశారు. -
గొల్ల కురుమ సంక్షేమ భవనానికి కేసీఆర్ శంకుస్థాపన
-
విద్యా విధానం.. ముసాయిదానే!
ఆమోదించక ముందే విమర్శలా? * అందరి అభిప్రాయాలతోనే తుది రూపు * సరైన దిశలోనే రాష్ట్ర విద్యారంగం * కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సాక్షి, హైదరాబాద్: నూతన జాతీయ విద్యా విధానంపై ప్రకటించిన ముసాయిదాను కేంద్రం ఇంకా ఆమోదించలేదని, ఇది కేవలం వివిధ వర్గాల నుంచి సేకరించిన సలహాలు, సూచనల సంకలనం మాత్రమేనని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ఇంకా ఆమోదించని విధానా న్ని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని పేర్కొన్నారు. నూతన విద్యా విధానంపై విస్తృత చర్చ కోసమే ముసాయిదాను బహిర్గతపరిచామని చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నూతన విధ్యా విధానానికి తుదిరూపు ఇస్తామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30 కల్పిస్తున్న మైనారిటీ విద్యా సంస్థల స్థాపన,నిర్వహణ హక్కులను కేంద్రం హరించబోతోందన్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. నూతన విద్యా విధానంపై సెప్టెంబర్ 15 వరకు సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. నూతన విద్యా విధానంపై రాష్ట్రాల అభిప్రాయ సేకరణలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాలని కడియం కోరారని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ఆదర్శ, కస్తూర్బా గాంధీ, సంక్షేమ వసతి గృహాల పాఠశాలల విజయాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యారంగం పరంగా రాష్ట్రం సరైన దిశలో వెళుతోందని ప్రశంసించారు. రాష్ట్రానికి ఐదు వరాలివ్వండి: కడియం ప్రతి రాష్ట్రంలో ఓ ఐఐఎం ఉండాలని కేంద్రం విధానమని, రాష్ట్రానికి కూడా ఐఐఎం మంజూరు చేయాలని ప్రకాశ్ జవదేకర్‌ను కోరినట్లు కడియం తెలిపారు. దీన్ని 2017-18 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని పేర్కొన్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదాన్ని ప్రధాని మోదీ ప్రకటించగానే బాలికల కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోందని ఆశించామని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవన్నారు. దేశ వ్యాప్తంగా బాలికల కోసం జిల్లాకో ప్రత్యేక విద్యా సంస్థ ఏర్పాటు చేసి 1వ తరగతి నుంచి పీజీ వరకు విద్యను అందించాలని ప్రతిపాదించామని, దీనిపై పరిశీలన జరుపుతామని జవదేకర్ ఇచ్చారని తెలిపారు. కేంద్రం సహకారంతో దేశవ్యాప్తంగా మధ్నాహ్న భోజన పథకాన్ని 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకే అందిస్తున్నరని, ఇకపై 12వ తరగతి విద్యార్థులకు కూడా వర్తింపచేసేందుకు కేంద్ర సహకరించాలని కోరినట్లు వివరించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే బోధిస్తున్నారని, ఆ తర్వాత సమీపంలో జూనియర్ కాలేజీలు లేక విద్యార్థినులు చదువు మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 12వ తరగతి వరకు విద్యను అందించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. సరైన శిక్షణ లేకనే.. దేశ వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పడిపోవడానికి కారణం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడమేనని, ఉపాధ్యాయుల శిక్షణకు అవసరమైన నిధులు, సదుపాయాలను కేంద్రం కల్పించాలని కోరినట్లు కడియం వివరించారు. ఈ ఐదు ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కేంద్ర సంస్థలైన ఎన్సీఈఆర్టీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈలు ఇష్టారాజ్యంగా ఇంజనీరింగ్, బీఈడీ, డీఈడీ కాలేజీలను మంజూరు చేస్తున్నాయని, రాష్ట్రాల అవసరాల మేరకే కొత్త విద్యా సంస్థలను మంజూరు చేసేలా ఈ సంస్థల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తామని జవదేకర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
భారత పటం బిల్లు సమీక్షకు సిద్ధం: కేంద్రం
న్యూఢిల్లీ: భౌగోళిక ప్రాదేశిక సమాచార నియంత్రణ బిల్లు-2016 నిబంధనలను సమీక్షించేందుకు సిద్ధమని సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. బిల్లులో భారత పటాన్ని తప్పుగా చిత్రీకరించే వారికి 7 ఏళ్ల జైలుశిక్ష, రూ. 100 కోట్ల జరిమానా ప్రతిపాదించారు. ముసాయిదాపై అభిప్రాయాల కోసం బిల్లును ప్రజలకు అందుబాటులో ఉంచారు. నెల రోజుల్లో వచ్చే సలహాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని హోం శాఖ తెలిపింది. బిల్లు నిబంధనలు కఠినంగా ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
లెక్కల చిక్కులు
తేలని బీసీ గణాంకాలు సిటీబ్యూరో: బీసీల గణన గడువును పెంచినప్పటికీ లెక్కలు తేలక అధికారులు సతమతమవుతున్నారు. వాస్తవానికి బీసీ ముసాయిదాను మంగళవారం ప్రజల ముందుకు తేవాల్సి ఉన్నప్పటికీ... ఓటర్ల జాబితా వెలువరిస్తున్నందున దీన్ని మరో రెండు రోజులకు పొడిగించారు. ఈలోగా లెక్కలు సరి చేయాలని భావిస్తున్నారు. గ్రేటర్లో 2009లో బీసీలు 27.42 శాతం.. 2013లో 29.09 శాతంగా ఉన్నారు. కొత్త లెక్కల మేరకు ఎంత కసరత్తు చేసినా 27 శాతం కూడా కావడం లేదు. తాజా సమాచారం ప్రకారం 26.22 శాతం ఉన్నట్లు గుర్తించారు. ఇంటింటి సర్వే చేసినట్లు.. బీసీల సంతకాలు.. ఫోన్ నెంబర్లు సేకరించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, చాలా మంది ప్రజలు తమ ఇళ్లకు ఎవరూ రాలేదని అంటున్నారు. పాత లెక్కలు ముందుంచుకొని ఈ కార్యక్రమాన్ని మమ అనిపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిళ్ల వారీగా ఎక్కడ తక్కువ ఉన్నారో అధికారులు అన్వేషించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఖైరతాబాద్ (సర్కిల్-7బి)లో అత్యధికంగా 45.74 శాతం మంది బీసీలు ఉండగా... అత్యల్పంగా అబిడ్స్ (సర్కిల్-8)లో 16.02 శాతం మంది ఉన్నారు. సర్కిళ్ల వారీగా ఇలా.. కాప్రా సర్కిల్లో 24.29 శాతం, ఉప్పల్‌లో 26.12, ఎల్బీనగర్-ఎలో 18.21, ఎల్బీనగర్-బిలో 20.95, సర్కిల్-4ఏలో 27.53, సర్కిల్-4బిలో 27.91, సర్కిల్-5లో 31.91, రాజేంద్రనగర్‌లో 32.28, సర్కిల్-7ఎలో 37.96, సర్కిల్-7బిలో 45.74 శాతం బీసీలు ఉన్నారు. సర్కిల్-8లో 16.02, సర్కిల్-9ఎలో 20.51, సర్కిల్-9బిలో 22.06, ఖైరతాబాద్-ఎలో 20.58, ఖైరతాబాద్-బిలో 24.55, శేరిలింగంపల్లి-1లో 24.45, శేరిలింగంపల్లి-2లో 19.90, పటాన్చెరు, ఆర్సీపురంలో 37.49, కూకట్పల్లి-ఎలో 20.10, కూకట్పల్లి-బిలో 20.02, కుత్బుల్లాపూర్‌లో 31.91, అల్వాల్‌లో 21.16, మల్కాజిగిరిలో 20.04, సికింద్రాబాద్‌లో 25.56 శాతంగా ఉన్నాయి. నిరసన బీసీ గణన సవ్యంగా సాగలేదని వివిధ వర్గాల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనుభవజ్ఞులైన ఎన్యూమరేటర్లతో సర్వేను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ చైర్మన్ ఎం.నాగేష్‌ముదిరాజ్ సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఉద్యమానికి సిద్ధం వార్డుల విభజన, డీలిమిటేషన్లలో అవతకవకలు జరిగాయని, వీటిని సరిచేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని టీడీపీ, బీజేపీలు హెచ్చరించాయి. సోమవారం టీడీపీ కార్యాలయంలో జరి గిన సమావేశంలో టీడీపీ నాయకులు గోపీనాథ్, సాయన్న, బీజేపీ నాయకులు వెంకట్‌రెడ్డి, డా.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఇందిరా పార్కు వద్ధ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
పరుగు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు యంత్రాంగం సన్నాహాలు ముగిసిన డీలిమిటేషన్ నేడు ఓటర్ల జాబితా విడుదల 26న బీసీల ముసాయిదా జనవరిలో ఎన్నికలు? సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం చురుగ్గా కదులుతోంది. వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. వార్డుల (డివిజన్ల) వారీగా ఓటర్ల జాబితాను మంగళవారం (నేడు) ప్రజల ముందుకు తీసుకురానున్నారు.వీటిని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాలు, ఆర్డీవో, తహశీల్దారుల కార్యాలయాల్లో ఉంచడంతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేస్తారు. ప్రజలు, రాజకీయ పక్షాలు తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, చిరునామా మార్పులకు అవకాశం ఉంటుంది. అనంతరం 26వ తేదీన బీసీల ముసాయిదా జాబితాను ప్రజల ముందు ఉంచుతారు. దానిపై అభ్యంతరాలకు వారం రోజుల గడువిస్తారు. ఫిర్యాదుల ఆధారంగా అవసరమైన మార్పుచేర్పులు చేసి ఓటర్ల జాబితాలో బీసీలను మార్కింగ్ చేస్తారు. అనంతరం జనాభా ప్రాతిపదికన మొత్తం 150 డివిజన్లలో ఏవి ఏ వర్గానికి చెందుతాయో ఖరారు చేస్తారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఇవన్నీ డిసెంబర్ 15లోగా పూర్తయ్యాక... మిగిలేది ఎన్నికల నోటిఫికేషనే. జనవరిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. సిబ్బంది కోసం లేఖలు ఈ ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు, రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోలు)తో సహా దాదాపు 50 వేల మంది ఎన్నికల సిబ్బంది కోసం జీహెచ్ఎంసీ అధికారులు వివిధ విభాగాల అధికారులకు లేఖలు రాశారు. జీహెచ్ఎంసీ వద్ద ప్రస్తుతం 6900 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి. మరో 5 వేల ఈవీఎంలు కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు సంబంధిత అధికారి తెలిపారు. ప్రారంభోత్సవాలు ముమ్మరం.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఎక్కువ వ్యవధి లేకపోవడంతో వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంతో పాటు ఇం టింటికి రెండు చెత్తడబ్బాల కార్యక్రమాన్ని ప్రారంభిం చడం... పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడం తెలిసిందే. ప్రచారం జోరు.. జీహెచ్ఎంసీలో అమలవుతున్న రూ.5భోజన కార్యక్రమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాల ప్రచార హోర్డింగులు సైతం భారీగా దర్శనమిస్తున్నాయి. నగరంలోని వివిధ ముఖ్య కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఇలా.. ఎన్నికల లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగర ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న బీపీఎస్, ఎల్ఆర్ఎస్లను కూడా ఇటీవలే అమల్లోకి తెచ్చారు. దీని ద్వారా ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఒక అభిప్రాయం కాగా... జీహెచ్ఎంసీ ఖజానా నిండేందుకూ ఉపకరించగలదని భావిస్తున్నారు. -
మహా వ్యూహం
గ్రేటర్లో మొదలైన ఎన్నికల సందడి సీనియర్లను బరిలో దించాలని టీఆర్ఎస్ యోచన మంత్రులకు బాధ్యతలు అభివృద్ధి పథకాల వేగవంతం బలాబలాలపై ప్రతిపక్షాల అంచనా ఎవరికి వారు సమావే శాలు జీహెచ్ఎంసీలో ఎన్నికల వేడి మొదలైంది. డీలిమిటేషన్ ముసాయిదా విడుదలై 24 గంటలు తిరగకముందే రాజకీయ వర్గాల్లో కదలిక ప్రారంభమైంది. విజయ తీరాలు చేరేందుకు వ్యూహాలు రచించే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. బలాబలాలపై అంచనాకు వస్తున్నాయి. ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ ఓ అడుగు ముందే ఉంది. ఎన్నికల బరిలో సీనియర్ నేతలను... ఎంపీలు... ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి పాలైన వారిని దించాలని యోచిస్తోంది. తద్వారా గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునే పనిలో పడింది. మరోవైపు అభివృద్ధి... సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఉచిత పథకాలకు... రాయితీలకు తెర తీస్తోంది.ఈ దిశగా అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్లో సమావేశమయ్యాయి. ఎన్నికల వ్యూహంపై చర్చించాయి. సిటీబ్యూరో: ఓ వైపు బలాబలాలు... సమీకరణాల అంచనాలో రాజకీయ పార్టీలు... మరోవైపు అభివృద్ధి... సంక్షేమ పథకాలు వేగవంతం చేసే పనిలో ప్రభుత్వ వర్గాలు... ఒక్క రోజులోనే నగరంలో కనిపించిన మార్పు ఇది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో తొలిఘట్టమైన డీలిమిటేషన్ ముసాయిదా విడుదల ప్రభావమిది. డీలిమిటేషన్ వల్ల తమకు పట్టున్న ప్రాంతాలను కాకుండా చేస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఈ ‘మార్పు’ను అనుకూలంగా మార్చుకోవడమెలాగా అని ఆలోచిస్తున్నాయి. అధికారులు మాత్రం ఇవన్నీ ‘సహజమే’ననే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేందుకు, కొత్త సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. డీలిమిటేషన్ పూర్తి కాగానే వార్డుల రిజర్వేషన్లు.. అనంతరం ఓటర్ల జాబితా ప్రకటన వంటివి ఉన్నాయి. ఆ తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికంతటికీ దాదాపు 75 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈలోగా పనులు వేగంగా పూర్తి చేయడంతో పాటు నగరంలో మౌలిక సదుపాయాల నూ మెరుగుపరచాలని యత్నిస్తున్నారు. లేదంటే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లలేమని అధికార పార్టీ పెద్దలు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు సంక్షేమ, ఆకర్షక పథకాల్లో భాగంగా విద్యుత్ బిల్లు నెలకు రూ.150, నల్లాచార్జీలు నెలకు రూ.150 వంతున మాత్రమే వసూలు చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. వాటితో పాటు ఇంటింటికీ నాలుగేసి ఎల్ఈడీ బల్బులను ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 80 లక్షల దీపాలకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేయనుంది. నియోజకవర్గానికి 5వేల వంతున గ్రేటర్‌లోని మహిళలకు 1.40 లక్షల దీపం (గ్యాస్) కనెక్షన్లు అందజేయనున్నారు. నవంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రకటించారు. మురికివాడలు, తక్కువ విస్తీర్ణంలోని ఇళ్ల వారికి ఆస్తిపన్ను కేవలం రూ.101 మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించారు. ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలోనే ప్రారంభించనున్నారు. కూకట్పల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో వీటి నిర్మాణానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు. పాతబస్తీలోని మరో ఎనిమిది బస్తీల్లోనూ త్వరలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు.సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు బ్యాంకు లింకేజీలతో రుణ పంపిణీని ముమ్మరం చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ.100 కోట్లు మంజూరు కాగా... వీలైన ంత పెద్ద మొత్తాల్లో రుణాల పంపిణీకి వేగం పెంచారు.వెయ్యి జిమ్‌లు, మరో వెయ్యి ఈ-లైబ్రరీల ఏర్పాటు దిశగా కసరత్తు ఊపందుకుంది. సంక్షేవు, అభివృద్ధి పథకాల అవులుకు జీహెచ్ఎంసీ అధికారులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ల (ఆర్డబ్ల్యూఏ)తో సవూవేశాలు నిర్వహిస్తూ... వారి భాగస్వావ్యూన్ని పెంచుతున్నారు. ఇంటింటికీ చెత్త సేకరణకు రెండు రంగుల డబ్బాలు, చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించేందుకు నిరుద్యోగులకు బ్యాంకు రుణాలతో (అర్హులకు సబ్సిడీలతో) 2వేల ఆటోటిప్పర్లు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ రెండు మూడు రోజుల్లో ప్రారంభించనున్నారు. పీపుల్స్‌ప్లాజాలో ఈ కార్యక్రమ నిర్వహణకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ గురువారం స్థలాన్ని పరిశీలించి వచ్చారు. డ్రైవర్ కమ్ ఓనర్ ద్వారా మలిదశ కార్ల పంపిణీకి కూడా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నగరంలోని వీలైనన్ని మార్గాల్లో రహదారులను యుద్ధ ప్రాతిపదికన రీకార్పెటింగ్‌కు సిద్ధమయ్యారు. బీటీ, వైట్‌టాపింగ్ రోడ్లకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. వెయ్యి కిలోమీటర్ల బీటీ రోడ్లు, 400 కి.మీ.ల వైట్‌టాపింగ్ రోడ్లకు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నారు. రహదారులను శుభ్రపరిచేందుకు 18 భారీ స్వీపింగ్ యంత్రాలు సమకూర్చుకుంటున్నారు. స్లమ్స్, పాతబస్తీలోని ఇరుకుమార్గాల్లో బ్యాటరీతో నడిచే చిన్నసైజు ఆటోట్రాలీలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. మల్టీపర్పస్ హాళ్లు, మోడల్ మార్కెట్లు, పార్కుల అృవద్ధి, చెరువుల సుందరీకరణ, శ్మశానవాటికల అృవద్ధికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. వీటి అంచనా దాదాపు రూ.1000 కోట్లు. స్వచ్ఛ హైదరాబాద్‌లో అందిన విజ్ఞప్తుల మేరకు ఇంకా మూడువేల పనులు త్వరగా పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌లోగా వీలైనన్ని ఎక్కువ పనులు చేయాలని భావిస్తున్నారు.