న్యూఢిల్లీ: భౌగోళిక ప్రాదేశిక సమాచార నియంత్రణ బిల్లు-2016 నిబంధనలను సమీక్షించేందుకు సిద్ధమని సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. బిల్లులో భారత పటాన్ని తప్పుగా చిత్రీకరించే వారికి 7 ఏళ్ల జైలుశిక్ష, రూ. 100 కోట్ల జరిమానా ప్రతిపాదించారు. ముసాయిదాపై అభిప్రాయాల కోసం బిల్లును ప్రజలకు అందుబాటులో ఉంచారు. నెల రోజుల్లో వచ్చే సలహాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని హోం శాఖ తెలిపింది. బిల్లు నిబంధనలు కఠినంగా ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.