
న్యూఢిల్లీ: ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ముసాయిదా విధాన పత్రాన్ని రూపొందించింది. ‘ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ సెంట్రల్ (అమెండ్‌మెంట్) మోడల్ రూల్స్, 2019’ ముసాయిదాపై అభిప్రాయాలను, సూచనలను ఇవ్వాల్సిందిగా వ్యక్తులు, సంస్థలను కోరుతూ హోం శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 90 లక్షల మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు అంచనా. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు లైసెన్స్‌లిచ్చేందుకు ఇప్పటికే హోం శాఖ ఒక పోర్టల్‌ను ప్రారంభించింది.
లైసెన్సుల జారీకి ఆయా ఏజెన్సీల డైరెక్టర్లు, భాగస్వామ్యులు, యజమానుల వివరాలను వ్యక్తిగతంగా పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం లేదని కూడా గతంలో హోంశాఖ ప్రకటించింది. ముసాయిదా నిబంధనలను mha.gov.in/sites/default/files/private SecurityAgenies&06112019.pdf నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆ ప్రకటనలో హోంశాఖ పేర్కొంది. అభిప్రాయాలు, సూచనలను us&pm@nic.inMకు డిసెంబర్ 6 లోపు పంపించాలని కోరింది.