తిరుమల: జీఎస్టీ చెల్లింపులకుగాను టీటీడీకి కేంద్రం నుంచి ప్రశంసాపత్రం లభించింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో టీటీడీ జీఎస్టీæ రిజిస్ట్రేషన్ చేసుకుంది. 2 రాష్ట్రాల్లో టీటీడీ జరిపిన లావాదేవీల జీఎస్టీ చెల్లింపులకుగాను ఈ ప్రశంస లభించింది. దేశంలో 1.3 కోట్ల సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ఇందులో 54,439 సంస్థలు జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్నాయి. దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా క్రమం తప్పకుండా పన్నులు చెల్లించిన వారిని సన్మానించాలని కేంద్రం నిర్ణయించింది. 2021 మార్చి 31వ తేదీ వరకు జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయడంలోనూ, పన్ను చెల్లింపులకుగాను టీటీడీకి కేంద్రం ప్రశంసాపత్రం అందించింది.
Comments
Please login to add a commentAdd a comment