న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాపరమైన అధికారాల్లో కేజ్రీవాల్ ప్రభుత్వం, కేంద్రానికి మధ్య తలెత్తిన వివాదాన్ని తమ రాజ్యాంగ బెంచ్ విచారించిన తర్వాతే సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం పిటిషన్లను విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఆధార్ కేసుల్ని రాజ్యాంగ బెంచ్ మాత్రమే విచారిస్తుందని సోమవారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం తుదిగడువును వచ్చే ఏడాది మార్చి 31వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment