
న్యూఢిల్లీ: ఎంక్వైరీ అండ్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్లను త్వరగా నియమించాలని కేంద్రప్రభుత్వాన్ని లోక్‌పాల్ కోరింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ పంపినట్లు ఆర్‌టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు లోక్‌పాల్ బదులిచ్చింది. ప్రభుత్వధికారుల అవినీతిపై ఫిర్యా దులను పరిశీలించడం, ప్రాసిక్యూషన్ ప్రక్రియ జరపడమనే రెండు ప్రధాన విధులను ఈ ఇరువురు డైరెక్టర్లు నిర్వహిస్తారు.
2019 మార్చిలో లోక్‌పాల్‌కు ఛైర్‌పర్సన్‌ను, సభ్యులను నియమించారు. అయితే ఎంక్వైరీ డైరక్టర్, ప్రాసిక్యూషన్ డైరెక్టర్‌ల నియామకం జరగలేదు. దీనిపై అజయ్ దూబే అనే యాక్టివిస్టు ఆర్‌టీఐ కింద లోక్‌పాల్‌ను ప్రశ్నించారు. లోక్‌పాల్ అండ్ లోకాయుక్త చట్టం కింద వీరివురి నియామకం జరపాల్సిఉందని, కేంద్రం పంపిన పేర్ల నుంచి ఇద్దరిని లోక్‌పాల్ చైర్‌పర్సన్ ఎంపిక చేయాల్సి ఉందని అజయ్ చెప్పారు.
చదవండి:
మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్
ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్.. మార్కెట్ విలువ రూ.126 కోట్లు