భోపాల్: ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ కులాల వారికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా అనే అంశాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ విషయంలో చీఫ్ జస్టిస్ రవి విజయ మలిమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో స్పందనను తెలియజేయాలని ఆదేశించింది.
అడ్వకేట్ యూనియన్ ఫర్ డెమొక్రసీ అండ్ సోషల్ జస్టిస్ సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇతర కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని కోర్టుకు తెలిపింది. పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టి వేయాలని పిటిషనర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment