
ఏపీ, తెలంగాణకు నోటీసులు
ఉచిత విద్య అమలుకావడంలేదన్న పిల్‌పై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఉచిత విద్య అందించాలని విద్యా హక్కు చట్టం చెబుతున్నా అమలు చేయడం లేదన్న కేసులో ఉభయ రాష్ట్రాలకూ హై కోర్టు నోటీసులు ఇచ్చింది.
ఉచిత విద్యను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అమలు చేయక పోవడంపై విశాఖపట్నం న్యాయ విద్యార్థి తాండ యోగేశ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగ నాథన్, జస్టిస్ టి.రజనీల ధర్మాసనం ప్రతివాదులైన ఏపీ, తెలంగాణ పాఠశాలల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశా లకు చెందిన మరో రెండు కేసులతో ఈ కేసును జత చేసి, అన్నింటినీ కలిపి విచారి స్తామని ధర్మాసనం తెలిపింది.