గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌.. ఏడాదికి రూ.20,000 | LIC Golden Jubilee Scholarship 2021: What is The Amount, Apply Online, Last Date | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌–2021

Published Fri, Dec 10 2021 4:56 PM | Last Updated on Fri, Dec 10 2021 4:56 PM

LIC Golden Jubilee Scholarship 2021: What is The Amount, Apply Online, Last Date - Sakshi

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) 2021 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందిస్తారు.

► అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మిం^è కుండా ఉండాలి. మెడిసిన్‌/ఇంజనీరింగ్‌/ఏదైనా గ్రాడ్యుయేషన్‌ /ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు/ఏదైనా విభాగంలో డిప్లొమా/తత్సమాన కోర్సులు/ఒకేషనల్‌ కోర్సు(ఐటీఐల్లో)ల్లో చేరాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందజేస్తారు.

► 2020–21 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మించకుండా ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల్లో/ఐటీఐల్లో ఒకేషనల్‌ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్‌ అందజేస్తారు.

► ప్రత్యేకంగా బాలికలకు ఉపకార వేతనాలు: బాలికల విద్యను ప్రోత్సహించడానికి వీటిని అందిస్తున్నారు. కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై.. ఇంటర్మీడియట్‌ చదువుతున్న బాలికలు దీనికి అర్హులు. 2020–21 విద్యా సంవత్సరంలో 60 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2లక్షలు మించకూడదు. 

► స్కాలర్‌షిప్‌ వ్యవధి: రెగ్యులర్‌ స్కాలర్స్‌కు సంబంధిత కోర్సు పూర్తయ్యే వరకు అందిస్తారు. బాలికలకు ప్రత్యేకంగా అందించే ఉపకార వేతనాలు రెండు సంవత్సరాలు అందిస్తారు.

► ఉపకార వేతనాల మొత్తం: రెగ్యులర్‌ స్కాలర్స్‌కు ఏడాదికి రూ.20,000లని మూడు వాయిదాల్లో అందిస్తారు.

► ప్రత్యేకంగా బాలికలకు ఏడాదికి రూ.10,000లని మూడు వాయిదాల్లో అందిస్తారు.

► ఎంపిక విధానం: 10/10+2లో సాధించిన మెరిట్‌ మార్కులు, తల్లిదండ్రుల కుటుంబ వార్షికాదాయం ఆధారంగా ఎంపిక చేస్తారు. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021

► వెబ్‌సైట్‌: licindia.in 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement