
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 కోటా కల్పిస్తూ చేసిన 103 రాజ్యాంగ సవరణ చట్టబద్దతపై దాఖలైన దాదాపు 40కిపైగా పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం పేర్కొంది.
50 శాతం జనరల్ కోటాలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సీనియర్ లాయర్లు రవి వర్మ కుమార్, పి. విల్సన్ సహా పలువురు లాయర్లు కోర్టులో వాదించారు. ఈడబ్ల్యూఎస్‌కు ఆర్థికపరిస్థితినే గీటురాయిగా తీసుకోకూడదని తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ లాయర్ శేఖర్ నఫరే వాదించారు. వీటిని అటార్నీ జనరల్ వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తోసిపుచ్చారు.