UU Lalit
-
‘పరిపూర్ణత్వానికి దగ్గరగా కొలీజియం’
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థ ప్రస్తుతం పరిపూర్ణత్వానికి(పర్ఫెక్ట్ మోడల్) దగ్గరగా ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో నియామకాలు, సంస్కరణలపై సీజేఏఆర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో జడ్జీల నియామకం కోసం పేర్లను ప్రతిపాదించడం వెనుక కఠినమైన ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కొలీజియంను కాపాడుకొనేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొలీజియంపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వర్గాల మధ్య వివాదం రగులుతున్న నేపథ్యంలో జస్టిస్ యు.యు.లలిత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
సకాలంలో సత్యాన్ని వెలికితీయాలి
సాక్షి, హైదరాబాద్: నేరాలు జరిగినప్పుడు సకాలంలో సత్యాన్ని వెలికితీయడం కత్తిమీద సాము లాంటిదని, దీనిలో ఫోరెన్సిక్ సైన్స్ ప్రధాన భూమిక పోషిస్తుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ అన్నారు. ట్రూత్ ల్యాబ్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ వినియోగంపై నల్సార్ యూనివర్సిటీ శనివారం ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. క్రిమినల్ కేసుల్లోనే కాదు, సివిల్ కేసుల్లోనూ ఫోరెన్సిక్ సైన్స్ సేవలు అందించాలని సూచించారు. పరిశోధనకు కొత్త మార్గాలను అనుసరించడంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీని ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని మరో మాజీ సీజేఐ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అభిప్రాయపడ్డారు. శాస్త్రీయంగా సాక్ష్యాన్ని సమర్థవంతంగా రూపొందించడంలో ఫోరెన్సిక్ పాత్ర కీలకమైనదని అన్నారు. ఆధారాలను వెలికితీయడంలో... న్యాయ రంగంలో ఫోరెన్సిక్ సైన్స్ సహకారం అవసరమని, తద్వారా క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే వీలు కలుగుతుందని తమిళనాడు మాజీ గవర్నర్ రాంమోహన్‌రావు అన్నారు. క్రిమినల్ కేసులు, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో ఆధారాలను వెలికితీసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ తోడ్పడుతుందని తెలంగాణ హైకోర్టు సీజే, నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్యానించారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ సూచించారు. రాంమోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్‌మిశ్రా, లా కమిషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీవీ రెడ్డి తదితరులు మాట్లాడారు. డీజీపీ అంజనీకుమార్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ భవానీ ప్రసాద్, జస్టిస్ రఘురామ్, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కృష్ణదేవరావు, డా.గాంధీ పీసీ కాజా, పలువురు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా
న్యూఢిల్లీ: ఇచ్చిన వాగ్దానాలను కొంత వరకు నెరవేర్చగలిగానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ చెప్పారు. ఎల్లవేళలా పనిచేసే ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, కేసుల జాబితాను క్రమబద్ధం చేసే వ్యవస్థను నెలకొల్పడం, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం వంటి విషయాల్లో తన వంతు కృషి చేశానని తెలిపారు. జస్టిస్ యు.యు.లలిత్ పదవీ కాలం మంగళవారం ముగియనుంది. ఆరోజు సెలవు దినం కాబట్టి సోమవారమే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పెండింగ్ కేసులపై దృష్టి పెట్టానని, వేలాది కేసులు పరిష్కరించానని వివరించారు. ఈ వీడ్కోలు సభకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. నా ప్రయాణం సంతృప్తికరం సుప్రీంకోర్టులో 37 ఏళ్ల వృత్తి జీవితంలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ప్రతి దశను ఆనందించానని జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. తన ప్రయాణం సంతృప్తికరంగా సాగిందన్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి, 16వ సీజేఐ జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ముందు న్యాయవాదిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఇదే కోర్టులో మొదలైన తన ప్రయాణం, ఇక్కడే ముగుస్తోందంటూ భావోద్వేగానికి గురయ్యారు. పలు రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయడం తనకు మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తులందరినీ రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యులుగా చేశానని తెలిపారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 74 రోజులు పదవిలో కొనసాగారు. -
ఒక్కరోజు ముందుగానే.. సీజేఐ వీడ్కోలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నే తృత్వంలోని ప్రధాన ధర్మాసనం జరిపే చివరి సారి విచారణ ప్రత్యక్ష ప్రసారం కానుంది. జస్టిస్ లలిత్ మంగళవారం పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవుదినం. ఈ నేపథ్యంలో జస్టిస్ లలిత్, కాబోయే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం సోమవారం జరిపే లాంఛన విచారణను తమ వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలని కోర్టు నిర్ణయించింది. రిటైరయ్యే సీజేఐ చివరి విచారణను తన వారసునితో కలిసి చేపట్టడం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించనుంది. ఆగస్టు 26న సీజేఐగా రిటైరైన జస్టిస్ ఎన్.వి.రమణ చివరి రోజు చేపట్టిన విచారణను తొలిసారిగా కోర్టు లైవ్ స్ట్రీమ్ చేసింది. ఇదీ చదవండి: హైకోర్టులు అలాంటి ఆదేశాలివ్వొద్దు! -
పెన్షన్ (సవరణ) పథకం సబబే
న్యూఢిల్లీ: ఉద్యోగుల పెన్షన్ (సవరణ) పథకం–2014 చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, పెన్షన్ నిధిలో చేరేందుకు రూ.15,000 నెలవారీ కనీస వేతనం పరిమితిని కొట్టేసింది. 2014 నాటి సవరణ ప్రకారం ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. సవరణకు ముందు ఇది రూ.6,500గా ఉండేది. ఈ పథకాన్ని కేరళ, రాజస్తాన్, ఢిల్లీ హైకోర్టులు గతంలోనే కొట్టేశాయి. వీటిని సవాలు చేస్తూ ఈపీఎఫ్ఓ, కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాంశూ ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పెన్షన్ పథకంలో చేరలేకపోయిన ఉద్యోగులు 6 నెలల్లోగా చేరొచ్చంది. రూ.15,000 వేతనం దాటినవారు 1.16 శాతాన్ని పెన్షన్ పథకంలో జమ చేయాలన్న నిబంధన చెల్లదని స్పష్టం చేసింది. -
ఆ సలహా నాకు గుర్తు రాలేదు.. అమరావతిపై విచారణకు తిరస్కరించిన సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి అంశంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యు.యు.లలిత్ తిరస్కరించారు. తాను సభ్యుడిగాలేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, మస్తాన్‌వలి, మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లు మంగళవారం సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందుకొచ్చాయి. రైతుల తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తూ.. గతంలో జస్టిస్ యు.యు.లలిత్ సీనియర్ న్యాయ వాదిగా ఉన్న సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అమరావతిపై న్యాయసలహా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సుందరం ఇచ్చిన సదరు కాపీని పరిశీలించిన సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ ఈ పిటిషన్లను తాను విచారించనని తెలిపారు. అమరావతిపై న్యాయసలహా ఇచ్చిన విషయం తనకు గుర్తుకురాలేదని, ఈ నేపథ్యంలో తాను ఈ పిటిషన్లపై విచారణ నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొన్నారు. తాను సభ్యుడిగాలేని ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణ తేదీ తెలపాలని రైతుల తరఫు న్యాయవాదులు కోరగా తాను విచారించని అంశంపై తేదీ నిర్ణయించడం సబబు కాదని, రిజిస్ట్రీ ఖరారు చేస్తుందని పేర్కొన్నారు. చదవండి: (సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ.. పిటిషన్లో కీలక అంశాలివే..) -
సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ.. పిటిషన్లో కీలక అంశాలివే..
న్యూఢిల్లీ: అమరావతి రాజధాని కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు. లలిత్ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన కీలక అంశాలివే.. ►రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదు ►రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. ►శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం ►తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం ►రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది ►ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు ►రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు ►రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి ►2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి ►అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం ►రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది ►రైతుల తో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు ►వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు ►రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం ►అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది , ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది -
ప్రత్యేక కోర్టులు అక్కర్లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటి ఆర్థిక నేరాల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక నేరాల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ‘ ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు కోర్టులున్నాయి. పోక్సో కోర్టులున్నాయి. ప్రతి ఒక్క అంశానికి విడిగా కోర్టులు ఏర్పాటుచేస్తూ పోతే కింది స్థాయి జ్యుడీషియల్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అందుకు ఒప్పకోం’ అంటూ పిల్‌ను తిరస్కరించింది. -
ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కోల్‌కతా: ‘‘దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అధికారాలన్నింటినీ క్రమంగా అధికార పార్టీ నేతృత్వంలోని ఒకే ఒక వర్గం చెరబడుతోంది. ఈ పెడ ధోరణి ఇలాగే కొనసాగితే దేశం అంతిమంగా అధ్యక్ష తరహా పాలనలోకి వెళ్లేందుకు ఎంతో కాలం పట్టదు’’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడేందుకు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఆదివారం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎన్‌యూజేఎస్) స్నాతకోత్సవంలో మమత పాల్గొన్నారు. వర్సిటీ చాన్సలర్ అయిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్‌తో సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దయచేసి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమాఖ్య వ్యవస్థను కాపాడండి’’ అంటూ సీజేఐని అభ్యర్థించారు. ఏ అంశంపై అయినా కోర్టుల్లో తీర్పు వెలువరించడానికి ముందే మీడియా సొంత తీర్పులు ఇచ్చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘వారు ఎవరినైనా నిందించొచ్చా? ఎవరి మీదైనా అభియోగాలు మోపొచ్చా? మా ప్రతిష్ట మాకు ప్రాణం. అది పోతే సర్వం పోయినట్టే. ఇలా మాట్లాడుతున్నందుకు మన్నించండి. తప్పయితే క్షమాపణలు చెబుతా. ప్రజలు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయారని నేననడం లేదు. కానీ కొద్ది రోజులుగా పరిస్థితులు బాగా దిగజారుతున్నాయి. ప్రజలు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. వారి ఆక్రందనను న్యాయ వ్యవస్థ ఆలకించాలి. ఈ అన్యాయం బారి నుంచి కాపాడాలి’’ అని సీజేఐని కోరారు. -
‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’.. సీజేఐకి దీదీ వినతి
కోల్‌కతా: ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే దేశం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐకి విజ్ఞప్తి చేశారు. కోల్‌కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్స్ కాన్వకేషన్ కార్యక్రమానికి సీజేఐ యూయూ లలిత్ హాజరైన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు మమత. ‘ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. వారు ఎవరినైనా దుర్భాషలాడగలరా? వారు ఎవరినైనా నిందించగలరా? సర్, మన గౌరవం దెబ్బతింటోంది. తీర్పు వెలువడేలోపే ఎన్నో జరిగిపోతున్నాయని చెప్పేందుకు చింతిస్తున్నాను. నేను చెప్పేది తప్పు అనుకుంటే, క్షమించండి.’అని పేర్కొన్నారు మమతా బెనర్జీ. ఎన్‌యూజేఎస్ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా అభివర్ణించారు దీదీ. ఈ సందర్భంగా సీజేఐ యూయూ లలిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: ‘తప్పుచేశా.. క్షమించండి’..గుడిలో చోరీ చేసిన సొత్తు తిరిగిచ్చిన దొంగ -
కొత్త సీజేఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: నూతన సీజేఐగా జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్‌ను నియమిస్తూ సంబంధిత ఉత్తర్వుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ సిఫార్సు తర్వాత సంబంధించి ప్రతిని కేంద్ర న్యాయశాఖ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపగా ఆమె ఆమోదించారని ఆ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేస్తారని రిజిజు ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి రెండు సంవత్సరాలపాటు అంటే 2024 నవంబర్ పదో తేదీ దాకా ఆయన సీజేఐగా కొనసాగుతారు. కొత్త సీజేగా నియామకపత్రాన్ని ప్రధాని ప్రధాన సలహాదారు పీకే మిశ్రా, న్యాయశాఖ ఉన్నతాధికారులు స్వయంగా జస్టిస్ చంద్రచూడ్‌కు అందజేశారు. ప్రస్తుత సీజేఐ లలిత్ కేవలం 74 రోజులే ఆ బాధ్యతల్లో కొనసాగి రిటైర్‌కానున్నారు. ఇదీ చదవండి: Facebook Live: పోనీయ్.. 300 కి.మీ.లు దాటాలి -
భారత 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను మంగళవారం సమావేశపరిచి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పేరును ప్రకటించారు సీజేఐ జస్టిస్ యుయు లలిత్. సిఫారసు లేఖను జడ్జీల సమక్షంలో జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు అందించారు. తర్వాత ఆ సిఫారసు లేఖ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు.దీంతో 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐ పదవిలో కొనసాగినట్లవుతుంది. సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత సీనియర్ న్యాయమూర్తిని వారసుడిగా పేర్కొంటారు. ప్రస్తుతం ఉన్న వారిలో జస్టిస్ యుయు లలిత్ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నందున ఆయన పేరును ప్రతిపాదించారు. ఇదీ చదవండి: టీఎంసీకి షాక్.. స్కూల్ జాబ్ స్కాం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్ -
కొలీజియంలో విభేదాలు!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త జడ్జీల నియామకప్రక్రియలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య సర్వామోదం సన్నగిల్లింది. నూతన జడ్జీల ఎంపికకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ చేపట్టిన ‘సర్కులేషన్’ పద్ధతిపై కొలీజియంలోని ఇద్దరు జడ్జీలు భిన్న స్వరం వినిపించడం తెలిసిందే. ఆ ఇద్దరి పేర్లను తొలిసారిగా బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. 11 మంది నూతన జడ్జీల నియామకం కోసం సెప్టెంబర్ 26న సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల కొలీజియం భేటీ జరిగింది. జస్టిస్ చంద్రచూడ్ హాజరుకాలేదు. 10 మంది జడ్జీల నియామక ప్రక్రియ కోసం నలుగురు జడ్జీలకు సీజేఐ లేఖలు రాశారు. తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ జస్టిస్ కిషన్ అక్టోబర్ ఒకటిన, జస్టిస్ జోసెఫ్ అక్టోబర్ ఏడున సీజేఐకు ప్రతిలేఖలు రాశారు. లేఖలు రాసే పద్ధతిపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అభిప్రాయం తెలపాలని అక్టోబర్ రెండున మరోసారి కోరినా స్పందించలేదు. సాధారణంగా కొలీజియంలో వ్యక్తమయ్యే బేధాభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపిన జడ్జీల పేర్లను వెల్లడించరు. కానీ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ పేర్లను బయటపెడుతూ కొలీజియం ప్రకటన విడుదలచేసింది. ఇక నవంబరు 9న కొత్త సీజేఐ వచ్చాకే కొలీజియం సమావేశం కానుంది. జస్టిస్ దీపాంకర్ గుప్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం విదితమే. -
సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. తండ్రి తీర్పులనే తిరగరాశారు
సాక్షి, న్యూఢిల్లీ: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ఆయన పేరును సిఫార్సు చేస్తూ సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ మంగళవారం ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర న్యాయ శాఖకు ప్రతిపాదన పంపారు. న్యాయ శాఖ దాన్ని ప్రధాని పరిశీలనకు పంపనుంది. ప్రధాని, తర్వాత రాష్ట్రపతి ఆమోదం అనంతరం జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా నియమితులవుతారు. జస్టిస్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. 9న జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా ప్రమాణం చేస్తారు. 2024 నవంబర్ 10 దాకా రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా చేయడం విశేషం! ఆయన 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు అత్యధిక కాలం సీజేఐగా పని చేశారు. తండ్రీకొడుకులిద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ చంద్రచూడ్ న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చారు. 1959 నవంబర్ 11న జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ప్రభ దంపతులకు మహారాష్ట్రలో జన్మించారు. ముంబైలోని కేథడ్రల్, జాన్‌కానన్‌లో పాఠశాల విద్య, 1979లో ఢిల్లీలో ఆర్థిక, గణిత శాస్త్రాల్లో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీలో న్యాయ పట్టా పొందారు. 1983లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొందారు. 1986లో హార్వర్డ్‌లో డాక్టరేట్ ఆఫ్ జ్యూరిడికల్ సైన్స్ చదివారు. బాంబే హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1998లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందడంతోపాటు సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2000లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఇద్దరు కుమారులు అభినవ్, చింతన్ కూడా లాయర్లే. భిన్నాభిప్రాయాల వెల్లడికి వెనకాడరు విచారణ సమయంలో తన అభిప్రాయాలు వెల్లడించడానికి వెనకాడని న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్‌కు పేరుంది. మానవహక్కులు, లింగ సమానత్వం, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, క్రిమినల్, రాజ్యాంగ చట్టాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, వికలాంగుల హక్కులు, ఆధార్, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, గోప్యత హక్కు, అయోధ్య భూ వివాదంపై కీలక తీర్పులిచ్చారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిచ్చి సంచలనం సృష్టించారు. రుతుక్రమం కారణంగా ఆలయంలోకి రానివ్వకపోవడం మహిళల ప్రాథమిక హక్కులకు భంగకరమని తీర్పు చెప్పారు. వివాహితులైన ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడం చట్ట విరుద్ధం కాదంటూ వివాహేతర సంబంధాలపైనా సంచలన తీర్పు వెలువరించారు. కరోనా సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను గుర్తుచేస్తూ ప్రభుత్వ వైద్య సాయం నిరాకరించకూడదని పేర్కొన్నారు. అవివాహితలకు కూడా 24 వారాల దాకా అబార్షన్ చేయించుకునే హక్కు కల్పిస్తూ తాజాగా తీర్పు ఇచ్చారు. తండ్రి తీర్పులనే తిరగరాశారు కిస్సా కుర్చీకా అనే సినిమాకు సంబంధించిన కేసులో నాడు జస్టిస్ వైవీ చంద్రచూడ్ కాంగ్రెస్ నేత సంజయ్‌గాంధీని జైలుకు పంపారు! అయితే వ్యభిచారం, గోప్యత హక్కులకు సంబంధించి ఆయన ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ తోసిపుచ్చడం విశేషం! 1976లో ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో అత్యవసర సమయాల్లో పౌరులకు ప్రాథమిక హక్కులుండవంటూ జస్టిస్ వైవీ చంద్రచూడ్ తీర్పు ఇచ్చారు. దాన్ని 2016లో జస్టిస్ చంద్రచూడ్ కొట్టేశారు. చదవండి: (కాంగ్రెస్‌లో దేనికి పట్టం?, పనితనమా? విధేయతా?) -
పీడీ.. వ్యక్తిగత స్వేచ్ఛపై దండయాత్రే: సుప్రీం
న్యూఢిల్లీ: ముందస్తు నిర్బంధం(పీడీ) అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై తీవ్రమైన దండయాత్రేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి చర్యలు చేపట్టే విషయంలో రాజ్యాంగం, చట్టాలు కల్పించిన రక్షణలు, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021 నవంబర్ 12న త్రిపుర ప్రభుత్వం జారీ చేసిన పీడీ ఉత్తర్వును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్దీవాలాల ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. పీఐటీఎన్‌డీపీఎస్ చట్టం–1988 కింద అరెస్టు చేసిన నిందితుడిని వెంటనే విడుదల చేయాలని çఆదేశించింది. పీడీ చట్టం కింద అరెస్టు చేస్తే నిందితులు ఏడాదిపాటు జైల్లోనే ఉండాల్సి వస్తోందని, దీనివల్ల వారికి తమపై నమోదైన కేసుల్లో నిరపరాధినని నిరూపించుకొనే అవకాశం లేకుండా పోతోందంది. ప్రచారం కోసం ఇక్కడికి రావొద్దు కేవలం ప్రచారం కోసం న్యాయస్థానానికి రావొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల)ను ఎన్నికల సంఘం (ఈసీ) కాకుండా కొన్ని కంపెనీలు నియంత్రిస్తున్నాయంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన జన్ వికాస్ పార్టీ వేసిన పిటిషన్‌పై Ôజస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘దేశంలో దశాబ్దాలుగా ఈవీఎంలు వాడకంలో ఉన్నాయి. కానీ, ఎప్పటికప్పుడు సమస్యలు లేవనెత్తేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటిదే ఇది. ఓటర్ల ఆదరణ పెద్దగా పొందలేని ఓ రాజకీయ పార్టీ ఇటువంటి పిటిషన్ల ద్వారా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది’అని ధర్మాసనం పేర్కొంది. నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు గ్రూప్–సి ఉద్యోగుల సంక్షేమ సంఘంలో రూ.50 వేలు జమ చేయాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 కోటా కల్పిస్తూ చేసిన 103 రాజ్యాంగ సవరణ చట్టబద్దతపై దాఖలైన దాదాపు 40కిపైగా పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. 50 శాతం జనరల్ కోటాలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సీనియర్ లాయర్లు రవి వర్మ కుమార్, పి. విల్సన్ సహా పలువురు లాయర్లు కోర్టులో వాదించారు. ఈడబ్ల్యూఎస్‌కు ఆర్థికపరిస్థితినే గీటురాయిగా తీసుకోకూడదని తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ లాయర్ శేఖర్ నఫరే వాదించారు. వీటిని అటార్నీ జనరల్ వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తోసిపుచ్చారు. -
సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా
సాక్షి, న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని కొలీజియం సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీజేఐ సహా 29 మంది న్యాయమూర్తులున్నారు. గరిష్ట సంఖ్య 34. కోల్‌కతాకు చెందిన జస్టిస్ దత్తా 1965లో జన్మించారు. 1989లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. పలు హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా చేశారు. రాజ్యాంగపరమైన, సివిల్ కేసులు వాదించడంలో దిట్టగాపేరొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదిగా పనిచేశారు. 2006లో కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2020 ఏప్రిల్ 28న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తండ్రి జస్టిస్ సలీల్ కుమార్ దత్తా కూడా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. -
సుప్రీంకోర్టులో మొదలైన ప్రత్యక్ష ప్రసారాలు.. విచారణలు ఇలా చూడండి
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. మంగళవారం తమ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించింది. సుప్రీంకోర్టులోని మూడు వేర్వేరు రాజ్యాంగ ధర్మాసన కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. వీటిని యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో సొంత వేదిక ద్వారా విచారణలు ప్రసారం చేయనున్నట్లు సీజేఐ యూయూ లలిత్ తెలిపారు. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసన విచారణను మాత్రమే ప్రసారం చేస్తున్నారు. తర్వాత మిగతా అన్నింటిని లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కోర్టులో జరిగే వాదనలకు, లైవ్ స్ట్రీమింగ్కు 30 సెకన్లు వ్యవధి తేడా ఉండనుంది. కాగా మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజు ఆగస్టు 26న తొలిసారి ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే నాలుగేళ్ల క్రితం 2018 సెప్టెంబర్ 27సుప్రీంకోర్టు కేసుల వాదనలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని అప్పటి సీజేఐ దీపక్ మిశ్రా నిర్ణయం తీసుకున్నారు. అయినా ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. చివరికి సెప్టెంబర్ 27 నుంచి అన్ని రాజ్యాంగ ధర్మాసన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ యూయూ లలిత్ ఈనెల 20న నిర్ణయించారు. మొదటి స్ట్రీమింగ్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ అధ్యక్షతన ఇడబ్ల్యూఎస్ కోటా కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసు 103వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైందిద. మరో విచారణలో మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే Vs ఏక్నాథ్ షిండే వర్గం మధ్య విబేధాలకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక జస్టిస్ ఎస్కే కౌల్ అధ్యక్షతన జరిగే మూడో విచారణలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ చెల్లుబాటుకు సంబంధించిన అంశంపై వాదనలు కొనసాగుతున్నాయి. చదవండి: జపాన్ ప్రధానికి మోదీ ఘన నివాళులు -
‘ఓపెన్’లో ఖాళీలు తగ్గవా?
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వోద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బుధవారం పలు ప్రశ్నలు సంధించింది. ఈ కోటా వల్ల ఓపెన్ కేటగిరీలో అందుబాటులో ఉండే సీట్లు, ఖాళీలు 40 శాతానికి తగ్గిపోతాయన్న వాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావించింది. ఓపెన్ కేటగిరీలోని 50 శాతం ఖాళీలను తగ్గించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను గుర్తు చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లోని పేదలను కులం ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి నహాయించడం వాస్తవమేనా? ఈ కోటా వల్ల ఓబీసీల్లోని క్రీమీ లేయర్‌కు అందుబాటులో ఉండే ఖాళీలు కూడా 40 శాతానికి తగ్గుతాయన్నది నిజమేనా? మెరిట్ ఉన్న వారందరికీ ఓపెన్ కేటగిరీలో పోటీపడేందుకు అవకాశం ఉండాలి కదా’’ అంటూ ప్రశ్నించింది. ఓపెన్ కేటగిరీ ఖాళీలకు ఏ విధంగానూ కోత పడని రీతిలోనే ఈడబ్ల్యూఎస్ కోటాను రూపొందించినట్టు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ఓపెన్, రిజర్వుడు కేటగిరీలు ప్రత్యేకమైన విభాగాలు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 శాతం రిజర్వుడు కేటగిరీలో తగిన ప్రాతినిధ్యం దక్కిందని వేణుగోపాల్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఈడబ్ల్యూఎస్ వర్గానికి కూడా ఎన్నికల్లో కొన్ని స్థానాలు రిజర్వు చేయగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ గురువారం కూడా కొనసాగనుంది. ఇక ప్రత్యక్ష ప్రసారాలు సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై ప్రత్యక్షప్రసారం కానుంది. తొలుత రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు 27వ తేదీ నుంచి ప్రసారం కానున్నాయి. ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా ప్రసారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తుందని కోర్టు వర్గాలు తెలిపాయి. గుజరాత్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, పట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టులు ఇప్పటికే తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. -
ఇంటర్నెట్ నిలిపివేతకు ప్రొటోకాల్ ఉందా: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో ఇష్టారాజ్యంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడానికి ఏదైనా ప్రొటోకాల్ ఉందా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్లో తరచుగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేస్తున్నారని ఆరోపిస్తూ సాఫ్ట్వేర్ లా సెంటర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు నోటీసు జారీ చేసింది. సాఫ్ట్వేర్ లా సెంటర్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని ఆదేశించింది. ప్రొటోకాల్ ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని పేర్కొంది. నాలుగు రాష్ట్రాలకు నోటీసు ఇవ్వడం లేదని తెలిపింది. -
పరిష్కార ప్రయత్నం
రెండున్నర నెలలు... అంతా కలిపితే 74 రోజులు. ఈ పరిమిత కాలంలో ఏ వ్యవస్థలోనైనా పెనుమార్పులు తీసుకురావడం సాధ్యమేనా? ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా, భారత సర్వోన్నత న్యాయాధిపతి (సీజేఐ)గా కొత్తగా నియుక్తులైన జస్టిస్ యు.యు. లలిత్ మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. న్యాయవ్యవస్థలో సమూల సంస్కరణలకు సిద్ధమవుతున్నారు. భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం నుంచి పని ప్రారంభించిన లలిత్ కొన్నేళ్ళుగా సుప్రీమ్ కోర్ట్‌లో అశ్రద్ధకు గురైన వ్యవహారాలపై దృష్టి సారించారు. కోర్ట్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా పాలనాపరమైన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని వార్తాకథనాల మాట. ఏడాది పొడుగూతా రాజ్యాంగ కేసుల్ని వినేందుకు ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాలను పునరుద్ధరించాలనీ, అలాగే కోర్ట్ సమయాన్ని వృథా చేసే ‘పనికిమాలిన’ దావాలపై చర్యలు చేపట్టాలనీ లలిత్ భావన. ఆ ఆలోచన మంచిదంటూనే, ఆచరణలో కష్టనష్టాలపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతానికైతే, ఆగస్ట్ 29 నుంచి ప్రతిరోజూ వాదోపవాదాలు వినేందుకు గాను పాతిక రాజ్యాంగ ధర్మాసన అంశాలను లిస్ట్ చేస్తున్నట్టు సీజేఐ ప్రకటించారు. ఈ ప్రకటన కీలకమైనది. కేవలం తన దాకా వచ్చిన అప్పీలుపై తీర్పు చెప్పడమే కాదు, రాజ్యాంగ అంశాలను కూలంకషంగా పరిశీలించి, వాటికి వ్యాఖ్యానం చెప్పడం సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన బాధ్యత. అనేక ఇతర పెండింగ్ అంశాల పనిలో పడిపోయి, కొంతకాలంగా అది విస్మరణకు గురైంది. 1960లలో సగటున ఏటా 134 రాజ్యాంగ ధర్మాసన తీర్పులు వెలువడితే, ఆ సంఖ్య నిరుడు 2కు పడిపోయింది. దీన్ని గుర్తించిన నూతన ప్రధాన న్యాయమూర్తి ఈ బాధ్యతను భుజానికెత్తుకోవడం హర్షణీయం. అపరిష్కృత కేసుల సమస్య దేశాన్ని చాలాకాలంగా పీడిస్తోంది. కరోనా దెబ్బతో ఈ సమస్య ద్విగుణం, బహుళం అయింది. 2017 నాటికి సుప్రీమ్‌లో 55 వేల పైచిలుకు కేసులు పెండింగ్. ఇప్పుడు వాటి సంఖ్య 71 వేలు దాటేసింది. ఇవన్నీ రాజ్యాంగేతర అంశాలకు సంబంధించినవే. న్యాయ సంస్కరణల్లో భాగంగా ఈ సమస్యను ఓ కొలిక్కి తేవడం ప్రధానం. తగినంత మంది న్యాయమూర్తులు లేరనడానికి వీల్లేదు. 2019 ఆగస్ట్ నాటికే సుప్రీమ్ జడ్జీల సంఖ్య 34కు పెరిగింది. ఎప్పటికప్పుడు జడ్జీల సంఖ్య పెరుగుతున్నా, 1950 నుంచి పెండింగ్ కేసులూ పెరుగుతూ పోతుండడం విడ్డూరం. దీనికి పరిష్కారంగా జోన్ల వారీగా కోర్ట్‌ను విభజించి, పదిహేనేసి మంది జడ్జీలతో 4 ప్రాంతీయ బెంచ్‌లు ఏర్పాటు చేసి, సుప్రీమ్ కోర్ట్కూ – హైకోర్ట్లకూ మధ్య అప్పిలేట్ కోర్ట్‌గా సదరు బెంచ్‌లు పనిచేయాలని ఒక ప్రతిపాదన. దీనివల్ల రాజ్యాంగ అంశాలపై దృష్టి పెట్టడానికి న్యాయమూర్తులకు మరింత సమయం దొరుకుతుందని వాదన. కానీ, ఈ జోనల్ కోర్ట్‌ల ఏర్పాటు రాజ్యాంగకర్తల ఆలోచనకు విరుద్ధమంటూ 1974లోనే 58వ న్యాయ సంఘం కొట్టిపారేసింది. ప్రస్తుతం సుప్రీమ్ ఎదుట 492 రాజ్యాంగ ధర్మాసన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో దాదాపు 53 కేసులు ప్రభావశీల రాజ్యాంగ అంశాలకు సంబంధించినవి. పౌరసత్వ సవరణ చట్టం, ముస్లిమ్ వివాహ చట్టాల రాజ్యాంగబద్ధత, ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలకు విస్తృత ధర్మాస నాలు అవసరమైనవి. ఇవన్నీ కోర్ట్ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నాయి. ఇలాంటి 53 కేసుల్లో ప్రస్తుతం 25 కేసులను వినే ప్రక్రియకు కొత్త సీజేఐ శ్రీకారం చుట్టారు. 1960లలో ఏటా సగటున వందకు పైగా రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటయ్యేవి. 2000 నాటికి వచ్చేసరికి వాటి సంఖ్య దాదాపు 10కి పడిపోయింది. సాధారణంగా అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలను చూస్తుంటాం. కొన్నిసార్లు ఏడుగురు, తొమ్మిదిమంది జడ్జీలతోనూ ధర్మాసనాలు ఏర్పాటవుతుంటాయి. సుప్రీమ్ కోర్ట్ పని ఒత్తిడిని పరిమాణాత్మకంగా విశ్లేషించి చూస్తే, కోర్టు సమయంలో 85 శాతం దేశం నలుమూలల నుంచి వస్తున్న అప్పీళ్ళను వినడానికే సరిపోతోంది. ప్రస్తుతం 31 మందే ఉన్న నేపథ్యంలో ఈ కార్యభారం మధ్య విస్తృత రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటు కొంత కష్టమని ఓ వాదన. అవసరానికి తగ్గట్టు జడ్జీల నియామకాలు పెంచుకోవడం దీనికి పరిష్కారం. ఇక శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు వల్ల కీలక అంశాలపై సత్వర నిర్ణయం సాధ్యం. కానీ, అదొక్కటే అన్ని సమస్యల్నీ పరిష్కరించలేదని గుర్తించాలి. ‘శాశ్వత’మనే ఆలోచన కొత్తదేమీ కాదు. 2019 సెప్టెంబర్‌లోనే అప్పటి ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రకటన చేసినా, ఆచరణలోకి రాలేదు. అయితే, కార్యనిర్వాహక వ్యవస్థతో పారదర్శక చర్చలతోనే శాశ్వత ధర్మాసనం సాధ్యం. ఇప్పుడు సమగ్ర న్యాయ సంస్కరణలు అవసరం. అవి ఎంత సమగ్రంగా ఉంటే, అంత సమర్థ పరిష్కారం లభిస్తుంది. ఆధునిక సాంకేతికతనూ, కృత్రిమ మేధ లాంటివీ వాడుకుంటే న్యాయ వ్యవస్థ పనితీరు మరింత మెరుగవుతుంది. పెండింగ్ కేసుల పరిష్కారం సుకరమవుతుంది. అనేక దేశాలు చాలాకాలంగా వర్చ్యువల్ సాంకేతికతతో సత్వర న్యాయం అందిస్తున్నాయి. కరోనా వేళ వర్చ్యువల్ దోవ పట్టిన మన కోర్టులు ఇకపైనా దాన్ని విస్తృతంగా అనుసరించాలి. కోర్టుల ఆధునికీ కరణ, డిజిటలీకరణకు ప్రాధాన్యమివ్వాలి. అదే సమయంలో ధర్మాసనాలు నిర్ణీత కేసుల్లో కీలక రాజ్యాంగ అంశాలపై స్పష్టతనిస్తే, దిగువ కోర్టులకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. అప్పీళ్ళ ప్రవాహా నికి అడ్డుకట్ట పడుతుంది. ఇక, కేసుల లిస్టింగ్‌లోనూ మరింత పారదర్శకత తెస్తానంటున్న లలిత్ మాటలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. -
యు.యు.లలిత్ అనే నేను..
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. రిజిస్టర్లో సంతకం చేసిన అనంతరం జస్టిస్ లలిత్‌కు రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రమాణం చేసిన తర్వాత జస్టిస్ లలిత్ తన తండ్రి, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉమేశ్ రంగనాథ్ లలిత్(90)తోపాటు కుటుంబ పెద్దల పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం పొందారు. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తి జస్టిస్ లలిత్. 1964లో జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ బార్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ లలిత్ పదవీ విరమణ అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యే అవకాశముంది. 100 రోజుల్లోపే పదవిలో ఉండే ఆరో సీజేఐ దేశంలో ఇప్పటిదాకా 100 రోజుల్లోపే పదవిలో ఉన్న ఆరో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ రికార్డుకెక్కనున్నారు. ఆయన ఈ ఏడాది నవంబర్ 8న పదవీ విరమణ చేస్తారు. అంటే కేవలం 74 రోజులపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తారు. ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ 18 రోజులు, జస్టిస్ రాజేంద్రబాబు 30 రోజులు, జస్టిస్ జె.సి.షా 36 రోజులు, జస్టిస్ జి.బి.పట్నాయక్ 41 రోజులు, జస్టిస్ ఎల్.ఎం.శర్మ 86 రోజులపాటు పదవిలో కొనసాగారు. -
49వ సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణం
-
సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ యుయు లలిత్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిస్ యు.యు. లలిత్‌తో శనివారం ఉదయం ప్రమాణం చేయించారు. కాగా.. యు.యు. లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. Delhi | Justice Uday Umesh Lalit takes oath as The Chief Justice of India at Rashtrapati Bhavan in the presence of President Droupadi Murmu pic.twitter.com/dxPMsS4IYE — ANI (@ANI) August 27, 2022 #WATCH | President Droupadi Murmu administers the oath of Office of the Chief Justice of India to Justice Uday Umesh Lalit at Rashtrapati Bhavan pic.twitter.com/HqayMJDwBB — ANI (@ANI) August 27, 2022 -
అధికారికం: సుప్రీం కోర్టు సీజేగా యూయూ లలిత్
న్యూఢిల్లీ: భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియామకం ఖరారు అయ్యింది. ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 26తో ముగియనుంది. ఆయన స్థానంలో జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. భారత దేశ 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ యూయూ లలిత్.. ఆగస్టు 27న బాధ్యతలు తీసుకోనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. అయితే.. జస్టిస్ యూయూ లలిత్ కేవలం 74 రోజులు మాత్రమే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎందుకంటే.. ఆయన నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ యూయూ లలిత్ 1957, నవబర్ 9న జన్మించారు. 1983లో లీగల్ కెరీర్‌ను ప్రారంభించారు. 1985 డిసెంబర్ వరకు ముంబై హైకోర్టులో పని చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. 2004, ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. సుప్రీం కోర్టు జడ్జీగా నియమితులయ్యే వరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక న్యాయవాదిగా పని చేశారు. 2014, ఆగస్టు 13న సుప్రీ కోర్టు జడ్జీగా నియమితులయ్యారు. ఇదీ చదవండి: పిల్లలు 7 గంటలకే స్కూల్‌కు వెళ్తుంటే... మేం తొమ్మిదింటికి కోర్టుకు రాలేమా?