
న్యూఢిల్లీ: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను మంగళవారం సమావేశపరిచి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పేరును ప్రకటించారు సీజేఐ జస్టిస్ యుయు లలిత్. సిఫారసు లేఖను జడ్జీల సమక్షంలో జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు అందించారు. తర్వాత ఆ సిఫారసు లేఖ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.
ప్రస్తుత సీజేఐ జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు.దీంతో 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐ పదవిలో కొనసాగినట్లవుతుంది. సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత సీనియర్ న్యాయమూర్తిని వారసుడిగా పేర్కొంటారు. ప్రస్తుతం ఉన్న వారిలో జస్టిస్ యుయు లలిత్ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నందున ఆయన పేరును ప్రతిపాదించారు.
ఇదీ చదవండి: టీఎంసీకి షాక్.. స్కూల్ జాబ్ స్కాం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment