పట్నా: దేశంలో రిజర్వేషన్లపైనున్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% కోటాను సమర్థించడంపై నితీశ్ హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ అనుకూలమేనని ప్రకటించారు.
‘సుప్రీం కోర్టు తీర్పు చాలా న్యాయంగా ఉంది. రిజర్వేషన్లకు మేము ఎప్పుడూ అనుకూలమే. అయితే రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయడానికి ఇదే సరైన సమయం. ఈ పరిమితి వల్ల ఓబీసీ, ఈబీసీలకు వారి జనాభాకి అనుగుణంగా అవకాశాలు రావడం లేదు’ అని అన్నారు. దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా గణన చేపట్టాలని ఆయన పునరుద్ఘాటించారు. కుల గణన జాతీయ స్థాయిలో జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా!
Comments
Please login to add a commentAdd a comment