![Retired Justice Shankar Narayana Appointed As AP BC Commission Chairman - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2019/09/11/AP-GOVT_0.jpg.webp?itok=T6_JrFt8)
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ శంకరనారాయణ నిమమితులయ్యారు. జస్టిస్ శంకరనారాయణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సామాజికంగా వెనుకబడిన బీసీలకు న్యాయం చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ బిల్లుకు బడ్జెట్ సమావేశాల సమయంలో ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.
Comments
Please login to add a commentAdd a comment