సాక్షి,హైదరాబాద్: వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం(జులై 26) సెక్రటేరియట్‌లో పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నిర్వహించడంపై అధికారులతో చర్చించారు.
ఆగస్టు తొలివారంలోగా కొత్త ఓటరు లిస్టు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా పూర్తయిన తర్వాత గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌ను సీఎం కోరారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వి.కృష్ణ మోహన్, సీఎస్ శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment