Panchayat elecitons
-
జనవరిలో నోటిఫికేషన్.. ఫిబ్రవరిలో తెలంగాణ పంచాయితీ ఎన్నికలు!?
హైదరాబాద్, సాక్షి: మరో నెలన్నర రోజుల్లో.. స్థానిక సంస్థల సమరంతో తెలంగాణ వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా.. ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేతతో పాటు రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై వేగం పెంచినట్లు సమాచారం.మొత్తం మూడు ఫేజ్‌లలో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. జనవరి 14వ తేదీన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే ప్రకటించింది. అలాగే.. శాసనసభ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించింది. -
పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం(జులై 26) సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నిర్వహించడంపై అధికారులతో చర్చించారు. ఆగస్టు తొలివారంలోగా కొత్త ఓటరు లిస్టు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా పూర్తయిన తర్వాత గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌ను సీఎం కోరారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వి.కృష్ణ మోహన్, సీఎస్ శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం
సాక్షి, గుంటూరు: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ బోల్తా పడింది. ఎన్నికలు జరిగిన జిల్లాల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 34 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. నెల్లూరు: మనుబోలు మండలం,బండేపల్లి మూడో వార్డులో ఒక్క ఓటుతో వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థి ఆవుల పొలమ్మ విజయం. చేజర్ల మండలం పాతపాడు లో రీకౌంటింగ్ లోను సమాన ఓట్లు రావడంతో లాటరీ నిర్వహించిన అధికారులు. లాటరీలో వైసీపీ అభ్యర్థి షేక్.మస్తాన్ బి విజయం ఏలూరు: దెందులూరు మండలం,కొవ్వలి గ్రామంలో జరిగిన 11వ వార్డు ఎన్నికలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మొండి శ్రీను 288 ఓట్ల మెజారిటీతో విజయం. పెదపాడు మండలం, పాత ముప్పర్రు గ్రామంలో జరిగిన 10వ వార్డు ఎన్నికలలో వైఎస్సార్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గొట్టపు సోమేశ్వరి 26 ఓట్ల మెజారిటీతో విజయం. జీలుగుమిల్లి గ్రామంలో 6వ వార్డు ఉప ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన మడకం ధనరాజు 42ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ► పెదపాడు మండలం వీరమ్మ కుంట గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు. మరడాని వెంకట లక్ష్మణ సోమేశ్వరరావు 286 ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మరడన నాగబాబును ఓడించారు. ►వణుదుర్రు సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు గెలుపు పశ్చిమగోదావరి: పాలకొల్లు మండలం గోరింటాడా గ్రామపంచాయతీ ఆరో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి పీతల యమున దుర్గ చంద్రకళ 15 ఓట్ల మెజారిటీతో గెలుపు. పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో ఆరో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి అంగర రామలక్ష్మి 10 ఓట్ల మెజారిటీతో గెలుపు. వీరవాసరం మండలం మత్యపురి గ్రామం ఒకటో వార్డు లో వైఎస్సార్సీపీ బలపరిచిన కారేంపల్లి విజయలక్ష్మి 167 ఓట్ల మెజారిటీతో గెలుపు. కృష్ణా: బంటుమిల్లి 4 వ వార్డుకి వైఎస్సార్సీపీ బలపర్చిన గొల్ల సృజన విజయం ఎన్టీఆర్: తిరువూరు మండలం ఎర్రమాడు ఉప ఎన్నికలో ఏడో వార్డు అభ్యర్థిగా YSRCP బలపరిచిన చలివేంద్ర హరిబాబు విజయం. తూర్పు గోదావరి: రాజానగరం మండలం పల్ల కడియం గ్రామంలో జరిగిన వార్డు సభ్యుల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన పెండ్యాల అరుణ సమీప అభ్యర్థి చేవా ప్రమీలపై విజయం సాధించారు. రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో జరిగిన వార్డు సభ్యుల ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన తాతపూడి సత్యవతి విజయం సాధించారు. అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గం లో వైఎస్సార్ సీపీ హవా. టీడీపీ కి జేసీ బ్రదర్స్ కు ఎదురుదెబ్బ. జేసీ సొంత మండలం పెద్దపప్పూరు లో టీడీపీకి చేదు అనుభవం తాడిపత్రి నియోజకవర్గం లో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం ► దేవునుప్పలపాడు పంచాయతీ లో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య సర్పంచ్ గా ఎన్నిక ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి మెజారిటీ స్థానాలు చలివెందుల, దేవునుప్పలపాడు పంచాయతీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం 33 వార్డుల్లో వైఎస్సార్ సీపీ విజయం 21 వార్డుల్లో టీడీపీ మద్దతుదారుల గెలుపు తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, పెనుకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో సత్తా చాటిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులు శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురం లో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ ► హిందూపురం మండలం చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారు ఉపేంద్ర రెడ్డి 337 ఓట్లతో విజయం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకర్గంలో కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఆధిపత్యం ► శాంతిపురం మండలం కడపల్లి పంచాయితీ 10 వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు దారుడు సుధాకర్ ప్రత్యర్థి ప్రకాష్ పై 47 ఓట్లుమెజారిటీతో గెలుపు అనకాపల్లి జిల్లా: నక్కపల్లి మండలంలో రేబాక చిన దొడ్డిగల్లులలో రెండు వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం శ్రీకాకుళం జిల్లా: ►టెక్కలి మండలం నరసింగపల్లి పంచాయతీ జగన్నాధపురం ఏడో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి పావని 124 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 219 ఓట్లు గాను 156 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీ బలపరిచిన అభ్యర్థి పావనికు 124 ఓట్లు రాగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి సింగపురం మోహిని కు 28 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ►నరసన్నపేట మండలం కొమర్థి లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి. లబ్బ రాజారావు 24 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థికి 50 ఓట్లు రాగా వైసీపీ బలపరచిన అభ్యర్థికి 74 ఓట్లు వచ్చాయి. ►సారవకోట మండలం బద్రి సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థి మజ్జి అసిరమ్మ గెలుపు సాధించారు. ►నందిగాం మండలం అన్నపురం పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్ధి బార్నాన ఇంద్రవేణి 89 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 775 ఓట్లకు 633 ఓట్లు పాలయ్యాయి. ఇందులో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్ధి ఇంద్రవేణికు 353, టీడీపీ బలపర్చిన అభ్యర్ధి బర్నాన తిరుపతిరావు కు 264 ఓట్లు వచ్చాయి ►బూర్జ మండలం పెదలంకాం సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి కాకితాపల్లి గోవిందరావు గెలుపు సాధించారు. -
AP: ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్
-
6 పంచాయతీలు ఏకగ్రీవం
అనంతపురం: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ రోజైన గురువారం ఆయా పంచాయతీలకు నామినేషన్లు వేసిన వారిలో పలువురు ఉపసంహరించుకోగా.. ఆరు పంచాయతీల్లో మాత్రం ఒక్కో నామినేషనే మిగిలింది. దీంతో కదిరి మండలం ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్‌గా శుభలేఖ, గాండ్లపెంట మండలం జీపీ తండా సర్పంచ్‌గా భూక్యా రవీంద్రనాయక్, నల్లమాడ మండలం కొండకింద తండా సర్పంచ్‌గా డుంగావత్ పార్వతి, బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా సర్పంచ్‌గా విజయకుమారిబాయి, కొత్తచెరువు మండలం లింగారెడ్డిపల్లి సర్పంచ్‌గా హరిత, పుట్టపర్తి మండలం చెర్లోపల్లి సర్పంచ్‌గా లీలావతి ఏకగ్రీవమయ్యారు. అలాగే తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తున్న పలు పంచాయతీల్లోని వార్డు స్థానాలు కూడా ఏకగ్రీమయ్యాయి. ఆయా పంచాయతీల్లోని వారంతా కలసికట్టుగా గ్రామాల అభివృద్ధికి తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రజాప్రతినిధులు స్వాగతించారు. కాగా తొలివిడతలో కదిరి డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో 169 పంచాయతీలు, 1,714 వార్డు స్థానాలకు ఈనెల 9న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ గురువారం ముగియడంతో బరిలో నిలిచే అభ్యర్థులను పంచాయతీల వారీగా అధికారులు ధ్రువీకరించారు. సర్పంచ్ బరిలో 462 మంది తొలి విడతలో 163 పంచాయతీలకు ఎన్నికలు జరVýæనుండగా 462 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా పంచాయతీల్లోని మొత్తం 1,714 వార్డులుండగా..715 వార్డులు ఏకగ్రీవమయ్యారు. తక్కిన 987 వార్డులకు 2,030 మంది బరిలో నిలిచారు. గుర్తులు కూడా కేటాయించడంతో చాలా మంది గురువారమే ప్రచారం చేయడం కనిపించింది. కాగా కదిరి డివిజన్ పరిధిలోని పంచాయతీలకు శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల నిర్వహణ సామగ్రిని తరలించనున్నారు. కదిరి నియోజకవర్గంలో రెండు కదిరి అర్బన్/గాండ్లపెంట: తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న కదిరిలో నామినేషన్ల ఉపసంహరణ రోజు రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కదిరి మండలంలోని ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్‌గా బరిలో నిలిచిన వలంటీర్ నారిక శుభలేఖ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీ సర్పంచ్ స్థానానికి శుభలేఖతో పాటు మానస, గౌతమి, నారాయణమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే గురువారం మిగతా ముగ్గురూ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో నారిక శుభలేఖ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇక గాండ్లపెంట మండలం తుమ్మలబైలు తండా సర్పంచ్ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయగా, గురువారం ముగ్గురు ఉపసంహరించుకోవడంతో బి.రవీంద్రనాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటరి్నంగ్ అధికారి లక్ష్మీప్రియ ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన శుభలేఖ, బి.రవీంద్రనాయక్లను ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి అభినందించారు. పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నాలుగు పుట్టపర్తి: నియోజకవర్గంలో నాలుగు పంచాయతీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నల్లమాడ మండలం కొండకింద తండా సర్పంచ్‌గా పార్వతీ, బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా సర్పంచ్‌గా విజయకుమారిబాయి, కొత్తచెరువు మండలం లింగారెడ్డిపల్లి సర్పంచ్‌గా పాటిల్ హరిత, పుట్టపర్తి మండలం చెర్లోపల్లి సర్పంచ్‌గా లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందరినీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అభినందించారు. విజయకుమారిని వరించిన అదృష్టం బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా సర్పంచ్ స్థానానికి ఇద్దరు నామినేషన్ వేయగా.. గురువారం ఓ అభ్యరి్థని నామినేషన్ ఉపసంహరించుకోగా.. విజయకుమారిబాయి ఏకగ్రీవమయ్యారు. పుట్టపర్తి మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలుకాగా, సరస్వతి గురువారం నామినేషన్ ఉపసంహరించుకోగా.. లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. -
ఏకగ్రీవాలకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి : జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగ్రీవాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసేందుకే ప్రోత్సాహకం ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. గతేడాదే ఏకగ్రీవాలకు ప్రభుత్వం నజరానా ప్రకటించగా.. తాజాగా 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షల ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. 2వేల నుంచి 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే 10వేలకు పైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు పేర్కొంది. చదవండి: ‘ఎస్ఈసీ అలా ఎందుకు చెప్పలేదు..? -
ఏపీ స్థానిక ఎన్నికలకు హైకోర్టు అనుమతి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు అందజేసింది. మార్చి 3లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎన్నికల సంఘం కార్యదర్శి పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను జనవరి 17 నుంచి ఫిబ్రవరి 15 మధ్యలో పూర్తి చేస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరి 8 నుంచి మార్చి 3 మధ్యలో నిర్వహిస్తామని వెల్లడించారు. జనవరి 10న ఎన్నికల సన్నాహాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని.. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులతో సమావేశం అవుతామన్నారు. జనవరి 13న రాజకీయ పార్టీలతో భేటీ కానున్నట్టు తెలిపారు. అఫిడవిట్‌ను పరిశీలించిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు అనుమతి ఇచ్చింది. (చదవండి: జెడ్పీ రిజర్వేషన్లు.. 6 స్థానాలు మహిళలకే) ఈసీ అఫిడవిట్‌లోని అంశాలు.. జనవరి 17న ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 15లోగా ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి ఫిబ్రవరి 8న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి జనవరి 10న ఉన్నతాధికారులతో ఈసీ సమావేశం జనవరి 13న రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ -
ఇక రిజర్వేషన్ల కుస్తీ..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పల్లె పోరుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాం గం అంతా బిజీ బిజీగా ఉంది. ఓటర్ల జాబితా మొదలుకొని కులగణన ప్రకియ వరకు వివిధ దశల్లో నిర్వహించాల్సి న కార్యక్రమాలను పూర్తి చేసింది. ఇక రిజర్వేషన్ల ప్రక్రియపై కుస్తీ ప్రారంభించింది. గురువారం దీనిపై ప్రకటన విడుదలజేయనుంది. మరో వైపు అధికారులు పోలింగ్ స్టేషన్ల ఎంపిక ప్రకియపై దృష్టి సారించారు. అన్ని వసతులున్న కేంద్రాలను ఎంపిక చేయాలని కలెక్టర్ నుంచి అధికారులకు అదేశాలు అందడంతో గుర్తింపు ప్రకియ ప్రారంభమైంది. జిల్లాలోని 940 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పంచాయతీల్లో 8910 వార్డులున్నాయి. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అధికారులు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని షెడ్యూల్ ప్రకటించారు. ఈ మేరకు రెండు నెలల కిత్రం జరిగిన సార్వత్రిక ఎన్నికలఓటర్ల జాబితా ప్రామాణికంగా గ్రామ పంచాయతీని ఒక యూనిట్‌గా తీసుకొని ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. నిబంధనల మేరకు గ్రామ పంచాయతీలు, రద్దీ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచి అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని 940 గ్రామ పంచాయతీల్లో 16,45,439 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మే 20 వరకు గ్రామంలో నివసిస్తున్న ఓటర్ల ఆధారంగా తుది జాబితాను ప్రకటించారు. ఆత్మకూరు, కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట డివిజన్ల వారీగా ఉన్న పంచాయతీల్లోని వార్డుల్లో గల ఓటర్ల జాబితాలను ప్రకటించారు. ఈ ప్రకియ ముగిశాక కులగణనపై కసరత్తును నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని పంచాయతీల్లో ఇంటింటికీ తిరిగి కులగణన ప్రకియను చేపట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల గుర్తింపే కీలకంగా దీన్ని నిర్వహించారు. ఈ నెల మొదటి వారం వరకు దీన్ని నిర్వహించి తుది జాబితాతో ఈ నెల 11 నుంచి 17 వరకు ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో జిల్లాలో కులగణనపై కొన్ని చోట్ల నిర్వహించిన గ్రామసభల్లో అభ్యంతరాలు రావడంతో మళ్లీ కసరత్తు చేశారు. అందిన డ్రాఫ్ట్ కాపీలు ఇందులో భాగంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి డ్రాఫ్ట్ కాపీలు మంగళవారం అందాయి. బుధవారం పూర్తిస్థాయి పరిశీలన అనంతరం కులగణన అధారంగా పంచాయతీల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. గురువారం గ్రామాల వారీగా రిజర్వేషన్ల జాబితాను ప్రకటించనున్నారు. దీనికి అనుగుణంగా ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రకియపైనా అధికార గణం దృష్టి సారించింది. ప్రాథమికంగా ఒక్కో వార్డులో ఒక్కో బూత్ చొప్పున 8910 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గ్రీన్ సిగ్నల్ వస్తే మూడు దశల్లో ఎన్నికలు కులగణన పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే ఎన్నికల సంఘం రంగంలోకి దిగుతుంది. దీనికి అనుగుణంగా మండలం లేదా రెవెన్యూ డివిజన్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని సిద్ధం చేసే అవకాశం ఉంది. జిల్లా పంచాయతీ అధికారులు జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ఇలా జరిగేందుకు అవకాశం.. మొదటగా కావలి, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లలోని 19 మండలాల్లో గల 360 పంచాయతీల పరిధిలో 3406 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో గల 234 గ్రామ పంచాయతీల పరిధిలోని 2346 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో గూడూరు, నాయుడుపేట డివిజన్లలోని 15 మండలాల్లో 346 గ్రామ పంచాయతీల్లో 3158 వార్డుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. -
ఇక పురసమరం!
మండపేట: సార్వత్రిక ఎన్నికల వేడి చల్లారక ముందే స్థానిక సమరానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న ఈసీ తాజాగా మున్సిపల్ పోరుకు కూడా రంగం సిద్ధం చేస్తోంది. జూలై రెండో తేదీతో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని పాలక వర్గాల పదవీ కాలం ముగుస్తోంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 11న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాల కోసం మే 23 వరకూ వేచి చూడాల్సి ఉంది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది ఆగస్టు ఒకటో తేదీతో పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. అప్పటినుంచీ పంచాయతీలన్నీ ప్రత్యేక పాలనలో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జూన్‌లో వీటికి ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మే 10వ తేదీన పంచాయతీల్లో ఓటర్ల తుది జాబితాలు ప్రచురించాలని ఇప్పటికే ఈసీ ఆదేశాలిచ్చింది. మరోపక్క నగర, పుర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పాలక వర్గాల పదవీ కాలం జూలై రెండో తేదీతో ముగుస్తుండటంతో పురపోరు తెరపైకి వచ్చింది. దీంతో నూతన పాలక వర్గాల ఎన్నికకు కూడా ఈసీ సన్నాహాలు చేపట్టింది. జిల్లాలోని కాకినాడ మినహా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని మున్సిపాల్టీలు, ఏలేశ్వరం, ముమ్మిడివరం, గొల్లప్రోలు నగర పంచాయతీలకు 2014 మార్చి 30న ఎన్నికలు జరిగాయి. 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే చివరిలో ఫలితాలు వెలువడ్డాయి. జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అనంతరం జూలై 3న స్థానిక సంస్థల కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. జూలై 2వ తేదీతో ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆయా నగరాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి, మే ఒకటో తేదీన ప్రచురించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. గడువు తక్కువగా ఉండటంతో అసెంబ్లీ ఓటర్ల జాబితాల ప్రకారం, వార్డుల వారీగా జాబితాలు సిద్ధం చేసే పనిలో మున్సిపల్ అధికారులు తలమునకలై ఉన్నారు. ఇందుకోసం ఇంటి నంబర్, వార్డు నంబర్, పోలింగ్ కేంద్రం తదితర వివరాలు సేకరిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ జాబితాలో ఉన్న ఓటర్లు ప్రస్తుతం ఏ వార్డులో ఉన్నారో చూసి, ఆ మేరకు కొత్త జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. -
పంచాయతీ పోరుకు కసరత్తు
సాక్షి, అరసవల్లి (శ్రీకాకుళం): ఓ వైపు సార్వత్రిక ఎన్నికల వే‘ఢీ’ కొనసాగుతుంటే..మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు మరో కీలక అడుగు వేశారు. గ్రామ స్థాయిలో ప్రధానమైన ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్నారు. గ్రామస్థాయిలో వార్డుల వారీగా, కేటగిరీల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శనకు సిద్ధం చేయాలంటూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేయడంతో.. త్వరలోనే పంచాయతీల పోరు షురూ అన్న సంకేతాలు పంపినట్లయ్యింది. జిల్లాలోని 1095 గ్రామ పంచాయతీల్లోనూ పాలక వర్గాల గడువు తీరిపోవడంతో గత ఏడాది ఆగస్టు 2 నుంచి ‘ప్రత్యేక’ అధికారుల పాలన కొనసాగుతున్న సంగతి విదితమే. వాస్తవానికి గత ఏడాదే స్థానిక ఎన్నికలకు సిద్ధపడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, తీవ్ర ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు వెనుకడుగు వేసింది. అప్పటి నుంచి ప్రత్యేక పాలనలోనే పల్లెలున్నాయి. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్‌కుమార్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు మరికొద్ది నెలల్లోనే పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు సిగ్నల్ ఇచ్చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు పంపారు. గతేడాది జూన్‌లో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు మేరకు అప్పట్లో కూడా పంచాయతీలకు ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడిందనే చర్చ జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పాలన గడువు కూడా పూర్తికానుండడంతో, సార్వత్రిక ఎన్నికలు జరిగిన వెంటనే ‘స్థానిక’ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేద్దామనే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల అధికారులున్నట్లు సమాచారం. ఈమేరకు తొలి అడుగుగా వచ్చే నెల 10న అన్ని పంచాయతీల్లోనూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో 21 లక్షల 75 వేల మంది ఓటర్లు.. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ప్రామాణికంగా తీసుకుని జిల్లాలో అన్ని పంచాయతీల్లోనూ ఓటర్లను ఖరారు చేయాల్సి ఉంది. తాజా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 1095 పంచాయతీల నుంచి 21,75,176 మంది ఓటర్లతో జాబితా సిద్దమైంది. ఇందులో పురుషులు 10,88,410, మహిళలు 10,86,493 మందిగా నమోదయ్యారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. 2013లో జిల్లాలో మొత్తం 1100 పంచాయితీలకు గాను 1099 పంచాయతీలకు, 10,542 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో శ్రీకాకుళం మున్సిపాల్టీలో నగరానికి శివారు పంచాయతీలను విలీనం చేసే క్రమంలో పెద్దపాడు పంచాయతీ ఆమోదం తెలియజేయడంతో పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. దీంతో ఇప్పటికీ అక్కడ ప్రత్యేకాధికారి పాలనే కొనసాగుతోంది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే జిల్లాలో మొత్తం 5 పంచాయతీలు పూర్తిగా వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పూర్తిగా తొలిగింపునకు గురయ్యాయి. హిరమండలం పరిధిలోని చిన్న కొల్లివలస, పెద్ద సంకిలి, శిలగాం, దుగ్గిపురం, తులగాం పంచాయతీలతో పాటు వంగర మండలంలోని దేవకివాడ గ్రామ పంచాయతీ కూడా వంశధార ప్రాజెక్టు కారణంగా మెర్జింగ్ అయ్యింది. గార్లపాడులో మూడు అనుబంధ గ్రామాలు (హేమ్లెట్స్), పాడలి పంచాయతీలో రెండు అనుబంధ గ్రామాలు వంశధార పరిధిలో తొలిగిపోయినప్పటికీ, ఈ రెండు పంచాయతీలు మాత్రం రికార్డుల్లో కొనసాగుతున్నాయి. వంశధార ప్రాజెక్టు భూసేకరణ కారణంగా మొత్తం 5 పంచాయతీలు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇకపై జిల్లాలో 1095 పంచాయతీలుగా రికార్డుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ పంచాయతీల్లోనే ఈసారి ఎన్నికలు జరుగనున్నాయని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. గ్రామ సర్పంచులతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఇవే ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలను నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. గతంలో మాదిరిగా ఈసారి కూడా వార్డుకో పోలింగ్ స్టేషన్ ఉండేలా ఎన్నికల అధికారులు నిర్ణయించారు. చట్ట ప్రకారం 50 శాతం పంచాయతీలు, వార్డులను మహిళలకు, జనాభా దామాషా ప్రకారం రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. చర్యలు చేపడతాం జిల్లాలో మొత్తం 1095 పంచాయతీల్లో వార్డుల వారీగా కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారుల ఉత్తర్వుల ప్రకారం వచ్చే నెల 10న ఓటర్ల జాబితాను ఆయా పంచాయతీ గ్రామాల్లోనే ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఎన్నికల అధికారుల సర్క్యులర్ ప్రకారం తదుపరి చర్యలు చేపడతాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తాం. – బి.కోటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం -
కొత్త బాధ్యతలు
నారాయణఖేడ్: గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం కొత్తగా మరో 30 విధులను అప్పగించింది. గతంలో వీరు 64 బాధ్యతలను నిర్వహించేవారు. దీనికి తోడు అదనంగా మరికొన్ని బాధ్యతలను ప్రభుత్వం వీరిపై పెట్టింది. జిల్లాలో 26 మండలాల్లో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కార్యదర్శి గ్రామంలో పాలనా బాధ్యతలను చూసుకోవడంతోపాటు సర్పంచ్‌కు సబార్డినేట్‌గా వ్యవహరించాలని సూచించింది. పంచాయతీలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, నిర్వహణ, తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీలు, మొక్కలు నాటడం, పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేయాలని కోరింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 42, సెక్షన్ 286 ప్రకారం, సెక్షన్ 43 ప్రకారం అప్పగించిన అన్ని బాధ్యతలు, విధులు నిర్వర్తించాలని తెలిపింది. సెక్షన్ 6 (8) ప్రకారం పంచాయతీ ఎజెండా రూపకల్పన బాధ్యత కార్యదర్శిదేనని పేర్కొంది. గ్రామ పాలకవర్గం ఆమోదంతో వీటిని అమలు చేయాలని సూచించింది. 24 గంటల్లో అనుమతులు.. భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతి ఇవ్వాలని సూచించింది. అంతే కాకుండా లేఅవుట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 7 రోజుల్లో అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. లేఅవుట్ల అనుమతిలో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతీ లేఅవుట్లో 15శాతం భూభాగాన్ని తనఖా చేయాలని కోరింది. గ్రామంలో తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు గ్రామస్తులకు సమాచారం అందించాలని సూచించింది. జనన, మరణాలతోపాటు వివాహ రిజిస్ట్రేషన్ల నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఇవీ మార్గదర్శకాలు.. పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి సబార్డినేట్‌గా వ్యవహరించాలి. గ్రామసభకు ఎజెండా తయారు చేసి అందులోని అంశాలు సభ్యులందరికీ తెలిసేలా ప్రచారం చేయాలి. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఖర్చుకు సంబంధించిన లెక్కలను పంచాయతీ ఆమోదానికి సమర్పించాలి. వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, రోడ్లు, రైలు ప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలి. గ్రామంలో వ్యాధులు ప్రబలినప్పుడు అధికారులకు తెలియపర్చాలి. గ్రామాల్లోని అవసరాలను గుర్తించి గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారీలో పాలుపంచుకోవాలి. అలాగే ఎంపీపీ, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ నిర్వహించే నెలవారీ సమావేశాలకు హాజరు కావాలి. గ్రామసభలో లబ్ధిదారుల గుర్తింపు, వారికి రుణ పంపిణీ, రుణాల వసూళ్లకు సహకరించాలి. అంశాల వారీగా ఎజెండాలను సిద్ధం చేసి గ్రామ పంచాయతీ ఆమోదం పొందడం. ఎజెండాను ప్రదర్శించడం, దండోరా వేయించడం, గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో నోటీసులను అంటించి ప్రజలకు సమాచారం చేరేలా చూడడం. బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వాడల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలు, పంచాయతీ ఫలాలు అందేలా చూడాలి. వార్షిక పరిపాలన నివేదికను రూపొందించి గ్రామ పంచాయతీ ఆమోదం తీసుకోవడం. నెలవారీ సమీక్షలు, ప్రగతి నివేదికల రూపకల్పన, ఉన్నతాధికారులకు నివేదికను అందించడం, సర్పంచ్‌తో కలిసి అభివృద్ధి పనులకు పర్యవేక్షణ. ప్రతీ మూడు నెలలకోసారి పంచాయతీ ఆర్థిక వ్యవహారాలను ఆదాయ, వ్యయ వివరాలను పంచాయతీ ఆమోదించడంతోపాటు ఈఓపీఆర్డీలకు సమాచారం ఇవ్వడం. -
పల్లెల్లో కొత్త పాలన
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో ‘స్థానిక’ సమరం ముగిసింది. గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు సిద్ధమయ్యాయి. ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టి పాలన కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ప్రభుత్వం కూడా అపాయింటెడ్ డేను ప్రకటించింది. నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలు శనివారం కొలువుదీరనున్నాయి. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. గతేడాది ఆగస్టులో పంచాయతీలకు నియమించబడిన ప్రత్యేక అధికారులు కొత్త సర్పంచులకు బాధ్యతలు అప్పగించనున్నారు. స్పెషలాఫీసర్లు లేని జీపీల్లో కార్యదర్శులు బాధ్యతలు అప్పగిస్తారని సంబంధిత అధికారులు పేర్కొం టున్నారు. అయితే కొత్త పాలకవర్గం కొలువుదీరన రోజే పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 223 పంచాయతీల్లో తొలి సారిగా పాలన ఆరంభం కానుంది. కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు.. జిల్లాలోని 465 గ్రామ పంచాయతీలకు గత నెలలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు ఉత్సాహంతో ఉన్నారు. వీరికి పంచాయతీ బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం అపాయింటెడ్ డేను ఫిబ్రవరి 2గా నిర్ణయించడంతో శనివారం రోజున పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అదే రోజు సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి నుంచి పదవీ కాలం ఐదేళ్ల పాటు కొనసాగనుంది. కాగా, కాల పరిమితి ముగియని, ఎన్నికలు జరగని పంచాయతీలకు విడిగా ప్రభుత్వం అపాయింటెడ్ డేను ప్రకటిస్తుందని పంచాయతీరాజ్ శాఖ నుంచి వెలువడిన నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా, ఆరు నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడంతో అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుతం పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరనున్నందున ఇక నుంచి అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉంది. రేపటి నుంచి కొత్త పంచాయతీల్లో పాలన జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 224 జీపీల్లో కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే బేల మండలంలోని కొబ్బాయి జీపీకి కాలపరిమితి ముగియనుందున ఎన్నికలు జరగలేదు. ఈ జీపీ నుంచి కొత్తగా మాంగ్రూడ్ పంచాయతీ ఏర్పాటైంది. అంటే ఒక్క మాంగ్రూడ్ జీపీ మినహా మిగతా 223 గ్రామ పంచాయతీలు కొత్తగా పాలనను ప్రారంభించనున్నాయి. గత సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత 2018 ఆగస్టు 2న పంచాయతీ బాధ్యతలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే. స్పెషలాఫీసర్లతో ప్రారంభమైన కొత్త పంచాయతీలు ఇప్పుడు పాలక వర్గాలతో కళకళలాడనున్నాయి. అయితే పాత జీపీల పరిధిలోని తండాలు, గూడేలను గుర్తించి ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. కొన్ని జీపీలకు భవనాలు, సరిపడా కుర్చీలు, టేబుళ్లు, ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం, కంప్యూటర్లు లేక ప్రత్యేకాధికారులు ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి. దీంతో కొత్త పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలకు పరిపాలన సవాలుగా మారనుందని చెప్పవచ్చు. కొత్త చట్టంపై సర్పంచులకు శిక్షణ గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఫిబ్రవరిలోనే పరిపాలన అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతోపాటు గ్రామస్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ శిక్షణ ఉంటుంది. ఈ నెల 1 నుంచి 10 వరకు రాష్ట్రస్థాయిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, కార్యదర్శులు శిక్షణ పొందునున్నారు. అనంతరం జిల్లాలో ఈ నెల 11 నుంచి మూడు విడతలుగా సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్తొతగా ఎన్నికైన 465 మంది సర్పంచులకు ఎక్కడెక్కడ శిక్షణ ఇవ్వాలి.. అనే దానిపై సమగ్ర ప్రణాళిక తయారీ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
ముగిసిన పంచాయతీ పోరు.. కారుదే జోరు..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. మొత్తం మూడు విడతల్లో పోలింగ్ జరగగా మూడింటిలోను టీఆర్ఎస్ తన ఆధిక్యతను ప్రదర్శించింది. మూడు విడతల్లో మొత్తం 12,761 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. తొలివిడతలో 4,470 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 769 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3,701 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక రెండో విడతలో 4,135 గ్రామాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా 788 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 3,342 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. మూడో విడతలో 4,116 గ్రామాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా 577 గ్రామాలు ఏకగ్రీవమై.. 3,506 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. మూడు విడతల్లోనూ కలిపి దాదాపు 6 వేల పైచిలుకు గ్రామాల్లో టీఆర్ఎస్ మద్దతు దారులు విజయం సాధించారు. -
ప్రారంభమైన తొలి పంచాయతీ ఎన్నికల పోలింగ్
-
పల్లె పోరు..జోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇటు పంచాయతీ ఎన్నికలు, అటు సంక్రాంతి సంబురాలు.. పల్లెల్లో కోలాహలం నెలకొంది. మొదటి, రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడం, మూడో విడతకు బుధవారం నోటిఫికేషన్ వెలువనుండడంతో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడత దేవరకొండ డివిజన్లోని 10 మండలాల్లో పంచాయతీలకు, రెండో విడత మిర్యాలగూడలోని 10 మండలాల పరిధిలోని పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడో విడత ఎన్నికలకు సంబంధించి నల్లగొండ డివిజన్లోని 11 మండలాల పరిధిలో ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ వెంటనేనామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. మొదటి విడత ఎన్నికలకు జోరందుకున్న ప్రచారం మొదటి విడత దేవరకొండ డివిజన్లో పది మండలాల్లో 304గ్రామ పంచాయతీలు, 2572వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 52 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారికంగా ఆదివారం ఆయా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అదే విధంగా 2572 వార్డుల్లో 518 వార్డుల్లో వార్డు సభ్యత్వానికి ఒక్కొక్క నామినేషనే దాఖలైంది. దీంతో వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అయితే మిగిలిన 252 గ్రామ పంచాయతీలతో పాటు మిగిలిన వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సంక్రాంతి పండుగ అయినప్పటికీ ఎక్కడ చూసినా ప్రచార జోరే కనిపించింది. అభ్యర్థులు ప్రతి ఇంటికీ తిరుగుతూ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. పండుగ వారి ప్రచారానికి బాగా కలిసొచ్చినట్లయ్యింది. అన్ని పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. సంక్రాంతి సెలవుల్లో ఇతర పట్టణాల్లో ఉద్యోగరీత్యా, ఇతర వ్యాపార, చదువు నిమిత్తం ఉండే వారు కూడా గ్రామాలకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో సందడి మరింత పెరిగింది. ఏ ఇంట్లో చూసినా జనాల సందడి, మరో పక్కప్రచార జోరు కొనసాగుతోంది. రెండో విడతలో ముగిసిన నామినేషన్ మిర్యాలగూడ డివిజన్లో 10 మండలాల పరిధి లోని పంచాయతీల్లో నామినేషన్ల ఘట్టం ముగిసిం ది. 276 సర్పంచ్‌లకు, 2376 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో నామినేషన్ల స్క్రూట్నీ కొనసాగుతుంది. అదే విధంగా అభ్యంతరాలు పరిష్కారం అనంతరం 17న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం సాగనుంది. అయితే మిర్యాలగూడ మండల పరిధిలో పంచాయతీలో నాలుగు పంచాయతీల్లో సర్పంచ్ కు ఒక్కో నామినేషన్ దాఖలు కాగా వేములపల్లి మండలంలోని మరో పంచాయతీలో ఒక నామినేషన్ దాఖలైంది. ఈ ఐదు పంచాయతీలు దాదాపు ఏకగ్రీవం అయినట్టే. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. 276 పంచాయతీలకు సంబంధించి సర్పంచ్‌కి 2,298 నామినేషన్లు రాగా, 2376 వార్డులకు 6,783 నామినేషన్లు దాఖలయ్యాయి. 17న ఉపసంహరణ కార్యక్రమం జరగనుంది. ఏకగ్రీవం చేసేందుకు ఆయా గ్రామాల్లో నాయకులు, నియోజకవర్గ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జిలే అత్యధికంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి బుజ్జగింపుల కార్యక్రమం పండుగైనప్పటికీ తమ అనుచరులను పంపి మొదలుపెట్టారు. నేతలకు ఓ పక్క పండుగ కావడంతో రెండు రోజులు ప్రచారం కలిసిరావడంతోపాటు మరో పక్క ఖర్చు కూడా తడిసి మోపెడయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నల్లగొండ డివిజన్లో ఎన్నికకు రేపు నోటిఫికేషన్ నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల పరిధిలో 257 గ్రామ పంచాయతీలకు 2,322 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి బుధవారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్పటినుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 20వ తేదీన అభ్యంతరాలు స్వీకరణ, 21వ తేదీన అప్పీళ్లను పరిష్కరిస్తారు. 22వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి అదే రోజు 3గంటల తర్వాత ఉపసంహరణ కార్యక్రమం చేపట్టనున్నారు. పోలింగ్ ఈనెల 30న జరగనుంది. నల్లగొండ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏకగ్రీవం చేసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయా గ్రామాలకు ఏకగ్రీవం చేసేందుకు ద్వితీయ శ్రేణి నేతలను పంపించి గ్రామాల్లో ఒకే అభ్యర్థి పోటీ చేసే విధంగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తమ మాట వినని వారిని ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సమక్షంలో పిలిపించి మాట్లాడుతున్నారు. ఒకవేళ అలా కూడా వినకపోతే బలమైన అభ్యర్థిని రంగంలో నిలబెట్టేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ నేతలు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఏకగ్రీవం చేయవద్దని పోటీలో నిలబడి ఎక్కువ శాతం కాంగ్రెస్ అభ్యర్థులే గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. -
వారిపై అనర్హత చెల్లదు..
సాక్షి, హైదరాబాద్: గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆ ఎన్నికల్లో చేసిన ఖర్చుకు సంబంధించిన లెక్కలను చెప్పకపోవడంతో, వారిని మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధిస్తూ ఎన్నికల సంఘం 2017లో జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఖర్చులు చెప్పని అభ్యర్థులు మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులంటూ ఎన్నికల సంఘం జారీ చేసి న ఉత్తర్వులను సవాల్ చేస్తూ సంగారెడ్డి, నిజా మాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇలా దాదాపు 100 పిటిషన్ల వరకు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు విచారణ జరి పా రు. ఈ సందర్భంగా పిటిషన ర్ల తరఫు న్యాయవాది జల్లి కనకయ్య వాదనలు వినిపిస్తూ, 2013 ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలను ఇవ్వని వారి విషయంలో 2017లో నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. ఇదే విషయా న్ని 2013లోనే లేవనెత్తి ఉంటే సమస్య ఉండేది కాదని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలో కి తీసుకున్న న్యాయమూర్తి, ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలి పేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. గిరిజన గ్రామా ల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై జోక్యానికి హైకోర్టు నిర్ణయించింది. ఈ వ్యవహారంపై సంక్రాంతి సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ఏర్పాటైన ఈ న్యాయస్థానం అంత అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ను ఈ నెల 30కి వాయిదా వేసింది. -
నేటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
-
పంచాయతీ సమరానికి .. చకచకా ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అసెంబ్లీ సమరం ముగియగానే జిల్లా అధికార యంత్రాంగం మరోమారు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో, ఆ మేరకు అధికారులు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా, ఎలాంటి సమస్య లేకుండా పంచాయతీ సమరాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మొత్తం పదకొండు విభాగాలుగా విధులను విభజించారు. ఒక్కో విభాగానికి ఒకరినుంచి ఐదుగురు దాకా నోడల్ అధికారులను నియమించారు. మొత్తంగా ఎన్నికల విధులకు సంబంధించి 11 విభాగాలకు 32 మందిని నోడల్ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పటికే నోడల్ అధికారులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. ఇక, క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శిక్షణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిలో స్టేజ్ –1, 2 అధికారుల శిక్షణ కూడా పూర్తయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏడుగురు నోడల్ అధికారులకు ‘మ్యాన్‌పవర్ మేనేజ్మెంటు’ బాధ్యతలు పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా ముగించేందుకు ఏడుగురు నోడల్ అధికారులకు ‘మ్యాన్‌పవర్ మేనేజ్మెంటు’ బాధ్యతలు అప్పజెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఎంత మంది సిబ్బంది అవసరమవుతారో గుర్తిం చడం, వారిని నియమించుకోవడం, స్టేజ్–1 ఆర్వోలు, స్టేజ్–2 ఆర్వోలు, అసిస్టెం ట్ ఆర్వోలు, ప్రిసైడింగ్ అధికారుల నియామకం, జోనల్ అధికారులు, రూట్ అధి కారుల నియామకం తదితర బాధ్యతలను మ్యాన్‌పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధి కారులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తారు. బ్యాలెట్ బాక్స్ మేనేజ్మెంట్ కోసం కూడా మరో నోడల్ అధికారిని నియమించారు. బ్యాలట్ బాక్స్ రిప్లేస్, ఇతరత్రా సరిచూసుకోవడం వంటి విధులను ఈ అధికారికి కేటాయించారు. ఇవి కాకుండా, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్కు ముగ్గురు, శిక్షణ కోసం ఐదుగురు, ఎన్నికల సామగ్రి నిర్వహణకు ఇద్దరిని, ఎన్నికల సంఘం నియమించే జనరల్ అబ్జర్వర్లు, ఖర్చుల పరిశీలకుల కోసం ముగ్గురు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, వాటిని మండలాలకు చేరవేయడం వంటి విధుల కోసం ఇద్దరు, మీడియా కమ్యునికేషన్ కోసం ఒకరిని, కంట్రోల్ రూమ్ (హెల్ప్ లైన్, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం) కోసం ఇద్దరు, ఓటర్ల జాబితా ముద్రణ వంటి విధుల నిర్వహణకు మరో ముగ్గురు నోడల్ అధికారులను, మొత్తంగా 32 మంది జిల్లా అధికారులకు నోడల్ అధికారుల బాధ్యతలను అప్పజెప్పారు. ఉపాధ్యాయులకే బాధ్యతలు క్షేత్ర స్థాయిలో పనిచేసే ఎన్నికల సిబ్బందిలో ఉపాధ్యాయులే అధికంగా ఉండనున్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లను ప్రిసైడింగ్ అధికారులుగా తీసుకుంటున్నారు. ప్రతి 200 ఓట్లున్న పంచాయతీకి ఒక పీఓ, ఇతర సిబ్బంది ఇద్దరు చొప్పున ముగ్గురికి, 500 ఓట్లున్న పంచాయతీలో నలుగురు చొప్పున ఎన్నికల సిబ్బందిని నియమిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 844 పంచాయతీలకు గాను ఈ సారి 837 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముగుస్తుందని, ఆ తర్వాత ఓట్లను లెక్కించి విజేతలను అదే రోజు ప్రకటిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఉప సర్పంచ్ ఎన్నిక పోలింగ్ రోజు కానీ, లేదంటే మరునాడు ఎన్నుకునే అవకాశం ఉందని అంటున్నారు. జనవరి 13వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాన్న ఆదేశాల మేరకు ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా తీసుకుంటోంది. దానికి తగినట్లే జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. -
ఫొటోలతో ఓటర్ల జాబితా
మోర్తాడ్(బాల్కొండ): త్వరలో నిర్వహించబోయే సహకార ఎన్నికల్లో బోగస్ ఓటర్లు లేకుండా చే యడానికి సహకార శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తోంది. ఈ ఎన్నికల నుంచి సరికొత్త విధానం సహకార శాఖ అమలు చేస్తోం ది. సహకార సంఘాల ద్వారా పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని వారి పేర్లు తొలగించి సక్రమంగా రుణాలు చెల్లించిన వారి పేర్లతో ఓటర్ల జాబితాను సహకార శాఖ ఉద్యోగులు సిద్ధం చేశారు. గతంలో కేవలం ఓటర్ల జాబితాల్లో ఓటు హక్కు పొందిన వారి పేర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఓటర్ల పేర్లతో పాటు వారి ఫొటోలను అతికించి జాబితాలను ఆయా సహకార సంఘాల పరిధిలో అందుబాటులో ఉంచారు. సహకార సంఘాలలోనే కాకుండా సహకార సంఘం పరిధిలోని గ్రామ పంచాయతీల్లోనే ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 142 సహకార సంఘాలు ఉండగా 1,056 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి సహకార సంఘం పరిధిలోని గ్రామాలలో ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలను వారం రోజుల నుంచి అందుబాటులో ఉంచారు. ఎవరైనా రుణ గ్రహీతలు బకాయి చెల్లిస్తే వారి పేర్లు చేర్చే అవకాశం ఉంది. అలా కొత్తగా చేర్చిన పేర్లతో ఈనెల 22న తుది జాబితాను ప్రదర్శించే అవకాశం ఉంది. ఏది ఏమైనా సహకార సంఘాల ఎన్నికల్లో బోగస్ ఓటర్లను తొలగించడానికి సహకార శాఖ తీసుకున్న పకడ్బందీ ఏర్పాట్లు సత్పలితాలను ఇస్తాయని చెప్పవచ్చు. -
జనవరి 10లోపు పంచాయతీ ఎన్నికలకు ఓకే
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు నడుచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. మూడు నెలల్లోపు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఈ ఏడాది అక్టోబర్ 11న తీర్పునిచ్చారని, ఈ మేరకు 2019 జనవరి 10లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన పోలీసు భద్రత, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించింది. ఎన్నికల సంఘాని (ఈసీ)కి పూర్తి సహాయసహకారాలు అందిస్తామంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వీటన్నింటినీ కూడా ఈసీకి తెలియజేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తీరును తప్పుపట్టిన సింగిల్ జడ్జి.. కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా, ప్రత్యేకాధికారులను నియమించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్పంచ్ల సంఘంతో పాటు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ ఏడాది అక్టోబర్ 11న తీర్పు వెలువరిస్తూ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారులను నియమించడాన్ని తప్పుపడుతూ.. వారి నియామకానికి ఉద్దేశించిన జీవో 90ని రద్దు చేశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీకి రాష్ట్రప్రభుత్వం సహకరించకపోవడాన్ని జస్టిస్ రామచంద్రరావు తన తీర్పులో తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం సహకరించనప్పుడు హైకోర్టును ఆశ్రయించి తగిన ఉత్తర్వులు పొందే అవకాశమున్నా, ఈసీ ఆ పని చేయకపోవడాన్ని తప్పుపట్టారు. హైకోర్టును ఆశ్రయించిన ఈసీ దీంతో ఈసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా నిర్దిష్ట కాల వ్యవధిలోపు బీసీలతో సహా అన్ని రిజర్వేషన్లను ఖరారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. గడువు ముగిసినా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంలో తమ తప్పేమీ లేదని, ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయకపోవడం వల్లే తాము ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లలేకపోతున్నామని, అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. -
పంచాయతీ ఓటర్ల జాబితాలను సిద్ధం చేయండి
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసిపోయిన దృ ష్ట్యా పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికల ను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో స రికొత్త ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడానికి అ ధికారులు శ్రీకారం చుట్టారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి రెండో వారంలోగా పంచాయతీల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయితే ముందస్తు శాసనసభ ఎన్నికలు, ఫలితాలు ము గిసిన తరువాత పంచాయతీల ఎన్నికల షెడ్యూ ల్ వెలువడే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించేనాటికి పంచాయతీ ల వారిగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి ఉద్యోగులకు నిర్దేశించారు. గతంలోనే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారిగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. అయితే ముందస్తు ఎన్నికల నేప థ్యంలో ఓటు హక్కుకు అర్హత ఉన్నవారు దర ఖాస్తు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ అవ కాశం కల్పించింది. దీంతో అనేకమంది ఓటర్ల జాబితాల్లో స్థానం దక్కించుకున్నారు. ఆయా శా సనసభ స్థానాల్లో కొత్త ఓటర్ల సంఖ్య పెరగడం తో కొత్త వారికి పంచాయతీ ఎన్నికల్లోను ఓటింగ్‌కు అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘం ని ర్ణయించింది. అలాగే వార్డుల ప్రకారం జాబితాలను సిద్ధం చేసి కులాల గణను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్త ఓటర్ల జాబితాలను ఈనెల 25వ తేది వరకు సిద్ధం చే యాలని పంచాయతీ ఉన్నతాధికారులు రెండు రోజుల కింద ఆదేశించారు. నిజామాబాద్ జి ల్లాలో 530 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జి ల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జా బితాల్లో చేర్చిన ఓటర్లు ఏ వార్డులకు సంబంధించిన వారో కూడా విభజించాల్సి ఉంటుంది. గ తంలో ఓటర్ల జాబితాలను ముద్రించిన దృష్ట్యా కొత్తగా చేర్చే ఓటర్లను జాబితాల్లో రాతపూర్వకంగానే రాసి సిద్ధం చేయాలని పంచాయతీ అధికారులు సూచించారు. శాసనసభ ఎన్నికల కోసం కొత్తగా ముద్రించిన ఓటర్ల జాబితాలను పంచాయతీల కార్యదర్శులు సేకరించి కొత్తగా చేరిన వారు ఏ వార్డుకు చెందిన వారు అని గుర్తించాల్సి ఉంది. అలాగే కు లాల గణనను కూడా పూర్తి చే యాల్సి ఉంది. ఓ టర్ల జాబితాల్లో మార్పులు చే ర్పులతో పాటు కు లాల వారిగా ఓటర్ల గణన కోసం కొన్ని రోజుల గడువు పెంచాలని కార్యదర్శులు కోరుతున్నారు. -
పంచాయతీల్లో ప్రత్యేక పాలన
కడప ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలనకే ప్రభుత్వం మొగ్గుచూపింది. ఉత్కంఠకు తెరదించుతూ స్పెషలాఫీసర్లను నియమించాలని జీఓ 90ని బుధవారం విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. పాలకవర్గాల గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పర్సన్ ఇన్చార్జులా లేక ప్రత్యేకాధికారుల పాలనా అనే దానిపై మొదటి నుంచి సందిగ్ధం నెలకొంది. దీనిపై రాష్ట్రప్రభుత్వం నోరు మొదపకపోవడంతో సర్పంచ్‌లలో ఆందోళన నెలకొంది. ఎన్నికలు లేవని తేల్చుకున్న సర్పంచ్‌లు కనీసం పర్సన్ ఇన్‌చార్జులుగానైనా కొనసాగించాల ని డిమండ్ చేస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించగా దీనిపై కోర్టు కూడా పర్సన్ ఇన్చార్జులుగా సర్పంచ్‌లను నియమించడంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా ఆదేం తమకు పట్టదన్నట్లుగా రాష్ట్రప్రభుత్వం స్పెషలాఫీసర్లను నియమించాల ని జీఓను విడుదల చేసింది. అంటే ఈ ప్ర భుత్వానికి కోర్టులపైన ప్రజాస్వామ్యంపై ఎంత గౌరవం ఉందో ఇట్టే అర్థమవుతుం దని సర్పంచ్‌లు విమర్శిస్తున్నారు. ఓటర్ల జాబితాను ప్రకటించినా.. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వం ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాల ని ఎన్నికల కమిషన్ అధికారులను అదేశిం చింది. ఈ మేరకు అధికారులు గత నెలలోనే ఓటర్ల జాబితాను ప్రచురణ కూడా చేశారు. మొదలైన కసరత్తు ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని జీఓ విడుదల చేయడంతో జిల్లా పంచాయతీ అధికారులు స్పెషలాఫీసర్ల నియామకానికి కరసత్తు మొదలుపెట్టారు. మండలస్థాయిలో తహసీల్దారు. ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ స్థాయి తగ్గకుండా ఉండేవారిని నియమించాలని సూచించడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. స్పెషలాఫీసర్లు తాగునీటి సరఫరా, నూతన నిర్మాణాలకు అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, తాగునీటి సరఫరాలో పైపుల లీకేజీలను అరికట్టడం, మోటర్ల మరమ్మతులు, దుకాణాల పన్నుల వసూలు, తాగునీటిలో క్లోరినేషన్, రోడ్లను శుభ్రం చేయడం, కాల్వలను శుభ్రంచేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. ఓటమి భయంతోనే.. రాష్ట్రప్రభుత్వం అధికారంలో ఉండి కూడా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించపోవడం పై జిల్లాలో తీవ్రచర్చ సాగుతోంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను వాయిదా వేసుకుందని సర్పంచ్‌లు విమర్శి స్తున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించి ఓడిపోతే ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై చూపుతుందనే వెనుకంజ వేసిందని విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలనే పర్సన్ ఇన్చార్జులుగా కొనసాగించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పలువురు సర్పం చులు డిమాండ్ చేసినా వారి విన్నపాలను ఈ రాష్ట్రప్రభుత్వం తోసిపుచ్చుతే స్పెషలా ఫీసర్ల నియామకానికే మొగ్గుచూపింది. దీని పై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రగతికి ఆటంకం.. ప్రత్యేకాధికారుల పాలన వస్తే ప్రగతికి ఆటంకం ఏర్పడనున్నట్లు చర్చ సాగుతోంది. గ్రామాల్లో నీటి పథకాలు మరమ్మతులకు గురైనా, వీధిలైట్లు వెలగకపోయినా ప్రజా అవసరాల దృష్ట్యా సర్పంచ్‌లు తమ జేబు నుంచి ఖర్చుచేసి పనులను సవరించేవారు. తర్వాత నిదానంగా నిధులు వచ్చినప్పుడు బిల్లులు పెట్టుకుని డబ్బులను డ్రా చేసుకునేవారు. ప్రత్యేక పాలనలో ఆ స్వేచ్ఛ ఉండ దు. నిబంధనల ప్రకారం అన్నీ జరగాల్సిందే. ఇలా అయితే ప్రజలు ఇబ్బందుల పాలు కాక తప్పదని సర్పంచ్‌లు చెబుతున్నారు. -
కేసీఆర్‌దే కపటప్రేమ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ దీటైన కౌంటర్ ఇచ్చింది. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని నిందించే అర్హత కేసీఆర్‌కు లేదని, బీసీలపై టీఆర్ఎస్దే కపట ప్రేమ అని ఆరోపించింది. తన అసమర్థతను, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్ బట్టకాల్చి మా మీద వేసి మమ్మల్ని బదనాం చేయాలనే దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడింది. నిజంగా సీఎం కేసీఆర్‌కు బీసీ రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని, ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేసింది. అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, దామాషా పద్ధతిన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, తాము బేషరతుగా మద్దతిస్తామని ప్రకటించింది. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా తాము కోర్టులో కేసు వేశామని చెప్పడం శుద్ధ అబద్ధమని, అసలు ఆ కేసులకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడగా.. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 52 శాతం పెట్టాల్సింది: దాసోజు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కేసీఆర్‌కు ఇష్టం లేదని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ‘1999లో 34 శాతం రిజర్వేషన్లు పెట్టి చట్టాన్ని ఆమోదిస్తే 2018లోనూ ఇదే శాతాన్ని పెట్టడం వెనుక ఔచిత్యం ఏంటి? శాస్త్రీయ పద్ధతి కాకుండా పాత చట్టాన్ని కాపీ చేయడం ఏ మేరకు న్యాయం? జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని అనేక వేదికల మీద విజ్ఞప్తి చేశాం. సమగ్ర కుటుంబ సర్వేలో 52 శాతం బీసీలున్నారని చెప్పి 34 శాతం రిజర్వేషన్లు ఉండాలని చట్టంలో ఏ ప్రాతిపదికన పెట్టారు? అంటే మిగిలిన 18 శాతం మందికి రిజర్వేషన్లు అవసరం లేదని అనుకుంటున్నారా?’అని మండిపడ్డారు. ‘ఈ విషయంలో బీసీ ప్రజలు, కుల సంఘాలు లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి ఉంది. 34 శాతం ఎలా ఇచ్చారో కొట్లాడాలి. పోరాటం చేయాలి. బీసీ కులాల వర్గీకరణ జరిగితే ముస్లింలు కూడా సర్పంచ్‌లు, ఎంపీటీసీలయ్యే అవకాశం వస్తుంది’అని పేర్కొన్నారు. ‘స్వప్నారెడ్డి అనే వ్యక్తి కేసు వేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ కేసుతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. స్వప్నారెడ్డి అంటే కాంగ్రెస్ వ్యక్తి అంటున్నారు. మరి గోపాల్‌రెడ్డి ఎవరు? నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని గున్యాగుల ఎంపీటీసీనా కాదా.. ఆయన టీఆర్ఎస్ సభ్యుడా కాదా చెప్పాలి. మరి మీ సభ్యుడు కేసు ఎలా వేశారు.. మీరేమైనా వేయమని చెప్పారా?’అని ప్రశ్నించారు. కోర్టులెన్ని మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గురాదు: షబ్బీర్, పొంగులేటి కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గురాదని షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ‘2013 ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. 50 శాతం నిబంధనను పక్కనపెట్టి 61 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. ఇంత పెద్ద సమస్యపై కోర్టులో వాదనలు జరుగుతుంటే అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వ పక్షాన ఎందుకు హాజరు కాలేదు. నేను చెప్పిందే చట్టం అని కేసీఆర్ అనుకుంటున్నందునే ఈ సమస్య. ఇప్పటికైనా ఈ విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి’అని వారు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌వి బోగస్ మాటలు: ఉత్తమ్ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తే తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు’అని ఉత్తమ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రిజర్వేషన్లపై బోగస్ మాటలు మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. ఎవరో హైకోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం తరఫున సరిగా వాదనలు వినిపించలేక తమపై నెపం మోపుతున్నారని ఆరోపించారు. ‘ప్రతిపక్ష పార్టీలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి చర్చ లేకుండా పంచాయతీరాజ్ చట్టం బిల్లు ఆమోదింపజేసుకున్నారు. చర్చ జరిగి ఉంటే బాగుండేది. అఖిలపక్షం ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చించాలి. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి’అని డిమాండ్ చేశారు. -
పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పోటీ
మిర్యాలగూడ : త్వరలో జరగనున్న గ్రామ పంచా యతీ ఎన్నికల్లో తెలంగాణ జన పార్టీ సమితి పోటీలో ఉంటుందని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జ్ గవ్వ విద్యాధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంతో పాటు అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు 80 మంది సీపీఎం నాయకుడు శ్రీనునాయక్ ఆధ్వర్యంలో జనసమితి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విద్యాధర్‌రెడ్డి మాట్లాడుతూ 2019లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో తెలంగాణ జన సమితిని తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే సైనికుడిలాగా పని చేయాలన్నారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ క్రాంతికుమార్, నాళ్ల అంజయ్య, దుర్గ, కొమ్ము నాగేందర్, మల్లారెడ్డి, శ్రీనునాయక్, బాల షహీద్, నవీన్, జివ్లా తదితరులున్నారు. -
హింసాత్మకంగా ఎన్నికల పోలింగ్