
సాక్షి, హైదరాబాద్: గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆ ఎన్నికల్లో చేసిన ఖర్చుకు సంబంధించిన లెక్కలను చెప్పకపోవడంతో, వారిని మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధిస్తూ ఎన్నికల సంఘం 2017లో జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఖర్చులు చెప్పని అభ్యర్థులు మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులంటూ ఎన్నికల సంఘం జారీ చేసి న ఉత్తర్వులను సవాల్ చేస్తూ సంగారెడ్డి, నిజా మాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇలా దాదాపు 100 పిటిషన్ల వరకు దాఖలయ్యాయి.
ఈ వ్యాజ్యాలపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు విచారణ జరి పా రు. ఈ సందర్భంగా పిటిషన ర్ల తరఫు న్యాయవాది జల్లి కనకయ్య వాదనలు వినిపిస్తూ, 2013 ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలను ఇవ్వని వారి విషయంలో 2017లో నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. ఇదే విషయా న్ని 2013లోనే లేవనెత్తి ఉంటే సమస్య ఉండేది కాదని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలో కి తీసుకున్న న్యాయమూర్తి, ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలి పేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. గిరిజన గ్రామా ల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై జోక్యానికి హైకోర్టు నిర్ణయించింది. ఈ వ్యవహారంపై సంక్రాంతి సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ఏర్పాటైన ఈ న్యాయస్థానం అంత అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ను ఈ నెల 30కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment