సాక్షి, అమరావతి : జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగ్రీవాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసేందుకే ప్రోత్సాహకం ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. గతేడాదే ఏకగ్రీవాలకు ప్రభుత్వం నజరానా ప్రకటించగా.. తాజాగా 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షల ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. 2వేల నుంచి 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే 10వేలకు పైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు పేర్కొంది. చదవండి: ‘ఎస్‌ఈసీ అలా ఎందుకు చెప్పలేదు..?
Comments
Please login to add a commentAdd a comment