
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న విద్యాధర్‌రెడ్డి
మిర్యాలగూడ : త్వరలో జరగనున్న గ్రామ పంచా యతీ ఎన్నికల్లో తెలంగాణ జన పార్టీ సమితి పోటీలో ఉంటుందని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ గవ్వ విద్యాధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంతో పాటు అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు 80 మంది సీపీఎం నాయకుడు శ్రీనునాయక్ ఆధ్వర్యంలో జనసమితి పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా విద్యాధర్‌రెడ్డి మాట్లాడుతూ 2019లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో తెలంగాణ జన సమితిని తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే సైనికుడిలాగా పని చేయాలన్నారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ క్రాంతికుమార్, నాళ్ల అంజయ్య, దుర్గ, కొమ్ము నాగేందర్, మల్లారెడ్డి, శ్రీనునాయక్, బాల షహీద్, నవీన్, జివ్లా తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment