![Prof Kodandaram Demands 6 Lakh Ex Gratia For Vemulakonda Accident Families - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/25/Kodandaram.jpg.webp?itok=3vi0a8o3)
మాట్లాడుతన్న తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం
సాక్షి, నల్గొండ : సవాళ్లు విసురుకోవటం అనేది తన దృష్టిలో వికృతమైన చర్యని, రాజకీయాల పట్ల వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. సోమవారం నల్గొండలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములకొండ మృతులకు ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా కూరగాయల బేరంలాగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న మంత్రిగారు వ్యంగంగా 50 లక్షలు కావాలా అని వ్యాఖ్యానించటం చాలా దురదృష్టకరమన్నారు.
ఎక్స్‌గ్రేషియా విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని, కనీసం 6లక్షలైనా ప్రమాణంగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని పార్టీలు సిద్ధంగా ఉంటాయన్నారు. ఆదివారం ట్రాక్టర్ మూసీ కాలువలో బోల్తాపడిన ఘటనలో వేములకొండకు చెందిన 15మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment