6 పంచాయతీలు ఏకగ్రీవం | AP Panchayat Elections : 6 Sarpanches Elected Unanimously In Ananthapur | Sakshi
Sakshi News home page

6 పంచాయతీలు ఏకగ్రీవం

Published Fri, Feb 5 2021 8:15 AM | Last Updated on Fri, Feb 5 2021 8:22 AM

AP Panchayat Elections : 6 Sarpanches Elected Unanimously In Ananthapur - Sakshi

అనంతపురం: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ రోజైన గురువారం ఆయా పంచాయతీలకు నామినేషన్లు వేసిన వారిలో పలువురు ఉపసంహరించుకోగా.. ఆరు పంచాయతీల్లో మాత్రం ఒక్కో నామినేషనే మిగిలింది. దీంతో కదిరి మండలం ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్‌గా శుభలేఖ, గాండ్లపెంట మండలం జీపీ తండా సర్పంచ్‌గా భూక్యా రవీంద్రనాయక్, నల్లమాడ మండలం కొండకింద తండా సర్పంచ్‌గా డుంగావత్‌ పార్వతి, బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా సర్పంచ్‌గా విజయకుమారిబాయి, కొత్తచెరువు మండలం లింగారెడ్డిపల్లి సర్పంచ్‌గా హరిత, పుట్టపర్తి మండలం చెర్లోపల్లి సర్పంచ్‌గా లీలావతి ఏకగ్రీవమయ్యారు.

అలాగే తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తున్న పలు పంచాయతీల్లోని వార్డు స్థానాలు కూడా ఏకగ్రీమయ్యాయి. ఆయా పంచాయతీల్లోని వారంతా కలసికట్టుగా గ్రామాల అభివృద్ధికి తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రజాప్రతినిధులు స్వాగతించారు. కాగా తొలివిడతలో కదిరి డివిజన్‌ పరిధిలోని 12 మండలాల్లో 169 పంచాయతీలు, 1,714 వార్డు స్థానాలకు ఈనెల 9న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ గురువారం ముగియడంతో బరిలో నిలిచే అభ్యర్థులను పంచాయతీల వారీగా అధికారులు ధ్రువీకరించారు.  

సర్పంచ్‌ బరిలో 462 మంది
తొలి విడతలో 163 పంచాయతీలకు ఎన్నికలు జరVýæనుండగా 462 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా పంచాయతీల్లోని మొత్తం 1,714 వార్డులుండగా..715 వార్డులు ఏకగ్రీవమయ్యారు. తక్కిన 987 వార్డులకు 2,030 మంది బరిలో నిలిచారు. గుర్తులు కూడా కేటాయించడంతో చాలా మంది గురువారమే ప్రచారం చేయడం కనిపించింది. కాగా కదిరి డివిజన్‌ పరిధిలోని పంచాయతీలకు శుక్రవారం జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి బ్యాలెట్లు, బ్యాలెట్‌ బాక్సులు, ఇతర ఎన్నికల నిర్వహణ సామగ్రిని తరలించనున్నారు. 

కదిరి నియోజకవర్గంలో రెండు   
కదిరి అర్బన్‌/గాండ్లపెంట: తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న కదిరిలో నామినేషన్ల ఉపసంహరణ రోజు రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కదిరి మండలంలోని ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్‌గా బరిలో నిలిచిన వలంటీర్‌ నారిక శుభలేఖ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి శుభలేఖతో పాటు మానస, గౌతమి, నారాయణమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే గురువారం మిగతా ముగ్గురూ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో నారిక శుభలేఖ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

ఇక గాండ్లపెంట మండలం తుమ్మలబైలు తండా సర్పంచ్‌ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయగా, గురువారం ముగ్గురు ఉపసంహరించుకోవడంతో బి.రవీంద్రనాయక్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటరి్నంగ్‌ అధికారి లక్ష్మీప్రియ ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన శుభలేఖ, బి.రవీంద్రనాయక్‌లను ఎమ్మెల్యే డాక్టర్‌ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి అభినందించారు. పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. 

పుట్టపర్తి నియోజకవర్గంలో నాలుగు  
పుట్టపర్తి: నియోజకవర్గంలో నాలుగు పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నల్లమాడ మండలం కొండకింద తండా సర్పంచ్‌గా పార్వతీ, బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా సర్పంచ్‌గా విజయకుమారిబాయి, కొత్తచెరువు మండలం లింగారెడ్డిపల్లి సర్పంచ్‌గా పాటిల్‌ హరిత, పుట్టపర్తి మండలం చెర్లోపల్లి సర్పంచ్‌గా లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందరినీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అభినందించారు. 

విజయకుమారిని వరించిన అదృష్టం
బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా సర్పంచ్‌ స్థానానికి ఇద్దరు నామినేషన్‌ వేయగా.. గురువారం ఓ అభ్యరి్థని నామినేషన్‌ ఉపసంహరించుకోగా..  విజయకుమారిబాయి ఏకగ్రీవమయ్యారు.   పుట్టపర్తి మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలుకాగా, సరస్వతి గురువారం నామినేషన్‌ ఉపసంహరించుకోగా.. లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement