Andhra Pradesh Panchayat By Polls Results Updates - Sakshi
Sakshi News home page

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం

Published Sat, Aug 19 2023 3:42 PM | Last Updated on Sun, Aug 20 2023 11:05 AM

Andhra Pradesh Panchayat by polls Results Updates - Sakshi

సాక్షి, గుంటూరు: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ బోల్తా పడింది. ఎన్నికలు జరిగిన జిల్లాల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 34 సర్పంచ్‌, 245 వార్డు మెంబర్ల స్థానాలకు  ఉప ఎన్నికలు జరిగాయి.

నెల్లూరు: 

మనుబోలు మండలం,బండేపల్లి మూడో వార్డులో ఒక్క ఓటుతో వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థి ఆవుల పొలమ్మ విజయం.

చేజర్ల మండలం పాతపాడు లో రీకౌంటింగ్ లోను సమాన ఓట్లు రావడంతో  లాటరీ నిర్వహించిన అధికారులు.  లాటరీలో వైసీపీ అభ్యర్థి  షేక్.మస్తాన్ బి విజయం

ఏలూరు:  

దెందులూరు మండలం,కొవ్వలి గ్రామంలో జరిగిన 11వ వార్డు ఎన్నికలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మొండి శ్రీను 288 ఓట్ల మెజారిటీతో విజయం.

పెదపాడు మండలం, పాత ముప్పర్రు గ్రామంలో జరిగిన  10వ వార్డు ఎన్నికలలో వైఎస్సార్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గొట్టపు సోమేశ్వరి 26 ఓట్ల మెజారిటీతో విజయం.

జీలుగుమిల్లి గ్రామంలో 6వ వార్డు ఉప ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన  మడకం ధనరాజు 42ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

పెదపాడు మండలం  వీరమ్మ కుంట గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు. మరడాని వెంకట లక్ష్మణ సోమేశ్వరరావు 286 ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మరడన నాగబాబును ఓడించారు.

వణుదుర్రు సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు గెలుపు

పశ్చిమగోదావరి: 

పాలకొల్లు మండలం గోరింటాడా గ్రామపంచాయతీ ఆరో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి పీతల యమున దుర్గ చంద్రకళ 15 ఓట్ల మెజారిటీతో గెలుపు.

పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో ఆరో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి అంగర రామలక్ష్మి 10 ఓట్ల మెజారిటీతో గెలుపు.

వీరవాసరం మండలం మత్యపురి గ్రామం ఒకటో వార్డు లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన కారేంపల్లి విజయలక్ష్మి 167 ఓట్ల మెజారిటీతో గెలుపు. 


కృష్ణా: 

బంటుమిల్లి 4 వ వార్డుకి వైఎస్సార్‌సీపీ బలపర్చిన గొల్ల సృజన విజయం


ఎన్టీఆర్‌:
తిరువూరు మండలం ఎర్రమాడు ఉప ఎన్నికలో ఏడో వార్డు అభ్యర్థిగా YSRCP బలపరిచిన చలివేంద్ర హరిబాబు  విజయం.

తూర్పు గోదావరి:

రాజానగరం మండలం పల్ల కడియం గ్రామంలో జరిగిన వార్డు సభ్యుల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన పెండ్యాల అరుణ సమీప అభ్యర్థి చేవా ప్రమీలపై విజయం సాధించారు.

రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో జరిగిన వార్డు సభ్యుల ఎన్నికలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన తాతపూడి  సత్యవతి విజయం సాధించారు.

అనంతపురం:

తాడిపత్రి నియోజకవర్గం లో వైఎస్సార్ సీపీ హవా. టీడీపీ కి జేసీ బ్రదర్స్ కు ఎదురుదెబ్బ. జేసీ సొంత మండలం పెద్దపప్పూరు లో టీడీపీకి చేదు అనుభవం 

తాడిపత్రి నియోజకవర్గం లో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం

► దేవునుప్పలపాడు పంచాయతీ లో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య సర్పంచ్ గా ఎన్నిక

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి మెజారిటీ స్థానాలు

చలివెందుల, దేవునుప్పలపాడు పంచాయతీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం

33 వార్డుల్లో వైఎస్సార్ సీపీ విజయం

21 వార్డుల్లో టీడీపీ మద్దతుదారుల గెలుపు 

తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, పెనుకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో సత్తా చాటిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులు

శ్రీసత్యసాయి జిల్లా:
హిందూపురం లో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ
► హిందూపురం మండలం చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారు ఉపేంద్ర రెడ్డి 337 ఓట్లతో విజయం

చిత్తూరు జిల్లా
కుప్పం నియోజకర్గంలో కొనసాగుతున్న  వైఎస్సార్ కాంగ్రెస్ ఆధిపత్యం
► శాంతిపురం మండలం కడపల్లి పంచాయితీ 10 వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు దారుడు  సుధాకర్  ప్రత్యర్థి ప్రకాష్ పై 47 ఓట్లుమెజారిటీతో గెలుపు

అనకాపల్లి జిల్లా:
నక్కపల్లి మండలంలో రేబాక చిన దొడ్డిగల్లులలో రెండు వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం

శ్రీకాకుళం జిల్లా:
టెక్కలి మండలం నరసింగపల్లి పంచాయతీ జగన్నాధపురం ఏడో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి  పావని 124 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 219 ఓట్లు గాను 156 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీ బలపరిచిన అభ్యర్థి పావనికు 124 ఓట్లు రాగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి సింగపురం మోహిని కు 28 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.

నరసన్నపేట మండలం కొమర్థి లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి. లబ్బ రాజారావు 24 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థికి 50 ఓట్లు రాగా వైసీపీ బలపరచిన అభ్యర్థికి 74 ఓట్లు వచ్చాయి.

సారవకోట మండలం బద్రి సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థి మజ్జి అసిరమ్మ గెలుపు సాధించారు.

నందిగాం మండలం అన్నపురం పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్ధి బార్నాన ఇంద్రవేణి 89 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 775 ఓట్లకు 633 ఓట్లు పాలయ్యాయి. ఇందులో వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్ధి ఇంద్రవేణికు 353, టీడీపీ బలపర్చిన అభ్యర్ధి బర్నాన తిరుపతిరావు కు 264 ఓట్లు వచ్చాయి

బూర్జ మండలం పెదలంకాం సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి కాకితాపల్లి గోవిందరావు గెలుపు సాధించారు.




No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement