జైపూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూనకు మరోసారి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ఆరోగ్యం బాగోలేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆశారామ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. బాపు బెయిల్ పిటిషన్ ఇంతకుముందు రాజస్థాన్ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టు కూడా తిరస్కరించాయి. 2013లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నాడు.
వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాతే బెయిల్ పిటిషన్ను విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బాపును పరీక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఎయిమ్స్ను ఆదేశించింది. పది రోజుల లోపు నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్కు గడువు విధించింది.
వివాదాస్పద గురువుకు మళ్లీ నిరాశ
Published Mon, Sep 5 2016 5:29 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement